(Source: ECI/ABP News/ABP Majha)
Duggirala MPP Election : దుగ్గిరాల ఎంపీపీగా వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి ఏకగ్రీవం - వైస్ ఎంపీపీ, కోఆప్షన్ సభ్యుల పదవులు టీడీపీ, జనసేన కైవసం !
దుగ్గిరాల ఎంపీపీగా వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీకి రిజర్వ్ అయిన స్థానంలో ఇతర బీసీ అభ్యర్థులు లేకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర పదవులు టీడీపీ, జనసేన కూటమికి దక్కాయి.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్షురాలిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీ రూపావాణి ఎంపికయ్యారు. మరొకరు పోటీలో లేకపోవడంతో ఆమె ఏకగ్రీవం అయినట్లుగా ఎన్నికల అధికారి రాం ప్రసన్నకుమార్ ప్రకటించారు. ఉత్కంఠ రేపిన ఎంపీపీ ఎన్నికకు టీడీపీకి చెందిన 9 మంది, జనసేనకు చెందిన ఒక్కరు.. . వైఎస్ఆర్‌కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీలు హాజరయ్యారు. ఎక్స్ ఆఫీషియో సభ్యునిగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది మంది ఎంపీటీసీలు ఉన్నప్పటికీ బీసీ సామాజికవర్గానికి చెందిన ముగ్గురు ఎంపీటీసీలను ఎన్నికకు వ్యూహాత్మకంగా దూరంగా ఉంచారు.
ఆ మహిళలు, యువతులపై రేప్‌లు చేసింది వాళ్లే, ఆ మీడియా దాచిపెడుతోంది: సీఎం జగన్ వ్యాఖ్యలు
టీడీపీ, జనసేన తరపున ఉన్న ఒకే ఒక్క బీసీ ఎంపీటీసీకి కుల ధృవీకరణ పత్రం మంజూరు కాలేదు. రూపవాణికి బీసీ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఆమె ఒక్కరే ఎంపీపీ పదవికి నామినేషన్ వేశారు. దీంతో ఆమె ఎన్నికను ఏకగ్రీవం చేస్తున్నట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. రూపావాణికి ఎంపీపీ పదవి ఇస్తే ఇండిపెండెంట్‌గా నిలబడతారన్న అనుమానంతో ఇతర బీసీ ఎంపీటీసీల్ని వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికకు రానివ్వలేదని తెలుస్తోంది. టీడీపీతో ఒప్పందం చేసుకున్నారని ప్రచారం జరిగిన పద్మావతి అనే ఎంపీటీసీని ఎమ్మెల్యే ఆర్కే కిడ్నాప్ చేశారని ఆమె కుమారుడు తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. పద్మావతి కూడా ఎంపీపీ ఎన్నిక ప్రక్రియలో పాల్గొనలేదు. వైస్ ఎంపీపీలురెండు, కో ఆప్షన్ సభ్యుడి పదవులు అన్నీ టీడీపీ, జనసేన కూటమికే దక్కాయి. వైస్ ఎంపీపీ లు గా టిడిపి అభ్యర్థి జబీన్ , జనసేన అభ్యర్ది పసుపులేటి సాయి చైతన్య విజయం సాధించారు. అలాగే కో-ఆప్షన్ సభ్యులు గా టిడిపి బలపరిచిన వహీదుల్లా ఎన్నికయ్యారు. ఈ ఫలితాలను ఎన్నికల అధికారి రాం ప్రసన్న కుమార్ అధికారికంగా ప్రకటించారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఏపీ డిస్కంలు - పీపీఏ బకాయిలు చెల్లించలేమని హైకోర్టుకు సమాచారం !
మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న దుగ్గిరాలలో టీడీపీ అభ్యర్థి ఎంపీపీ కాకూడదన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. టీడీపీ, జనసేన కూటమికి ఉన్న ఒకే ఒక్క బీసీ అభ్యర్థికి కుల ధృవీకరణ అందకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఈ వివాదంతో చాలా కాలం పాటు ఆగిపోయిన ఎన్నిక హైకోర్టు ఆదేశాలతో జరిగింది.