By: ABP Desam | Updated at : 25 Apr 2022 05:15 PM (IST)
రాజస్తాన్ చేసిన సీపీఎస్ రద్దు ఏపీ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోంది ?
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ కోసం ఉద్యోగులు ఉద్యమించిన తర్వాత ఆ స్థాయిలో సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఈ సారి పోలీసులు విజయవంతంగా సీపీఎస్ ఉద్యోగులు పిలుపునిచ్చిన " చలో తాడేపల్లి"ని అడ్డుకోగలిగారు. నిలువరించగలిగారు. కానీ అందు కోసం చేసిన ప్రయత్నాలు చూస్తే.. సీపీఎస్ ఉద్యోగులు విజయం సాధించినట్లే. ప్రభుత్వం సీపీఎస్ రద్దు విషయంలో ఇంత ఒత్తిడి ఎందుకు ఎదుర్కొంటోంది ? చాలా సమస్యకు చూపించినట్లుగా ఇన్‌స్టంట్ పరిష్కారం ఎందుకు చూపించలేకపోతోంది ? రాజస్థాన్ ప్రభుత్వం ఎలా రద్దు చేయగలిగింది ?
ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీపీఎస్ గురించి తెలియకుండానే సీఎం జగన్ హామీ ఇచ్చారని పీఆర్సీపై చర్చల సమయంలో ఓ ప్రకటన చేశారు. సీపీఎస్ రద్దు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని లెక్కలు చెప్పారు. సీపీఎస్ రద్దు చేయడం అసాధ్యం కాబట్టి... వారికి పెన్షన్ సెక్యూరిటీ ఎలా అని ఆలోచిస్తున్నామని ప్రకటించారు. సీపీఎస్ విషయంలో టెక్నికల్ ఇష్యూస్ తెలియకుండా హామీ ఇచ్చారు కాబట్టి ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నామని ప్రకటించారు. అప్పుడే ఉద్యోగ సంఘాలు భగ్గమన్నాయి. సీపీఎస్ రద్దు చేసి తీరాల్సిదేనన్నాయి.
రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సీపీఎస్ ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. 2004 తర్వాత చేరిన వారెవరికీ సీపీఎస్ ఉండదని పాత పెన్షన్ విధానమే ఉంటుందని ప్రకటించారు. నిజానికి రాస్థాన్ ఉద్యోగుల్లో సీపీఎస్ వద్దని పాత పెన్షన్ విధానం కావాలని ఉంది కానీ వారు ఉద్యమాలు చేయలేదు. వారి ఓట్ల కోసం రాజకీయ పార్టీలు సీపీఎస్‌ను రద్దు చేస్తామని చెప్పలేదు. కానీ రద్దు చేశారు. రాజస్థాన్‌కు సాధ్యమయింది.. ఏపీకి ఎందుకు సాధ్యం కావట్లేదనేది ఉద్యోగుల ప్రధాన ప్రశ్న..!
Pawan Kalyan : ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ
Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
Breaking News Live Updates : పిడుగురాళ్ల రైల్వే క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Today Panchang 21st May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిబాధలు తొలగించే స్త్రోత్రం