YSRCP: సీఎం జగన్ విదేశీ పర్యటన నుంచి రాగానే బిగ్ ఛేంజ్! పార్టీ నేతలందరిలో అదే ఉత్కంఠ!
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 10 లేదా 11వ తేదీన తిరిగి విజయవాడకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ముఖ్యమంత్రి జగన్ విదేశాల్లో ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మాత్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జగన్ తిరిగి రాగానే ఏదో భారీ మార్పు ఉంటుందనే ప్రచారం పార్టీలో జరుగుతుంది.
వైఎస్ఆర్ సీపీలో హై టెన్షన్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆయన ఈ నెల 10 లేదా 11వ తేదీన తిరిగి విజయవాడకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి 9వ తేదీనే ఆయన తిరిగి రావాల్సి ఉన్నా, అనివార్య కారణాల వలన పర్యటన షెడ్యూల్ రెండు రోజుల పాటు పొడిగించారని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఉత్కంఠంగా జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. జగన్ విదేశాల నుండి వచ్చిన తరువాత కూడాా ఒకటి రెండు రోజులు రెస్ట్ తీసుకునే అవకాశం ఉందని కూడాా పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, ఇదే సమయంలో ఎన్నికలకు సంబందించిన ప్రణాళికలు కూడాా రెడీ అవుతున్నాయని చెబుతున్నారు. జగన్ విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తరువాత ఆయన దృష్టి అంతా ఎన్నికల పైనే ఉంటుందని అంటున్నారు.
కేంద్రం నిర్ణయానికి అనుగుణంగానే
రాష్ట్రంలో ఎన్నికలతో పాటుగా దేశ వ్యాప్తంగా జరిగే ఎన్నికలపై కూడా ఇప్పడు పెద్ద చర్చే జరుగుతుంది. ఎన్నికలకు సంబంధించిన వ్యవహరంలో కేంద్రం తీసుకునే నిర్ణయానికి వైఎస్ఆర్ సీపీ కూడా కట్టుబడి ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అందులో భాగంగానే జమిలి ఎన్నికలు జగన్ సై అంటారని, విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పార్టీ వర్గాలతో ప్రత్యేకంగా సమావేశం జరుగుతుందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడు నెలలు సమయం ఉంది. అయినప్పటికి ఎడాది ముందు నుంచే ఎన్నికలకు సంబందించిన ఫీవర్ రాష్ట్రంలో పెరిగిపోయింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో పాటుగా, దాడులు, ప్రతి దాడులు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా అవసరం అయితే ముందుగానే ఎన్నికలకు వెళ్లేందుకు కూడా అవకాశాలు లేకపోలేదనే ప్రచారం కూడా పార్టీ లో జరుగుతుంది.
అటు ఐటీ నోటీసులు వ్యవహరం
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుపై ఇప్పటికే ఐటీ నోటీసులు కేంద్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురు దాడి ప్రారంభించింది. అవినీతి ఆరోపణల వేళ కనీసం చంద్రబాబు బదులు ఇచ్చేందుకు కూడా ముందుకు రాకపోవటం, ఆయన అవినీతికి అద్దం పడుతుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంగా కనిపిస్తోంది. వరుసగా పార్టీ కీలక నేతలు, మంత్రులు కూడా చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధాని పేరుతో అవినీతికి పాల్పడిన వ్యవహరంలో కేంద్ర దర్యాప్తు సంస్ద నోటీసులు ఇస్తే వాటిని దాచి పెట్టటంతో పాటుగా బదులు ఇవ్వటానికి కూడా ఇష్టపడకపోగా, ఎదురు ప్రశ్నించడం ద్వారా చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.
అటు లోకేష్ యువగళం
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారింది. లోకేష్ యువ గళం యాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని అందులో భాగంగా యాత్రను అడ్డుకొని, దాడులకు పాల్పడుతున్నారని తెలుగు దేశం పార్టీ ఫైర్ అవుతుంది. అయితే ఇదే సమయంలో పోలీసులు కూడా తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకులపైనే కేసులు బనాయిస్తున్నారు. అనుమతి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా యువ గళం పాదయాత్ర నిర్వహిస్తుంటే, అడ్డుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను వదిలి పెట్టి తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకులపై కేసులు పెట్టటంపై తెలుగు దేశం నేతలు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు.
ఈ మేరకు డీజీపిని కలిసి కూడా ఫిర్యాదు చేశారు. మెత్తం మీద జగన్ విదేశీ పర్యటన నుండి తిరిగి వచ్చిన తరవాత కీలక నిర్ణయాలు ఉంటాయని , అందులో భాగంగానే రాజకీయ వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయని పొలిటిక్ సెక్టార్స్ లో టాక్ నడుస్తోంది.