Sajjala On United State ; ఏపీ, తెలంగాణ కలపాలన్నదే వైఎస్ఆర్సీపీ విధానం - సజ్జల సంచలన ప్రకటన !
ఏపీ, తెలంగాణ కలపాలన్నదే తమ విధానమని వైఎస్ఆర్‌సీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటం లేదని ఉండవల్లి చేసిన విమర్శలు అసందర్భంగా ఉన్నాయన్నారు.
Sajjala On United State ; కుదిరితే ఏపీ, తెలంగాణలను కలపాలన్నదే తమ విధానమని .. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటం లేదని.. అలా అయితే జగన్ రాజకీయ జీవితం ముగిసిపోతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ పోరాడూతూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. సమైక్య రాష్ట్రాన్ని వైసీపీ గట్టిగా కోరుకుందని.. తాము ఎప్పుడూ ఉమ్మడి రాష్ట్రానికే మద్దతిస్తామన్నారు. మళ్లీ కలవడానికి ఏ వేదిక దొరికినా.. మా ప్రభుత్వం, పార్టీ దానికే ఓటు వేస్తుందన్నారు. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాలను కలిపే అవకాశం ఉందా అని సజ్జల సందేహం వ్యక్తం చేశారు. ఉండవల్లి వ్యాఖ్యలు అసందర్భంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించే క్రమంలో ఏ అవకాశాన్నీ తాము వదులుకోమని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటం లేదని ఉండవల్లి తీవ్ర ఆరోపణలు
బుధవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పోరాడకపోతే సీఎం జగన్ రాజకీయ జీవితం ముగిసిపోయినట్లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం విభజన అంశం గురించి వదిలేయాలని అఫిడవిట్ వేసిందని మండిపడ్డారు. ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు సి.ఎం జగన్ ఇలా వ్యవహరిస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. విభజన అన్యాయం గురించి మాట్లాడటానికి సి.ఎం జగన్ కు భయం ఎందుకున్నారు. జగన్ పోరాటం చేస్తారని ప్రజల్లో నమ్మకం పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎ.పికి అన్యాయంపై సి.ఎం జగన్ పోరాటం చేయాలని.. పోరాటం చేయకుంటే జగన్ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్టేనని హెచ్చరించారు. మోదీ, జగన్ కు మంచి సంబంధాలు ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న సుప్రీంకోర్టులో తది విచారణ జరగనుందిని... ఆ రోజుకైనా ఎ.పి ప్రభుత్వం అన్యాయం వివరిస్తూ అఫిడవిట్ వెయ్యాలని ఉండవల్లి సూచించారు. పిబ్రవరి 22న సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వంత తరపున వాదనలు విపించాలని జగన్మోహన్ రెడ్డిని వేడుకుంటున్నానని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
రెండు రాష్ట్రాలను కలపమని కోరడం లేదన్న ఉండవల్లి
రెండు రాష్ట్రాలను ఇప్పుడు కలపమని తాను కోరడం లేదని.. ఆనాడు జరిగింది అన్యాయం జరిగిందని అయినా చెప్పమంటున్నానని సీఎం జగన్‌కు ఉండవల్లి చెప్పారు. అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నా.. మేము కాంగ్రెస్ పార్టీకు మద్దతునిస్తున్నామని బీజేపీ నాయకురాలు సుష్మస్వరాజ్ ప్రసంగించారని గుర్తు చేారు. మాకు ఇవ్వాల్సిన స్పెషల్ కేటగిరి ఇవ్వాలి..విభజన నాటి హామీలు ఏమీ ఇవ్వడం లేదన్నారు. దయచేసి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని .. ఇంతటి అవకాశం వచ్చినప్పుడు ఏకపక్ష రాష్ట్ర విభజనపై అడ్వకేట్‌ను పెట్టి పోరాడాల్సిన అవసరం ఉందని జగన్‌కు సలహా ఇచ్చారు. తెలంగాణాలో ఆంధ్రకు రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులు సుమారు లక్ష కోట్లు ఉన్నాయన్నారు. దేశంలో 50రాష్ట్రాలుగా విడగొట్టాలన్నది బీజేపీ పాలసీ అని విమర్శించారు.
ఉండవల్లి చెప్పినట్లుగా అఫిడవిట్ దాఖలు చేయడంపై సూటిగా చెప్పని సజ్జల
అయితే ఉండవల్లి డిమాండ్ చేసినట్లుగా... రాష్ట్ర విభజన అంశంపై సుప్రీంకోర్టులో పోరాడటానికి.. అఫివిడట్ దాఖలు చేస్తారా లేదా అన్నదానిపై సజ్జల రామకృష్ణారెడ్డి సూటిగా సమాధానమివ్వలేదు. సుప్రీంకోర్టులో విచారణ వల్ల వచ్చేదేమీ లేదు.. పోయేదేమీ లేదని తేల్చేశారు. కానీ రాష్ట్రాన్ని కలిపే ఎలాంటి చాన్స్ అయినా వాడుకుంటామన్నారు.