Yanamala Ramakrishnudu : రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఎదురుదాడి - వైఎస్ఆర్‌సీపీపై యనమల తీవ్ర విమర్శలు
Andhra Pradesh : ఆర్థిక శాఖ శ్వేతపత్రంపై విమర్శలు చేస్తున్న వైసీపీపై యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి కోలుకుండా చేశారని మండిపడ్డారు.
TDP Vs YSRCP : రాష్ట్రాన్ని అప్పుల ఊభిలోకి నెట్టి నేడు అంత అప్పులు మేము చేయలేదంటూ బుకాయిస్తున్న గత పాలకులు దమ్ముంటే చర్చకు రావాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీకి సవాల్ చేశారు. ఓడిపోయిన ఫ్రెస్టేషన్ లో జగన్ కు ఏం చేయాలో తెలియక... ఏమి మాట్లాడాలో అర్థం కాక. ఢీల్లిలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక పరువు పోగొట్టుకున్నాడని అన్నారు. అక్కడ పరువు పోగొట్టుకుంది చాలక ఇక్కడి వచ్చి శ్వేత పత్రాలపై అబద్ధపు పత్రాలు అంటూ అవాకులు చవాకులు పేలడంపై మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఏపీ మొత్తం అప్పు రూ. 14 లక్షల కోట్లు : యనమల
గత వైసీపీ పాలనలో దాదాపు 14 లక్షల కోట్ల అప్పు తెలుతుంది. దాన్ని ఎవరు దాయలేరు. శ్వేత పత్రంలో కొన్ని మాత్రమే బయటకు వచ్చాయి. ఇంకా కొన్ని రిపోర్ట్ లు రాలేదు. 2020 –2021, 2021 -2022 సంవత్సరాలకు సంబంధించి అకౌంట్స్ లెక్కలన్నీ ఫైనల్ కాలేదు. దాంతో పూర్తి లెక్కలు బయటకు రాలేదు. గత ప్రభుత్వం ఎందుకు కార్పొరేషన్ ల అంకౌంట్స్ కాగ్ చేత ఆడిట్ చేయించలేదు? కాగ్ తో ఆడిట్ చేస్తే వైసీపీ తెచ్చిన అప్పులు అన్ని బయటకు వస్తాయనే భయం వైసీపీకి పట్టుకుంది. కార్పొరేషన్ లపేరుతో తెచ్చిన అప్పులను కూడా ఇంకా శ్వేత పత్రంలో చూపించలేదు. 2020 -21 లో గత పాలకులు తెచ్చిన వేజ్&మీన్స్ కు సంబంధించి రూ. 1,04,000 వేల కోట్లు కూడా అప్పులకు యాడ్ చేయలేదు. వేజ్&మీన్స్ కింద ప్రతి సంవత్సరం లక్ష కోట్ల తెచ్చారు. స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ ను కూడా శ్వేతపత్రంలో చూపించలేదు. అదే విధంగా వడ్డిలేని రుణాలను కూడా ఉన్నాయి వాటిని యాడ్ చేయలేదని యనమల తెలిపారు.
నాన్ గ్యారెంటీ లోన్లను కూడా శ్వేతపత్రంలో చూపించలేదు. గత ప్రభుత్వం ఈ కార్పొరేషన్ ల లెక్కలను కాగ్ కు ఇవ్వకపోవడంతో ఆ అప్పులు ఆడిట్ కాలేదు. నేడు ఈ అప్పుల లెక్క తేలితే.. దాదాపు 14 లక్షల కోట్లు అప్పుల భారం రాష్ట్రం పై ఉందన్నారు.
