News
News
X

Delhi YSRCP Mps : ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు - ఢిల్లీలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీల కీలక ప్రకటన !

ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు పెట్టాలని వైసీపీ ఎంపీలు నిర్ణయించుకున్నారు. అందరి మద్దతు కూడగడతామని ప్రకటించారు.

FOLLOW US: 
Share:

Delhi YSRCP Mps :  ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు పెట్టాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలు నిర్ణయించారు. ఈ మేరకు ఢిల్లీలో వారు కీలక ప్రకటన ప్రకటన చేశారు.  ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం కాదని, పవిత్రమైన పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ అని ఎంపీలు గుర్తు చేస్తున్నారు.  విభజన హామీలు సాధించుకోవడం కోసం పార్లమెంటులో గళమెత్తుతామని స్పష్టం చేశారు.  బీజేపీ ప్రభుత్వం చెప్తున్నట్లుగా ప్రత్యేక హోదా అనేది క్లోజ్‌డ్‌ చాఫ్టర్‌ కాదని .. వాళ్లు ఎన్నిసార్లు హోదా ఇవ్వలేము చెప్పినా మేం అన్నిసార్లు ఇవ్వాలని అడుగుతూనే ఉంటామని ఎంపీ రంగయ్య స్పష్టం చేశారు.  విభజన చట్టంలో ప్రతిపాదించి ఇప్పటి వరకూ అమలు కాని అంశాలపై కూడా ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెడతాం. అయితే ఇవాళ దానిపై చర్చ ఉన్నా సభ వాయిదా పడటంతో కుదరలేదన్నారు.  అవకాశం రాగానే మిగతా పార్టీల మద్దుతు కూడగట్టుకుని ఓటింగ్‌ కి వచ్చేలా కృషి చేస్తున్నామని ప్రకటించారు. 
 
విభజన చట్టం ప్రకారం ఇంకా రాష్ట్రానికి రావాల్సినవి చాలా ఉన్నాయి వాటిని సాధించడం కోసం మేం మా పార్టీ తరఫున పోరాడుతూనే ఉంటామని.. ఎంపీ రంగయ్య తెలిపారు.  అనంతపురం సెంట్రల్‌ యూనివర్సిటీకి సరిపడా నిధులు ఇవ్వడం లేదని.. రాజస్థాన్, గుజరాత్‌కు సమంగా ఏపీలోనూ జనాభా ఉన్నారు. కానీ అక్కడి మెడికల్‌ కాలేజీలకు లభిస్తున్న అనుమతులతో పోలిస్తే..  ఇక్కడ అనుమతులు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.  గుజరాత్, రాజస్థాన్‌ తరహాలో ఏపీకి మెడికల్‌ కాలేజీలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.   తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇవ్వం ఇవ్వం అని చెప్పి ఇచ్చారు కదా..అలానే మేం హోదా ఇచ్చే వరకూ పోరాడుతాం-ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన తీవ్ర నష్టాన్ని సరిదిద్దాలని మేం కోరుతున్నామన్నారు.  

 ఏపీ విభజన సందర్భంగా.. అప్పట్లో కేంద్రం ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చని పరిస్థితి ఉంది బడ్జెట్‌లో మా లాంటి చిన్న రాష్ట్రాలకు చేయూత ఇస్తారని ఆశించాం మరో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.  దేశంలో ఉన్న అన్ని ఎయిమ్స్‌లకు కలిపి రూ.6700 కోట్లు ఇచ్చారు.. అమరావతిలోని ఎయిమ్స్‌ కొత్తగా పెట్టిన ఆస్పత్రి.. వచ్చే ఆ నిధులు ఎందుకూ సరిపోవు..మరిన్ని నిధులు ఇస్తేగానీ అక్కడ అభివృద్ధి జరగదన్నారు.  అరకొర నిధులతో ఇంకా కొనసాగిస్తున్నారంటే తీవ్రమైన అన్యాయాన్ని రాష్ట్రానికి చేసినట్లేనన్నారు.  పవిత్ర దేవాలయం లాంటి పార్లమెంటులో ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమైతే ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగే ప్రమాదం ఉందని ప్రధాని గమనించాలన్నారు.  ఒక ప్రభుత్వం పార్లమెంటులో ఒక హామీ ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉంటుందన్నారు.   దుల అనుసంధానం అన్నారే కానీ రాష్ట్రానికి నిధుల కేటాయింపులు లేవని ఎంపీ బోస్ అసంతృప్తి వ్యక్తం చేశారు.  

 బడ్జెట్‌లో ఏపీకి మొండి చేయి చూపినందున ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప అన్నారు.  ప్రత్యేక హోదాపై గత నాలుగేళ్లుగా మేం పార్లమెంటులో విన్నపాలు చేస్తూనే ఉన్నామని..  మా ముఖ్యమంత్రి  సుమారు 20 సార్లు ఢిల్లీ వచ్చి హోదా ఇవ్వమని కేంద్రాన్ని కోరారని గుర్తు చేశారు.  ఇంతకాలం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పోరాటాలు చేస్తూనే ఉన్నాం...స్పందన లేదు కాబట్టే ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు పెడుతున్నామని ప్రకటించారు.  ఖచ్చితంగా పార్లమెంటులో మా గళాన్ని వినిపించి హోదాను సాధించుకుంటామన్నారు.  రాష్ట్రాన్ని విడగొట్టింది చంద్రబాబే...ప్రత్యేక హోదా, నిధులు రానివ్వకుండా చేసిన ఘనుడు చంద్రబాబు-మళ్లీ ఆయనే మమ్మల్ని తప్పు పడుతున్నారని విమర్శించారు.  

Published at : 03 Feb 2023 06:53 PM (IST) Tags: AP special status Delhi News YSRCP MPs

సంబంధిత కథనాలు

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన

AP Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!

AP Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!

Breaking News Live Telugu Updates: టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి, శ్రీవారి భక్తుల మధ్య వాగ్వాదం - బూతులు తిట్టుకున్న ఇరువురు!

Breaking News Live Telugu Updates: టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి, శ్రీవారి భక్తుల మధ్య వాగ్వాదం - బూతులు తిట్టుకున్న ఇరువురు!

మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు

మార్గదర్శి కేసులో  మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు

టాప్ స్టోరీస్

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు

PAN- Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?

PAN- Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా