YSRCP On Attacks : దాడులపై మానవహక్కుల సంఘానికి వైసీపీ ఫిర్యాదు - పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణ
Andhra News : వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ పలు చోట్ల దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
YSRCP complaint to the Human Rights Commision : ఎన్నికల ఫలితాల అనంతరం తమ పార్టీ నేతలపై దాడులు ఆగడం లేదని వైసీపీ నేతలంటున్నారు. ఇటీవల పాలేటి రాజ్ కుమార్ అనే వ్యక్తిపై చేసిన దాడి గురించి మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. తనను ఇంటిలో నుండి బలవంతంగా కిడ్నాప్ చేసి హింసించారని, చంపుతామని ప్రతిరోజూ బెదిరిస్తున్నారని, కేసులు పెట్టినా పోలీసులు పట్టించుకోవట్లేదని పాలేటి రాజ్ కుమార్ ఆరోపించారు.
మానవ హక్కుల ఉల్లంఘన చేస్తున్న టీడీపీ గూండాల దాడిపై హ్యూమన్ రైట్స్ కమిషన్ కు లేఖలు రాసిన వైయస్ఆర్ సీపీ
— YSR Congress Party (@YSRCParty) June 15, 2024
తనను ఇంటిలో నుండి బలవంతంగా కిడ్నాప్ చేసి హింసించారని, చంపుతామని ప్రతిరోజూ బెదిరిస్తున్నారని, కేసులు పెట్టినా పోలీసులు పట్టించుకోవట్లేదని @ncbn, @naralokeshతో తమ కుటుంబ సభ్యుల… pic.twitter.com/OSJ8tzCMeT
ఇది ఒక్కటే కాదు దాడులు ఆగడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. పుంగనూరులో తమ నేత ఇంటిపై దాడి చేశారని సోషల్ మీడియాలో ఆరోపించారు.
పుంగనూరులో టీడీపీ నేతలు గూండాగిరి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇళ్ళు, కార్యకర్తలపై దాడులు
— YSR Congress Party (@YSRCParty) June 15, 2024
పుంగనూరులో వెంకటరెడ్డి యాదవ్ ఇంటిపై దాడి, హత్యాయత్నం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు
పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఉన్న మా ఇంటిపై దాడి చేసినా పోలీసులు… pic.twitter.com/YJkvuwnon1
విజయవాడలో తమ పార్టీ నేతల ఇల్లు కూలగొట్టారని వైసీపీ తెలిపింది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ కక్షసాధింపు చర్యలు
— YSR Congress Party (@YSRCParty) June 15, 2024
వైసీపీ నేతల ఆస్తులే లక్ష్యం
తెరవెనుక రాజకీయాలు చేస్తున్న ఎమ్మెల్యే బోండా ఉమా
వీఎంసీ అధికారులను ఉసిగొల్పి వైసీపీ నేతల ఆస్తులు కూల్చివేత
ప్రకాష్ నగర్ లో వైసీపీ నేత నందెపు జగదీష్ బిల్డింగ్ కూల్చివేత
కార్పొరేషన్ స్థలం… pic.twitter.com/ZWQzeUj0a4
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని వైసీపీ ఎంపీలు రాష్ట్రపతి ముర్ముకు కూడా ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్రపతి ని కోరారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆరోపించారు. ఏపీలో చట్టం లేదు. స్వేచ్ఛ లేదు. అన్యాయమే రాజ్యమేలుతోందని వాపోయారుఏపీలో టీడీపీ దాడులపై చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని అన్నారు. ఫలితాల అనంతరం జరిగిన దాడుల్లో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోయారని, రాష్ట్రంలో రాక్షసపాలన మొదలైందని విమర్శించారుసం ఫిర్యాదు చేస్తామన్న కూడా పోలీసులు ఫిర్యాదులు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ నీరుగారి పోయిందని ఆరోపిస్తున్నారు.