అన్వేషించండి

Andhra Pradesh: ఉత్తరాలు రాస్తే బహుమతులు- జాతీయ స్థాయిలో పోస్టాఫీసు విభాగం పోటీలు

Andhra Pradesh: డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా అనే అంశంపై తపాలా శాఖ లేఖారచన పోటీలు నిర్వహించబోతోంది. జాతీయ స్థాయిలో థాయి ఆఖర్ పేరుతోనిర్వహిస్తున్న ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వనున్నారు.

Andhra Pradesh: ఒకప్పుడు ఎవరికైనా సమాచారం అందజేయాలన్నా, సమాచారం తెలుసుకోవాలనుకున్నా ఉత్తరాలు రాసుకునేవారు. ప్రేమలో ఉన్న యువతీ యువకులు అయితే ప్రేమ లేఖలు రాసుకునే వారు కూడా. అయితే మొబైల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి అవన్నీ తగ్గిపోయాయి. ఒక్క మెసేజ్, ఫోన్ కాల్ తోనే అన్ని పనులు పూర్తి అవుతున్నాయి. అయితే ఆనాటి సమాచార సాధనం గురించి నేటి తరానికి తెలపాలని.. మరిచిపోయిన ఆనాటి తరానికి గుర్తు చేయాలని తలాపాశాఖ రచనా పోటీలకు శ్రీకారం చుట్టింది. డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా అనే అంశంపై లేఖలను ఆహ్వానిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో థాయి ఆఖర్ పేరుతో పోటీలు నిర్వహించబోతుంది. భారతదేశ పౌరులు ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఎలాంటి వయో పరిమితి లేదు.

ముఖ్యంగా 18 ఏళ్ల లోపు వారిని ఒక కేటగిరీగా, 18ఏళ్ల పైబబడిన వారిని మరో కేటగిరీగా పరిగణిస్తారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో వ్యాసం కూడా రాయవచ్చు. డిజిటల్ విదానంలో పాలన, మౌలిక సదుపాయాలు, అక్షరాస్యత, డిజిటల్ పేమెంట్స్ తదితర అంశాలను అందులో పొందుపరచాలి. ఏ4 సైజు పేపుర్ పై లేఖ రాసి ఎన్వలప్ కవర్ లో ఉంచి పంపించవచ్చు. లేదా ఇన్ లాండ్ లెటర్ ద్వారా కూడా పంపించవచ్చు. ఎన్వలప్ కవర్ అయితే వెయ్యి పదాలకు మించకుండా, ఇన్ లాండ్ లెటర్ లో అయితే 500 పదాలకు మించకుండా రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్, ఇతర ఎలక్ర్టానిక్ సాధనాల్లో టైప్ చేసిన లేఖలను పోటీకి అనుమతించరు. చేతితో మాత్రమే లేఖ రాసి పంపాలి. 

లేఖలను పంపే వారి వయసును నిర్ధారిస్తూ.. సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. పోటీలో గెలిస్తే వారి వయసు, ఇడీ ధ్రువీకరణకు అవసరమైన పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా రాసిన ఉత్తరాలను ది చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, ఏపీ సర్కిల్, విజయవాడ - 520013 చిరునామాకు అక్టోబర్ 31వ తేదీలోగా పంపించాలి. అయితే ఇలా చేయడం వల్ల పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు పోటీ తత్త్వం అలవడుతుందని అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ పాండా తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీలతో పాటు స్థానిక భాషల్లో కూడా వ్యాసం రాయవచ్చని.. దీని వల్ల విద్యార్థుల్లో భాషా నైపుణ్యం కూడా పెరుగుతుందని అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Embed widget