ఏపీ వెనుకబడిపోవడానికి వైసీపీనే కారణం
రాష్ట్రంలో అప్పుల ఉభిలోకి వెళ్లడానికి.. జగన్ కారణమని యనమల స్పష్టం చేశారు. ఆదాయం పెంచామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్... ఆ పెరిగిన డబ్బు ఎక్కిడికి పోయిందే చెప్పే దమ్ముందా? జగన్ రెడ్డి పెంచింది.. రాష్ట్రంలో అప్పులను మాత్రమే. బటన్ నొక్కుతున్నామని... మోసం చేయడం తప్పా ప్రజలకు చేసింది ఏమి లేదు. గత పాలకుల చర్యలతో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంతా పడిపోయింది. గత అరాచక పాలన వలన పేదరికం పెరిగింది, ఆర్థిక అసమానతలు పెరిగాయి. నిజంగా బటన్ నొక్కి మంచి చేసి ఉంటే పేదరికం, అసమానతులు ఎందుకు తగ్గలేదు. టీడీపీ హయాంలో పేదరికంలో 2,3 మూడు స్థానాలకు తగ్గిస్తే వైసీపీ దాన్ని 5కు పెంచింది. ఇంత అప్పు తెచ్చిన జగన్ రెడ్డి పేదరికాన్ని ఎందుకు పెంచాడు? మేము అప్పులు చేయలేదని చెబుతున్న వైసీపీ నేతలు దమ్ముంటే చర్చకు సిద్ధమా? అసెంబ్లీలోనైనా మరెక్కడైనా. ఎకనామిక్ సర్వే ప్రకారం జీఎస్టీపీ టీడీపీ హయాంలో 8.98 గా ఉంది. వైసీపీ పాలనలో 4.86 గా ఉంది. -4.12 గ్రోత్ రేటు ఉంది. అప్పులు విపరీతంగా తెచ్చుకుని వాటిని కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎకనామిక్ గ్రోత్ రావాలి. ఎకనామిక్ గ్రోత్ ఏమో మైనస్ ఉంది. అన్ని చోట్ల నుండి తెచ్చిన అప్పులు పది లక్షల కోట్లు ఎక్కడికి పోయాయో జగన్ రెడ్డే చెప్పాలి. ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ రూ. 2 లక్షల 26 వేల కోట్లు పెరిగాయి. గత 60 సంవత్సరాల కాలంలో చేసిన అప్పుకంటే జగన్ రెడ్డి ఒక్కడే ఎక్కువ అప్పు చేశాడు. ఎంత తెచ్చారు, ఎంత ఖర్చుపెట్టారు, ఎంత ఎకనామిక్ గ్రోత్ వచ్చింది, ఎంత డవలప్ మెంట్ వచ్చింది అంటే వైసీపీ నేతల నుండి సమాధానం లేదన్నారు.
ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గు చేటు
45 రోజులు కూడా కాకుండానే అన్ని అమలు చేయాలంటూ వైసీపీ నేతలు కోరడం ఏంటి? 11 సీట్లు రావడంతో జగన్ ఫుల్ ఫ్రెస్ స్టేషన్ లో ఢిల్లీకి వెళ్లాడు. ఢిల్లీలో ఏదోక తోడు సంపాదించుకుంటే ఏపీలో నాటకాలు ఆడోచ్చని ప్రయత్నిస్తున్నాడు. ఇండియా కూటమిలో కొంతమందిని పిలిపించుకుని షో చేయాలని చూశాడు. భవిష్యత్ లో లీడర్ గా గుర్తించరేమో అనే భయంతో ఢిల్లీ పరిగెట్టి షో చేశాడు. ఇక్కడ అసెంబ్లీ, కౌన్సిల్ జరుగుతున్నప్పుడు ... అసెంబ్లీకి ఢిల్లీలో ధర్నాకు పోవడం రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణం కాదు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుంటే జగన్ ప్రతిపక్ష హోదా అడగటం సిగ్గుచేటు. గతంలో ఎల్వోపీ లేకపోయినా జనార్థన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి పోరాడారు. అసెంబ్లీ నుండి వైసీపీ నేతలు పారిపోవడానికి వైసీపీ నేతలు ఆడుతున్న నాటకం. ఓడిపోయినా సీటు వదలని నేతలు ఉన్నట్లు .. జగన్ సీఎం సీటును వదలలేకపోతున్నాడు. జగన్ ధర్మం గురించి మాట్లాడటం హాస్యాస్పందంగా ఉందన్నారు.
అసెంబ్లీని కించ పరిచిన జగన్
శ్వేతపత్రాల్లో వాస్తవాలను వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలిస్తే భవిష్యత్ లో మనుగడ ఉండదని శ్వేత పత్రాలను వైసీపీ నేతలు వక్రీకరించి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ, శాసనమండలికి వచ్చి మాట్లాడకుండా ఢిల్లీ, హైదరాబాద్ లలో ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. ఇది చూస్తుంటే వైసీపీ నేతల్లో భయం ఉందని స్పష్టం అవుతుంది. వైసీపీ నేతలు చేసిన తప్పుడు విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. అభివృద్ధి పూర్థిగా కుంటుపడింది.. ఫైనాన్సియల్ సిస్టమ్ దెబ్బతింది. గత వైసీపీ పాలకులు సహజవనరులను దోచుకోని రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని మండిపడ్డారు. అసెంబ్లీని కించపరుస్తూ మాట్లాడిన జగన్ పై ప్రివిలేజ్ నోటీసులు ఇస్తామన్నారు.