YSRCP: కరెంట్ చార్జీల పెంపుపై దండెత్తిన వైఎస్ఆర్‌సీపీ - యాక్టివ్ అయిన క్యాడర్ !
Andhra Pradesh: కరెంట్ చార్జీల పెంపుపై వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ రోడ్డెక్కింది. పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.

YSRCP has protested against the increase in current charges: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత వరుసగా విద్యుత్ చార్జీలు పెంచుతున్నారని ఆరోపిస్తూ వైఎస్ఆర్‌సీపీ నిరసనలు నిర్వహించింది. ఎన్నికలకు ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తామన్నారు. విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చారని నేతలు గుర్తు చేశారు. ఇప్పటికే 15,500 కోట్ల పెను భారాన్ని పేదలపై మోపారని విమర్శించారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నారు. మీ భవిష్యత్తుకు మాది గ్యారంటీ అన్నారు.. ఒక్క హామీ కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేదని ధర్నాల్లో పాల్గొన్న నేతలు విమర్శలు గుప్పించారు.
ఒకేసారి విద్యుత్ ఛార్జీలు పెంచితే ప్రజలు తిరుగుబాటు చేస్తారని విడతల వారీగా పెంచుతున్నారని.. వెయ్యి రూపాయలు వచ్చే విద్యుత్ బిల్లు 1400 నుంచి 1500 వరకు వస్తుందన్నారు. ప్రజల మీద వేసే భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ కాలనీలో అంధకారంలోకి వెళ్లిపోయాయి.. 75 వేల కోట్ల అప్పు చేసిన డబ్బు ఏమైందని విశాఖలో ధర్నా చేసిన గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఒక్క రూపాయి అయినా పేదవాడికి పంచారా..బాబు షూరిటీ.. బాదుడు గ్యారెంటీ అనే తరహాలో చంద్రబాబు పాలన ఉందన్నారు.
చిత్తూరు జిల్లా:
— YSR Congress Party (@YSRCParty) December 27, 2024
విద్యుత్ చార్జీల బాదుడుపై చిత్తూరులో వైయస్ఆర్ సీపీ పోరుబాట.@ncbn పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ నినాదాలు..
చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ..
పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు… pic.twitter.com/aqL4LHbaFt
చంద్రబాబు అధికారంలో పెరిగినంతగా విద్యుత్ ఛార్జీలు ఏ ప్రభుత్వంలో పెరగలేదని వైసీపీ నేతలు విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంలో బషీర్ బాగ్ లో విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న వారిపై కాల్పులు జరిపారని గుంటూరులో ధర్నా చేసిన అంబటి రాంబాబు విమర్శించారు. బు మాకు11 మంది ఎమ్మెల్యేలు అని అనుకోకండి, మా వైపు నలభై శాతం ఓట్లున్నాయని హెచ్చరించారు. నేను ఎన్నో ప్రభుత్వాలు చూశాను కానీ ఇప్పుడు పెరిగినంత విద్యుత్ చార్జీలు ఏ ప్రభుత్వంలో పెరగలేదు కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.
కరెంట్ ఛార్జీల పెంపుపై వైయస్ఆర్సీపీ నిరసన హోరు
— YSR Congress Party (@YSRCParty) December 27, 2024
పుంగనూరులో నిరసన ర్యాలీలో పాల్గొన్న నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు.
జోరు వర్షంలోను అధికసంఖ్యలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
@ncbn… pic.twitter.com/m0XeD8yQxD
చంద్రబాబు మెడలో వంచి ఇచ్చిన హామీలను అమలు చేయిస్తామని పలు చోట్ల ధర్నాలో పాల్గొన్న వైసీపీ నేతలు ప్రకటించారు. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. రైతులు ధాన్యం కొనకుండా మోసం చేశారు. రైతులకు ఇంత పెద్ద ద్రోహం చేసింది ఒకే ఒక్కడు చంద్రబాబు అని నేతలు మండిపడ్డారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని పలు చోట్ల విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.





















