YSRCP Vs Janasena : వినూత కోట - అనంతబాబు హత్యనేరాలు - వైసీపీ, జనసేన సోషల మీడియా వార్
Andhra Politics : హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ అరెస్ట్ కావడంతో వైసీపీ ట్రోల్ చేస్తోంది. జనసేన నేతలు అనంతబాబును గుర్తు చేస్తున్నారు.

YCP trolls Srikalahasti Janasena: శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ కోట వినుత వ్యక్తిగత పీఏ శ్రీనివాసులు అలియాస్ రాయుడు చెన్నైలో హత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యకు ప్లాన్ చేసి, చంపేసింది కోట వినుత దంపతులేనని గుర్తించి అరెస్టు చేశారు. ఈ వివాదంపై స్పందించిన జనసేన పార్టీ అధినాయకత్వం వెంటనే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ అంశంపై వైఎస్ఆర్ పార్టీ , జనసేన మధ్య సోషల్ మీడియా వార్ ప్రారంభమయింది. మైక్ ముందు దాడులు, హత్యల గురించి తెగ శుద్ధపూస కబుర్లు చెప్తావు.. ఇప్పుడు మీ పార్టీ శ్రీకాళహస్తి ఇంఛార్జ్ చేసిందేంటి అని పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ లో వైసీపీ ప్రశ్నించింది.
🚨 #JSPGoons
— YSR Congress Party (@YSRCParty) July 12, 2025
హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జ్ కోటా వినుత దంపతులు అరెస్ట్
డ్రైవర్ శ్రీనివాసుల్ని హత్య చేయించిన వినుత దంపతులు.. చెన్నైలోని కూవం నదిలో శ్రీనివాసులు మృతదేహం లభ్యం
ఈ హత్య కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు.. ఇందులో కోటా వినుత దంపతులు కూడా… pic.twitter.com/FwLqXu3I08
అయితే జనసేన , టీడీపీనేతలు మాత్రం.. అనంతబాబు కేసును తెరపైకి తెస్తున్నారు. అసలు అనంతబాబు డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసి.. స్వయంగా అంగీరించినా ఆయనను జగన్ పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడని గుర్తు చేస్తున్నారు.
హత్య చేసి బెయిల్ పై తిరిగే వాడు ఇంకా వైసిపి లోనే ఉన్నాడు.. జగన్ రెడ్డి తో పాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాడు.. pic.twitter.com/Y0FtH90fUX
— V (@WARMA007) July 12, 2025
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు..తన మాజీ డ్రైవర్ ను హత్య చేసి.. మృతదేహాన్ని ఇంటి వద్ద పడేసి వెళ్లాడు. పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయకపోడం, చార్జిషీటు దాఖలు చేయకపోవడంతో సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది. సొంత బాబాయ్ YS వివేకానంద రెడ్డి గారిని చంపిన కేసులో ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చి, విచారణకు పంపించకుండా, బెయిల్ ఇప్పించి, MP సీట్ ఇచ్చిన చరిత్ర మీదని జనసేన పార్టీ కౌంటర్ ఇచ్చారు. హత్య కేసులో ఆరోపణలు వచ్చిన వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసిన నిబద్ధత జనసేన పార్టీ దన్నారు. ... నీకు ఏ మాత్రం విజ్ఞత ఉన్నా ముందస్తు బెయిల్ మీద బయట ఉన్న అవినాష్ రెడ్డిని విచారణకు పంపించు, నీపై ఉన్న అవినీతి కేసుల్లో విచారణకు సహకరించు, కోడికత్తి డ్రామా కేసులో సాక్ష్యం చెప్పు, దళిత డ్రైవర్ ను హత్య చేసిన MLC అనంత బాబును వెంటేసుకుని తిరగడం మానేయ్యాలని జనసేన పార్టీ సవాల్ చేసింది.
సొంత బాబాయ్ YS వివేకానంద రెడ్డి గారిని చంపిన కేసులో ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చి, విచారణకు పంపించకుండా, బెయిల్ ఇప్పించి, MP సీట్ ఇచ్చిన సిగ్గులేని బ్రతుకుల చరిత్ర @YSRCParty వాళ్ళది.
— JanaSena Shatagni (@JSPShatagniTeam) July 12, 2025
హత్య కేసులో ఆరోపణలు వచ్చిన వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసిన నిబద్ధత జనసేన… https://t.co/dMh818TbeR
రెండు పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు.. తమ నేతల నేరచరిత్రను బయటకు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు.





















