Kurnool YSRCP Wall Disupte : రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేసిన వైఎస్ఆర్‌సీపీ నేత - అడ్డుకున్న వాళ్లను ఏం చేశారంటే ?
కర్నూలులో గోడ వివాదంలో గ్రామస్తులపై దాడి చేశారు వైఎస్ఆర్‌సీపీ నేత. ఈ ఘటనపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kurnool YSRCP Wall Disupte : కర్నూలు జిల్లా ( Kurnool ) వెల్దుర్తిలో అనకాల వీధిలో రోడ్డుకు అడ్డంగా ఓ వైఎస్ఆర్‌సీపీ నేత గోడను కట్టడం వివాదాస్పదం అయింది. గ్రామంలోని ఓ వర్గం గోడను కట్టవద్దని అడ్డుకుంది. అయితే వారిపై గోడను కట్టిస్తున్న వైఎస్ఆర్‌సీపీ నేత సమీర్ రెడ్డి ( Sameer Reddy ) వర్గీయులు రాళ్ల దాడి చేశారు.
విజయవాడలో ఫుట్‌బాల్ ప్లేయర్ దారుణహత్య, శరీరంపై 16 కత్తిపోట్లు - గ్యాంగ్ వార్‌తో విషాదం !
కొన్నాళ్లుగా వెల్దుర్తిలో గోడ వివాదం ఉంది. అనకల కాలనీలో రహదారికి అడ్డంగా.. అక్రమంగా గోడ నిర్మిస్తుండగా అడ్డుకున్న కాలనీ వాసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 10 మందికి గాయాలయ్యాయి. వీరిలో 8 మంది మహిళలు ఉన్నారు. గతంలో గోడ నిర్మిస్తుండగా అడ్డుకున్నారు. ఈ విషయమై వెల్దుర్తి ఎమ్మార్వో ఆఫీసులో ఫిర్యాదు చేయగా గోడను నిర్మించకూడదని ఈ నెల 25న పంచాయతీలో తీర్మానించారు.
ఈ నగరానికి ఏమైంది? ఒకేరోజు అటు సూసైడ్, ఇటు మర్డర్! ఒకదానికొకటి లింక్
అయితే పంచాయతీ తీర్మానాన్ని వైఎస్ఆర్‌సీపీ నాయకుడు సమీర్ రెడ్డి ఉల్లంఘించారు. ఉదయం రహదారికి అడ్డంగా గోడ కడుతుండగా కాలనీవాసులు అడ్డుకున్నారు. మహిళలు అని కూడా చూడకుండా రాళ్లు, ఇటుకలతో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలపై పోలీసులు.. అధికారులు వేగంగా స్పందించకపోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గతం నుంచి రెండు గ్రూపుల మధ్య పోరాటం ఉండటంతో పరిస్థితి మరింత దిగజారింది.
ఈ ఘటనపై నారా లోకేష్ ( Nara Lokehs ) స్పందించారు. మహిళలు, పిల్లలని చూడకుండా సీసాలు, రాళ్లతో కొట్టడం వైసీపీ నేతల రాక్షసప్రవృత్తికి నిదర్శనమన్నారు. నలుగురు నడిచే రోడ్డుకడ్డంగా గోడ కట్టడమేంట్రా గాడిదా అని ఒక్క వైసీపీ నేతయినా సమీర్ రెడ్డికి గడ్డి పెట్టగలరా? అని ప్రశ్నించారు. సినిమాల్లో విలన్ల మాదిరి వైసీపీ నేతలు రెచ్చిపోతుంటే.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం మన దౌర్భాగ్యమని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ అరాచకాలకి వెల్దుర్తి ఘటన పరాకాష్ట.కర్నూలు జిల్లా వెల్దుర్తి అనకాల వీధికి అడ్డంగా వైసీపీ నాయకుడు సమీర్ రెడ్డి గోడ కడుతుండగా స్థానికులు అడ్డుకోవడాన్ని తట్టుకోలేక వారిపైనే దాడిచేయడం దారుణం.మహిళలు, పిల్లలని చూడకుండా సీసాలు,రాళ్లతో కొట్టడం వైసీపీ నేతల రాక్షసప్రవృత్తికి నిదర్శనం pic.twitter.com/qFmfyiItDi
— Lokesh Nara (@naralokesh) June 1, 2022