By: ABP Desam | Updated at : 23 Mar 2023 04:42 PM (IST)
చట్ట ప్రకారమే అమరావతిలో హైకోర్టు ఏర్పాటు
AP Highcourt : ఏపీ హైకోర్టును తరలించాలంటే హైకోర్టుతో కలిసి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కేంద్ర స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ కనమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజుజు సమాధానం ఇచ్చారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హైకోర్టు అమరావతి లో ఏర్పాటైందన్నారు. హైకోర్టును కర్నూల్ )కు తరలిచాంలంటే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసే నిర్ణయం తీసుకోవాలని ఇందులో కేంద్రం పాత్ర లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని 214 నిబంధన ప్రకారం 2018లో కేంద్రం వర్సెస్ దన్ గోపాల్ రావు, ఇతరుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటు అయిందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ కు ఉమ్మడి హైకోర్టుగా ఉన్న అప్పటి హైదరాబాద్ హైకోర్టు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటయిందన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు ప్రతిపాదించారని, సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదలను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యాయని కిరణ్ రిజిజు అన్నారు.
మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు రాజధాని అమరావతి నగరంలో, పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీని ఆదేశించిందన్నారు. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉందని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. కర్నూలుకు హైకోర్టు తరలిస్తామని ఏపీ ప్రభుత్వం చట్టం చేసింది. కానీ అడుగు ముందుకు పడలేదు. నిజానికి అసెంబ్లీకి హైకోర్టును తరలించే అధికారం లేదని చట్టం చేసినంత మాత్రాన హైకోర్టును తరలించలేరన్న న్యాయనిపుణులు స్పష్టం చేశారు.
న్యాయస్థానాలు ఎక్కడి నుంచి పని చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయలేరని చెబుతున్నారు. అయితే మూడు రాజధానుల బిల్లును రాష్ట్ర ప్రభుత్వంవెనక్కి తీసుకుంది. న్యాయరాజధాని అనే అంశాన్ని ప్రస్తుతం పెద్దగా పట్టించుకోడం లేదు. సుప్రీంకోర్టులో కూడా న్యాయరాజధాని అంశాన్ని పక్కన పెట్టామని ప్రభుత్వ తరపు లాయర్ వాదించారు. ఇప్పుడు హైకోర్టు చట్ట ప్రకారమే ఏర్పాటయిందని... తరలించాలంటే.. హైకోర్టుతో కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందనికేంద్రం స్పష్టం చేసింది.
16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు
Kick Boxer Gayatri: ఇసుక తెన్నెల్లో మెరిసిన మాణిక్యం- జాతీయ స్థాయిలో 3 బంగారు పతకాలు సాధించిన గాయత్రి
Odisha Train Accident: కోరమండల్ ప్రమాదం వివరాలు, ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఒడిశా ప్రభుత్వం
AP PG CET: ఏపీ పీజీ సెట్-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్