అన్వేషించండి

Anantapur News: డిసెంబర్ 1 ఎయిడ్స్ డే: హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు ఏపీ సర్కార్ పింఛను ఎంతో తెలుసా

Anantapur News: ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 34,513 మంది వ్యాధి నిర్ధారించి వారు ఉన్నారు.

World AIDS Day: మానవ జీవితంలో ఎన్నో రోగాలు వస్తూ పోతూ ఉంటాయి.. కొన్ని రోగాలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి రోగాలలో ఎయిడ్స్ మహమ్మారి ఒకటి. క్షణిక సుఖం కోసం కొందరు చేసే తప్పు వారి జీవితాలను నాశనం చేస్తుంది. హెచ్ఐవీ మహమ్మారి సోకి జీవితంతో కొట్టుమిట్టాడుతూ కొందరు ఉంటారు. కొందరు ఎయిడ్స్ బాధితులు వారికి వచ్చిన మహమ్మారి గురించి ఎవరికీ చెప్పుకోలేక వారిలో వారే తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉంటారు. మరికొందరు జీవనాధారం కోసం డబ్బులు కూడా లేని వారు..  వైద్య ఖర్చుల నిమిత్తం కూడా లేని వారు కొందరు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యం క్షీణించకుండా ఉండేందుకు రోగనిరోధక శక్తి మందులను ప్రతి నెల అందిస్తూన్నా.. కొందరికి అవి అందటం లేదు. 

హెచ్ఐవీ ఎయిడ్స్ రోగం కు శాశ్వత పరిష్కారం లేక ఎంతోమంది బాధితులు మరణిస్తూ ఉంటారు. ఈ మహమ్మారి రోగాన్ని పూర్తిగా నయం చేయలేము కానీ దాని నివారించవచ్చని డాక్టర్లు చెబుతుంటారు. ప్రతి నెల క్రమం తప్పకుండా వైద్యులు సూచించినట్లు మందులు వాడితే రోగనిరోధక శక్తి పెరిగి బాధితుల ఆయుషు 20 నుంచి 30% పెరిగే అవకాశం ఉంది. 

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 34,513 మంది వ్యాధి నిర్ధారించి వారు ఉన్నారు.  వీరిలో యాంటీ విట్రో వైరల్ చికిత్స కేంద్రాలలో మందులు వాడే వారి సంఖ్య 15406మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. శరీరంలో హెచ్ఐవీ వైరస్ అదుపులో ఉన్న వారి సంఖ్య 12వేల 153 మంది గా వైద్యాధికారులు గుర్తించారు. 

హెచ్ఐవీ ఎయిడ్స్ మహమ్మారి వెంటాడే వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతినెల 3 వేల రూపాయలు పెన్షన్ రూపంలో ప్రభుత్వం అందిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 34,513 మందికి గాను 15406 మంది ప్రతి నెల రోగనిరోధక శక్తి మందులు ఏ.ఆర్.టి సెంటర్ లో తీసుకొని వాడుతున్నారు. వీరిలో  12,399 మంది పెన్షన్కు ఎలిజిబిలిటీ ఉన్నవారు. ఇందులో 9050 మంది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి పింఛన్ కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ప్రభుత్వం కేవలం 3993 మందికి మాత్రమే ప్రతి నెల సామాజిక పింఛన్ను అందిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం కొందరు వ్యాధిగ్రస్తులు పింఛన్ పొందేందుకు అర్హత పొందలేకపోతున్నారు. 300యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ను వాడిన, సాగుభూమి ఎక్కువగా ఉండటం, సొంత వాహనం కలిగి ఉన్న కారణాలతో పింఛన్లు మంజూరు కావడం లేదు. స్వచ్ఛంద సంస్థలు దాతల సహాయంతో వీలైనంతమందికి పౌష్టిక ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా కొందరు బాధితులు ఆర్థిక స్థోమత లేకపోవడం తో మందులు తీసుకోవడానికి ఏ ఆర్ టి కేంద్రాలకు రావడం లేదు. ఉమ్మడి జిల్లాలో 34,513 మందికి హెచ్ఐవీ బాధితులు ఉన్నారు.

దేశవ్యాప్తంగా సుమారు 2.5 మిలియన్ ప్రజలు హెచ్.ఐ. వి బారిన పడ్డారు. ప్రతి సంవత్సరం దేశం లో 0.22 శాతం హెచ్.ఐ. వి వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. ఆంద్రప్రదేశ్ లో సుమారు 3.21 లక్షల మంది హెచ్.ఐ వి. భారిన పడ్డారు. 2018 -2019వ సంవత్సరం లో 0.30 శాతంగా ఉన్న హెచ్.ఐ.వి వ్యాప్తి 2020 ౼2021 లో 0.37 శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Embed widget