అన్వేషించండి

YSRCP Asssembly Hurdle: పాపం.. YSRCP ఎమ్మెల్యేలు..అధ్యక్షుడికి చెప్పలేరు... అసెంబ్లీకి వెళ్లలేరు..!

YSRCP MLAs: అసెంబ్లీలో అడుగుపెట్టకూడదన్న YSRCP అధ్యక్షుడు జగన్ నిర్ణయం ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతోందా..? ఎవరి మాటా వినని సీతయ్య జగన్‌ వల్ల వాళ్లు తమ ప్రజలకు ప్రాతినిధ్యం వహించలేకపోతున్నారా.?

YSRCP Assembly Row: శాసనసభకు ఎన్నికవ్వడం ఎవరికైనా రాజకీయ పయనంలో ఓ కీలక మలుపు..

శాసనసభలో అడుగుపెట్టడం.. ఓ అనుభూతి.. అరుదైన అవకాశం..! అసెంబ్లీలో గొంతెత్తడం.. తనను ఎన్నుకున్న ప్రజల గొంతుకలకు ప్రాణం ఇవ్వడం..

కానీ.. ఇక్కడ సభకు ఎన్నికైన సభ్యులు అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదు. అధ్యక్షా... అంటూ తమ ప్రజల గోడును వినిపించడం లేదు. ఇది వారికై వారు తీసుకున్న నిర్ణయమా.. లేక రాజకీయ క్రీడలో పావులుగా మారిన వైనమా..?

Yes.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎన్నికైన ఆ 11మంది గురించే చెప్పేది. అసెంబ్లీలోకి అడుగుపెట్టకూడదు అన్నది ఆ 11మంది నిర్ణయమా.. లేక అందులో ఒకరి నిర్ణయానికి మిగతా 10మంది కట్టుబుడిపోయి ఉండాల్సిన పరిస్థితా...?

ప్రతిపక్ష హోదా కోసం జగన్ మంకుపట్టు..

గడచిన ఏడాదిన్నర కాలంగా ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. 2024 శాసనసభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన అప్పటి అధికార పార్టీ YSRCP కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయింది. మొత్తం 175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్సార్సీపీకి 11సీట్లు వచ్చాయి. ప్రతిపక్ష హోదా రావాలంటే.. కనీసం 18 స్థానాలు గెలుచుకోవాలి. ఇక్కడ ప్రతిపక్ష హోదా ఏంటన్న దానికి ఎవరికి వారే తమకు నచ్చిన భాష్యం చెబుతున్నారు. సరే కారణం ఏదైనా కానీ.. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డి డిమాండ్ చేయడం మాత్రమే కాదు.. అది ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని ఆయన మొండిపట్టు పట్టారు. ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పటి వరకూ నాలుగు సమావేశాలు జరిగినా.. వాటికి హాజరు కాలేదు.

పాపం YSRCP ఎమ్మెల్యేలు…

మాజీ ముఖ్యమంత్రి , YSRCP అధ్యక్షుడు జగన్ మోహనరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల కాకుండా… మరో 10మంది ఆ పార్టీ తరపున గెలిచారు

పులివెందుల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తంబళ్లపల్లి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి

