అన్వేషించండి

Jagan About Tirumala: తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్

Tirumala Laddu Controversy | తిరుమలలో కల్తీ నెయ్యి వివాదంపై స్పందించిన వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనపై ప్రజలు కోపంగా ఉండటంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.

YS Jagan Comments on Tirumala Row | తిరుమల లడ్డూలో నెయ్యికి బదులు జంతువు కొవ్వు వాడారాని ఓ ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మటాలేనా అని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా అబద్దాలు ఆడటం ధర్మమేనా అని విచారం వ్యక్తం చేశారు. కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా తిరుమలేశుడి భక్తులు ఉన్నారు వారందరిలో ఆందోళన కలగజేస్తున్నారు. నెయ్యి సప్లై, టెండర్లు ప్రక్రియ ఇప్పుడు కొత్తగా జరిగేది కాదు. ప్రతి ఆరు నెలలకోసారి రోటీన్‌గా జరిగే కార్యక్రమం. ప్రతి ఆరునెలలకోసారి ఆన్‌లైన్‌లో టెండర్లు పిలుస్తారు. వాటి ఆధారంగా కంపెనీలు వస్తాయి. అందులో ఎల్‌వన్‌గా వచ్చిన వాళ్లను పరిశీలించి బోర్డు అప్రూవల్ చేస్తుంది. రొటీన్‌గా జరిగే కార్యక్రమానికి సంబంధించి క్వాలిటీ చెక్‌ చేసే విధానం ఇప్పుడు ఏం మార్చలేదు. ఎప్పుడు నుంచో జరుగుతున్నదేన్నారు. వెంకటేశ్వర స్వామి లడ్డూలో వాడే పదార్థాలు నాణ్యత పరీక్షలు దశాబ్ధాల నుంచి జరుగుతున్నాయి. 

ఎవరు సప్లై చేసినా కూడా ప్రతి ట్యాంక్‌ నెయ్యితోపాటు వాళ్లు ఎన్‌ఏబీఎల్‌ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడెక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకురావాలి. ఇక్కడ టీటీడీలో ఆ ట్యాంకర్‌ నుంచి మూడు శాంపిల్స్ తీసుకొని చెక్ చేస్తారు. వాటిలో మూడు పాస్ కావాల్సి ఉంటుంది. ఈ మూడు టెస్టులు పాస్ అయిన తర్వాతే ఆ నెయ్యితోపాటు ఇతర వస్తువులు ప్రసాదంలో వాడుతుంది. లేకుంటే ఆ బండి కదలదు. కానీ ఇక్కడ రిజెక్ట్ అయితే వాడే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు వాడారని... అవి నాసిరకం అని చెప్పడం అబద్దం కాదా అని ప్రశ్నించారు. ఇది ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతున్నాను. అని జగన్ ప్రశ్నించారు.  

ఈ ప్రక్రియ అంతా ఎప్పటి నుంచో జరుగుతోంది. చంద్రబాబు హయాంలో 2014-19 మధ్య 14 నుంచి 15 సార్లు రిజెక్ట్ చేశారు. వైసీపీ హయాంలో 18 సార్లు రిజెక్ట్ చేశారు. దీనికి సంతోషించాలి. ఓ మంచి ప్రాక్టీస్‌ ఉందని సంతోష పడాల్సింది పోయి... అబద్దానికి రెక్కలు కడుతున్నాం. జరగనిది జరిగినట్టు చెబుతున్నాం. అసలు ఇప్పుడు తిరుగుతున్న రిపోర్టులో జులై 12న శాంపిల్స్ తీసుకున్నారు. చంద్రబాబు హయాంలోనే శాంపిల్స్‌ తీసుకున్నారు. ఈ శాంపిల్స్‌ను జులై 17న ఎన్‌డీడీబీకి పంపించారు. వాళ్లు జులై 23న రిపోర్టు ఇచ్చారు. అప్పటి నుంచి చంద్రబాబు ఏం చేస్తున్నారు. వంద రోజుల పాలనప్పుడు ప్రజలు నిలదీస్తారనే ఇప్పుడు ఆ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆ రిపోర్టుకు వక్రభాష్యం చెబుతూ నోటికి వచ్చిన అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. 

ఆ రిపోర్టు చూస్తే ఉండాల్సిన విలువల కంటే.. తక్కువ ఉన్నాయని చెప్పారు. మినహాయింపులు ఉన్నాయి అని చెప్పారు. టీటీడీలో ఓ గొప్ప వ్యవస్థ ఉందని చెప్పుకొని గర్వపడాలి. లడ్డూ తయారీ వద్ద కోసం చేసే ప్రక్రియ ఎంత గొప్పదో చెప్పుకోవాలి. టెస్టుల్లో ఫెయిల్ అయినా వాడేశారు అన్నట్టు... భక్తులకు పంచి పెట్టారు... అలాంటి లడ్డూలు తిన్నారు. అని సీఎం చెప్పడమేంటీ... తిరుమలను అపవిత్రం చేస్తున్నారు. అక్కడ ప్రక్రియను అబాసులుపాలు చేస్తున్నారు. మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మనం తగ్గించుకుంటున్నాం. ఇలాంటిది రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా జరుగుతాయా... దీనిపై అందరూ ఆలోచించాలి. 

టెండర్లలో ఎవరైనా పోటీ పడాలి. 2015-18 అక్టోబర్‌ వరకు కేఎంఎఫ్‌ బ్రాండ్‌ ఎందుకు లేదో చెప్పాలి. జులై 23లో ఎన్‌డీడీబీ రిపోర్టు వస్తే ఏ అధికారి వివరణ ఇవ్వకుండానే టీడీపీ ఆఫీస్‌లో ఆ రిపోర్టు ఎలా రిలీజ‌ చేస్తారు. తిరుమల దేవస్థానంలో వైసీపీ వచ్చిన తర్వాత విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ల్యాబ్స్ బలోపేతం చేశాం. సీఎఫ్‌టీఆర్‌ఐతో కలిసి పని చేస్తున్నారు.

Also Read: Tirumala Laddu News | తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు గుర్తించాం, కల్తీ జరిగింది : టీటీడీ ఈవో శ్యామలరావు సంచలనం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget