AP News: పవన్ వారాహి యాత్రపై వైసీపీలో కీలక చర్చ, ఎప్పటికప్పుడూ నివేదికలపై ఫోకస్
వైసీపీ నేతలు జనసేనాని పవన్ కళ్యాణ్ పై రాజకీయంగా ఎదురు దాడి కొనసాగిస్తున్నారు. అదే సమయంలో పవన్ వారాహి యాత్రలకు వస్తున్న పబ్లిక్ రెస్పాన్స్ పై సైతం వైసీపీ నేతల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
YSRCP leaders Focus on Pawan Varahi Yatra:
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జనసేనాని పవన్ కళ్యాణ్ పై రాజకీయంగా ఎదురు దాడి కొనసాగిస్తున్నారు. అదే సమయంలో పవన్ వారాహి యాత్రలకు వస్తున్న పబ్లిక్ రెస్పాన్స్ పై సైతం వైసీపీ నేతల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
పవన్ యాత్ర.. అక్కడ ...ఇక్కడ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై అధికార పార్టిలో పెద్ద చర్చే జరుగుతోంది. అందులో భాగంగానే వైసీపీకి చెందిన కీలక నేతలు, మంత్రులు పవన్ కు కౌంటర్ ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు. పవన్ చేసిన కామెంట్స్ పై విశాఖపట్టణం కేంద్రంగా మంత్రి అమర్నాథ్ జనసేనాని పవన్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. ఇక మంత్రులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ సైతం పవన్ పై పొలిటికల్ కామెంట్స్ చేయటం పరిపాటిగా మారింది. అయితే ఇదే సమయంలో పవన్ వారాహి యాత్రకు వస్తున్న స్పందనపై వైసీపీలో అంతర్గతంగా పరిశీలనతో పాటుగా, చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్ వారాహి యాత్ర చేసిన సమయంలో భారీ స్పందన వచ్చిందని అయితే విశాఖపట్టణం లో పవన్ నిర్వహించిన వారాహి యాత్రకు అభిమానులు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవని అంటున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రెస్పాన్స్...
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇటీవల పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహి యాత్రకు అభిమానులు నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది. దీనిపై పార్టీలో కూడ పెద్ద చర్చే జరిగింది. దీంతో అప్రమత్తం అయిన ఏపీ మంత్రులు పవన్ కు వరుస పెట్టి కౌంటర్లు ఇచ్చారు. ఇక అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ కూడా వరద బాధిుతులను పరామర్శించేందుకు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఆ తరువాత కూడ సున్నా వడ్డీ రుణాల పంపిణి కూడ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టింది. ఇదే వేదిక పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడ పవన్ తో పాటుగా, చంద్రబాబు కూడ కౌంటర్ ఇచ్చారు.
పవన్ వారాహిని లారీతో పోల్చిన జగన్ ఉత్తరాంధ్రలో పవన్ చేసిన కామెంట్స్ ను ఆధారంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్ నిర్వహించిన వారాహి యాత్రకు వచ్చిన స్పందనపై అధికార పార్టీకి పోలీసులు, నిఘా వర్గాల నుంచి కూడా సమాచారం తెప్పించారు. అయితే విశాఖపట్టంలో నిర్వహించిన వారాహి యాత్రకు ఆశించిన స్థాయిలో అభిమానుల నుంచి స్పందన లభించలేదని నిఘా వర్గాలు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
పవన్ కామెంట్స్ పై మరింత దూకుడు...
వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నాయకత్వాన్ని అలర్ట్ చేస్తున్నారు. అటు పొత్తుల అంశం పై క్లారిటీ లేకపోవంతో అభ్యర్థుల వ్యవహరం తీసుకురాకుండానే, కేవలం జగన్ ను టార్గెట్ గా చేసుకొని పవన్ కామెంట్స్ చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో పవన్ చేస్తున్న కామెంట్స్ పై మరింత దూకుడుగా వ్యవహరించాలని వైసీపీ నాయకులకు, పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కామెంట్స్ పై మంత్రులు రియాక్ట్ అవుతూనే, కౌంటర్లు ఇస్తున్నారు. అయితే అదే సమయంలో పవన్ టూర్ జరిగిన నియోజకవర్గాల వారీగా రాజకీయ ఎత్తుగడలతో పోటా పోటీగా కార్యక్రమాలు ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి భావిస్తుందని చెబుతున్నారు.