మంత్రాలయం వై. బాలనాగిరెడ్డి

రాజంపేట ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి

బద్వేలు దాసరి సుధ

ఆలూరు విరూపాక్షి

యర్రగొండపాలెం తాటిపత్రి చంద్రశేఖర్

దర్శి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

అరకు రేగం మత్స్యలింగం

పాడేరు మత్స్యరాస విశ్వేశ్వరరాజు

 2024 సునామీలో పెద్దిరెడ్డి సోదరులు, కర్నూలు లో రెండు, ప్రకాశం 2, ఏజన్సీ ఏరియాలో 2 , కడపలో మరో రెండు సీట్లు వచ్చాయి. ఇక మిగిలిన జిల్లాల్లో ఆ పార్టీ ఖాతానే తెరవలేదు. వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితమైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డి.. జగన్ మాటపైన ఉంటారు. ఇక మిగిలిన వారి మనోభావం ఏంటన్నది తెలీదు. బాలనాగిరెడ్డి సీనియర్ ఎమ్మెల్యే కాగా.. అమరనాథరెడ్డి, దాసరి సుధ, బూచేపల్లి శివప్రసాదరెడ్డి రెండు సార్లు ఎన్నికయ్యారు.. కాబట్టి వీళ్లకి అసెంబ్లీ అనుభవం ఉంది. ఇక తాటిపత్రి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, మత్స్యారాస విశ్వేశ్వరరాజులకు ఇదే మొదటి అసెంబ్లీ. ప్రమాణ స్వీకారానికి తప్ప వాళ్లు అసెంబ్లీలోకి వెళ్లలేదు.

జగన్ మోహనరెడ్డి తన రాజకీయం కోసం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను.. ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన ప్రతినిధులను చట్టసభలకు వెళ్లనీయకుండా చేస్తున్నారని విమర్శ ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి అసెంబ్లీకి రాకపోవడమే తప్పైతే.. దానిని సమర్థించుకోవడమే కాకుండా.. మిగిలిన ఎమ్మెల్యేలను కూడా రానివ్వకపోవడం ఎంత వరకూ సమంజసమన్న ప్రశ్న వస్తోంది. చాలామంది రాజకీయ నాయకులు, విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. అసలు జగన్ వెళ్లకపోవడమే తప్పైతే… మిగిలిన వాళ్లని కూడా నియంత్రించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కానీ జగన్‌మోహనరెడ్డి దగ్గర ప్రశ్నలకు స్కోప్ తక్కువ. ఆయన చెప్పింది చేయడం మాత్రమే ఉంటుంది.

జగన్ మాట్లాడే దాంట్లో హేతుబద్ధత ఉందా..?

రాష్ట్రంలో ఉన్న మిగిలిన రాజకీయ పక్షాలన్నీ ఒకే కూటమిగా ఉన్నాయి కాబట్టి.. వాటికి వ్యతిరేక పక్షమైన తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలన్నది ఆయన డిమాండ్. అంతే కాదు… ప్రతిపక్ష హోదా ఉంటే.. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదాలో తనకు మాట్లాడేందుకు తగినంత సమయం వస్తుందని.. అది రాకుండా చేసే కుట్రతోనే కూటమి ప్రభుత్వం హోదా నిరాకరిస్తోందన్నది ఆయన నేరేషన్. ఇందులో కొంత వరకూ వాస్తవం ఉంది. ఆయన చెప్పింది సబబుగానే ఉంది. కానీ సాంకేతికంగా హోదా ఇవ్వాలా వద్దా అన్న విషయంలో నిర్ణయం పూర్తిగా స్పీకర్‌దే. రాజకీయ పార్టీలు రాజకీయం మాత్రమే చేస్తాయి. ఘోరంగా ఓడిపోయిన జగన్‌ను.. రాజకీయంగా దెబ్బతీయాలన్నా.. ఆయన నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికైనా.. LOP హోదా కూడా లేదు అని చెప్పడం కూటమికి ఉన్న ఓ ప్రధాన ఆయుధం. దానిని వాళ్లెందుకు వదులుకుంటారు…?

ఎవరైనా యుద్ధంలోనో.. పందెంలోనో గెలిచి తాము అనుకున్నది సాధించుకోవాలి. కానీ ఆయన మాత్రం నేను పార్టిసిపేట్ చేశా.. కాబట్టి నాకు ఏదో ఒకటి ఇవ్వాలి అంటున్నారు. అంతెందుకు ఇదే పరిస్థితి తెలుగుదేశానికి వచ్చి ఉంటే జగన్ మోహనరెడ్డి ఏం చేసి ఉండేవారు అన్నది ప్రతి ఒక్కరికీ తెలుసు. నూటికి నూరుశాతం ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఒప్పుకోరు అన్నది రాజకీయాలపై కనీస అవగాహన ఉన్నవారేవరికైనా అవగతమయ్యే విషయం. దీనికి రుజువు కావాలంటే.. జగన్ మోహనరెడ్డే ఇచ్చారు చూసుకోండి. అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏం మాట్లాడారో వింటే.. ప్రతిపక్ష హోదా విషయంలో ఆయన వైఖరి ఏంటన్నది అర్థం అవుతుంది.

మరి అప్పుడు .. “నాలుగు సీట్లు తక్కువొస్తే.. నీకు ప్రతిపక్ష హోదా కూడా పోయేది బాబూ…”చంద్రబాబు ను గేలిచేసిన జగన్ .. ఇప్పుడు వాళ్లు గెలిస్తే.. ఎందుకు ఇంతలా గింజుకుంటున్నారు. అసలు ప్రతిపక్ష హోదా లేకపోతే ఏంటి.. ఎమ్మెల్యేగా ఆయన ప్రధాన కర్తవ్యం.. అసెంబ్లీకి హాజరు కావడం కదా.. శాసనసభ్యుడు అంటే ఏంటి.. శాసనసభకు ప్రాతినిధ్యం వహించేవాడు అని కదా.. మరి ఆ సభకు ప్రతినిధి.. సభకు హాజరుకావాలన్నది ప్రాథమిక విషయం కదా.. అది ఎంత బేసిక్ .. ప్రిన్సిపల్ అయినా.. జగన్ మోహనరెడ్డి అంతే.. తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అంటారు. ఆయన పక్కనున్నోళ్లు కూడా అవును అని చెప్పాల్సిందే… వాళ్లకు నో చాయిస్.

అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి..?

అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గుర్తింపుకోసం ఎలాంటి చట్టం నిబంధనలు లేవు. పార్లమెంట్‌లో పాటించే ప్రొసీజర్‌నే ఇక్కడా అనుసరిస్తారు. ప్రతిపక్షనేత హోదాను గుర్తించడానికి ముందు మూడు అంశాలు చూడాలి.

1. 1951 పార్లమెంట్ యాక్ట్ (Representation of the People Act, 1951) ఈ యాక్ట్ ప్రధానంగా ఎన్నికల నిర్వహణ, పార్లమెంట్ సభ్యత్వ అర్హత/అనర్హతలు, ఉపఎన్నికలు, ఎన్నికల ప్రక్రియ వంటి విషయాలను మాత్రమే వివరిస్తుంది. ఇందులో ప్రతిపక్ష పార్టీ/ Leader of Opposition (LoP) అనే కాన్సెప్ట్, గైడ్‌లైన్స్ స్పష్టంగా లేవు.

2. Leader of Opposition గుర్తింపు చట్టం:, 1977లో The Salary and Allowances of Leaders of Opposition in Parliament Act అనే ప్రత్యేక చట్టం వచ్చింది. దీని ప్రకారం. "Leader of Opposition" అంటే:

అధికారపార్టీ తప్ప మిగిలిన పార్టీలలో, రెండు సభల్లోనూ (Lok Sabha లేదా Rajya Sabha), అత్యధిక సభ్యులు కలిగి ఉన్న పార్టీకి నేత. అతనిని ఆ సభ స్పీకర్ (లేదా చైర్మన్) “Leader of Opposition”గా గుర్తించాలి.

కానీ ఆ పార్టీకి మొత్తం సీట్లలో కనీసం 1/10 వంతు (10%) సీట్లు ఉండాలి.

3. ఎందుకు 10% రూల్ వచ్చింది?

1951 యాక్ట్‌లో అయినా.. 1977 చట్టంలో అయినా… 10% అన్న మాట లేదు.

కానీ G.V. Mavalankar (First Lok Sabha Speaker, 1952) అప్పట్లో ఒక రూలింగ్ ఇచ్చారు.. “ఏ పార్టీని Parliamentary Party గా పరిగణించాలంటే, ఆ సభ మొత్తం సీట్లలో కనీసం 1/10 (10%) సీట్లు ఉండాలి." తర్వాతి స్పీకర్లు కూడా ఈ రూల్‌ని కొనసాగించారు.

కాబట్టి ఆ చట్టం + స్పీకర్ రూలింగ్ ప్రకారం 10% రూల్ ఫాలో అవుతున్నారు. అందుకే జగన్ పార్టీకి కూడా 10% సీట్లు లేకపోవడంతో అధికారికంగా ప్రతిపక్ష హోదా రాలేదు.

జగన్‌, ఎమ్మెల్యేలపై అనర్హత వేస్తారా..?

ఇక ఎమ్మెల్యేలపై అనర్హత వేస్తారా అనే చర్చ కూడా నడుస్తోంది. దీనికీ స్పష్టమైన నిబంధనలున్నాయి. ఇక్కడ కూడా పార్లమెంట్‌ రూల్స్‌నే పాటిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం ఒక సభ్యుడు వరుసగా 60 రోజులు (అంటే సభ జరిగిన రోజులు) సభకు హాజరుకాకపోతే, అతని సీటు ఖాళీ అవుతుంది. కానీ, సభ ముందుగానే అతనికి “లీవ్ ఆఫ్ యాబ్సెన్స్” మంజూరు చేస్తే, సీటు ఖాళీ కాదు.

అసెంబ్లీ నిబంధనలు (Rules of Procedure, A.P. Legislative Assembly) ప్రకారం..

సభ్యుడు అసెంబ్లీకి రాలేకపోతే, సెషన్ ప్రారంభంలో లేదా మధ్యలో స్పీకర్‌కి అప్లికేషన్ ఇవ్వాలి. స్పీకర్ ఆ అప్లికేషన్‌ను సభ ముందు పెడతారు. సభ ఓటుతో ఆ గైర్హాజరును అప్రూవ్ చేస్తే అది “లీవ్ ఆఫ్ యాబ్సెన్స్”. ఒకసారి లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ ఇచ్చిన తర్వాత, ఆ రోజులు 60 రోజుల లెక్కలోకి రావు. ఇవన్నీ చేయకుండా వరుసగా 60 రోజులు ( శాసనసభ జరిగిన రోజులు) గైర్హాజరైతే.. ఆటోమేటిగ్‌గా ఆ సీటు ఖాళీ అయిపోతుంది. అయితే ఇందులో కూడా స్పీకర్‌దే ఫైనల్ నిర్ణయం. అలా ఆ సీటు ఖాళీ అయిందని ఆయన నోటిఫికేషన్‌ ఇస్తేనే అది అమలవుతుంది. ఇంకో సెషన్‌కు జగన్‌ సహా.. YSRCP ఎమ్మెల్యేలు గైర్హాజరైతే.. వారిని స్పీకర్ అనర్హులుగా ప్రకటించేయొచ్చు..

రాజకీయ శపథాలు

అసెంబ్లీకి రాను అని శపథాలు ఆంధ్రప్రదేశ్‌కు కొత్తకాదు.. అప్పట్లో అసెంబ్లీలో అడుగుపెట్టను అని భీష్మించిన ఎన్టీఆర్.. సీఎం అయ్యే వరకూ తన ప్రతిజ్ఞ కొనసాగించారు. మొన్నటి ఎన్నికలకు ముందు అసెంబ్లీలో చోటు చేసుకున్న ఘోర పరిణామాలతో కలత చెందిన చంద్రబాబు… అసెంబ్లీ సాక్షిగానే.. తాను సీఎంగానే వస్తానని ప్రతిన బూనారు. అయితే ఆయన చెప్పిన తర్వాత 60రోజులు సమావేశాలు జరగలేదు. ఇప్పుడు జగన్ మోహనరెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని అడుగు పెట్టనంటున్నారు. అయితే సభా నాయకుడు చంద్రబాబు దీనికి కౌంటర్ ఇచ్చారు. లేని హోదాను తాము ఎలా ఇవ్వగలమంటున్నారు. పైగా చాలా మంది జగన్ తన నిర్ణయానికి సరైన జస్టిఫికేషన్ ఇచ్చుకోలేకపోతున్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీసే మంచి అవకాశాన్ని చేతులారా చెడగొట్టుకుంటున్నారా అని కూడా అనిపిస్తుంది. అసలు ఆయన ఆర్గ్యుమెంట్‌లో ఏమాత్రం బలం ఉన్నట్లు కూడా కనిపించదు.

చంద్రబాబు కుటుంబాన్ని దూషించారు కాబట్టి ఆయన చర్యను సమర్థించుకోవడానికి.. ఆయనకు మోటివ్ కనిపించింది. కానీ జగన్ చెప్పేదాంతో ఎవ్వరూ ఏకీభవించలేకపోతున్నారు. ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా జగన్ మోహనరెడ్డి.. ఓ పార్టీకి లెజిస్లేచర్ పార్టీ నాయకుడు.. ఆయనకు పార్టీ శాసనసభా నాయకుడిగా కచ్చితంగా సమయం వస్తుంది. అప్పట్లో లోక్‌సత్తా తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే జయప్రకాశ్‌ నారాయణకు కూడా సమయం ఇచ్చారు. ఇప్పటికీ తెలంగాణ అసెంబ్లీలో కమ్యూనిస్టు ఎమ్మెల్యేలకు సమయం వస్తుంది. దానిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం లేదు.

జగన్‌కు అంటే చంద్రబాబును ఎదిరించాలనో.. లేక తనకు ఉండే మొండి పట్టుదలో ఏదో ఒక కారణం ఉంది. కానీ.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేశారు. వాళ్లని ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్లలో నలుగురు మొట్టమొదటి సారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారే.. తమ సీట్లో కూర్చుని కనీసం ఒక్కసారైనా అధ్యక్షా.. అని అనాలని వాళ్లకు ఉండదా.. వాళ్లు గొంత నొక్కడం ఏమాత్రం సమజసం..?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hawala money seizure: కారులో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే .. షాక్ అయిన పోలీసులు - ఎవరి డబ్బు ?
కారులో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే .. షాక్ అయిన పోలీసులు - ఎవరి డబ్బు ?
Minister Ponguleti: ఎల్పీనగర్ సీరీస్ భూముల్ని రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది కేటీఆరే - మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
ఎల్పీనగర్ సీరీస్ భూముల్ని రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది కేటీఆరే - మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
Mega PTM: ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
Hydra Ranganath: చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
Advertisement

వీడియోలు

Vintage Virat Kohli | సఫారీలతో రెండో వన్డేలో వింటేజ్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్న విరాట్
Ruturaj Gaikwad Century in India vs South Africa ODI |  అన్నా! నువ్వు సెంచరీ చెయ్యకే ప్లీజ్ | ABP Desam
Harbhajan Singh about Rohit Sharma Virat Kohli | రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌పై హర్బజన్ సింగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hawala money seizure: కారులో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే .. షాక్ అయిన పోలీసులు - ఎవరి డబ్బు ?
కారులో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే .. షాక్ అయిన పోలీసులు - ఎవరి డబ్బు ?
Minister Ponguleti: ఎల్పీనగర్ సీరీస్ భూముల్ని రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది కేటీఆరే - మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
ఎల్పీనగర్ సీరీస్ భూముల్ని రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది కేటీఆరే - మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
Mega PTM: ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
Hydra Ranganath: చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
IndiGo Flights Cancelled: ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
Ram Gopal Varma : హీరోగా RGV... సెన్సేషనల్ 'షో మ్యాన్' - విలన్ ఎవరో తెలుసా?
హీరోగా RGV... సెన్సేషనల్ 'షో మ్యాన్' - విలన్ ఎవరో తెలుసా?
IndiGo Flights Cancelled : ఇండిగో రాకముందు భారతదేశంలో ఏయే విమానయాన సంస్థలు మూతపడ్డాయి? పూర్తి జాబితా ఇక్కడ చూడండి
ఇండిగో రాకముందు భారతదేశంలో ఏయే విమానయాన సంస్థలు మూతపడ్డాయి? పూర్తి జాబితా ఇక్కడ చూడండి
IndiGo Flight Cancellation: ఇండిగో సంక్షోభంతో డిజిసిఎ అలర్ట్‌! సిబ్బంది సర్దుబాటులో పెద్ద మినహాయింపు , నైట్-డ్యూటీ నిబంధనలలో సడలింపు!
ఇండిగో సంక్షోభంతో డిజిసిఎ అలర్ట్‌! సిబ్బంది సర్దుబాటులో పెద్ద మినహాయింపు , నైట్-డ్యూటీ నిబంధనల‌లో సడలింపు!
Embed widget