అన్వేషించండి

Weather Updates: తీరం దాటిన వాయుగుండం - ఏపీలో అక్కడ భారీ వర్షాలు, తెలంగాణలో పొడి వాతావరణం

Today Rain News Updates: ఉత్తర శ్రీలంక - ఉత్తర తమిళనాడు కాకుండా చెన్నై - పుదుచ్చేరిల మధ్య వాయుగుండం తీరాన్ని తాకినట్లు ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

Rains in Telangana AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం పుదుచ్చేరి - చెన్నై మధ్యలో తీరాన్ని తాకింది. సాధారణంగా జరిగే ప్రక్రియకు భిన్నంగా ఉత్తర శ్రీలంక - ఉత్తర తమిళనాడు కాకుండా చెన్నై - పుదుచ్చేరిల మధ్య వాయుగుండం తీరాన్ని తాకినట్లు ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను ఆనుకొని ఏర్పడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది క్రమంగా వాయువ్య దిశగా పయనించి తీరం దాటింది. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడులో మరో రెండు రోజులు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
 
ఆంధ్రప్రదేశ్‌ నేడు, రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో నేడు సైతం వాతావరణం పొడిగా మారిపోయింది. రాష్ట్రంలో మరో రెండు నుంచి మూడు రోజులు వాతావరణంలో ఏ మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. ఏపీలో తీరం వెంట 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 16న మరో అల్పపీడనం ఏర్పడనుంది. భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెంకటగిరి మున్సిపల్‌ కమిషనర్‌ గంగాప్రసాద్‌ స్థానికులను హెచ్చరించారు. మున్సిపల్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని, సహాయం కావాల్సిన వారు 9110564575, 08625-295015, 9849905894 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, పాత భవనాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.

తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
తెలంగాణలో వాతావరణం మరింత పొడిగా మారింది. మరో మూడు రోజులవరకు వాతావరణంలో ఎలాంటి మార్పులు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రానికి ఎలాంటి వర్ష సూచన లేదు. వర్షాలు లేకపోవడంతో తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు ఇంకా భారీగా నమోదవుతుండగా.. రాత్రివేళ చలి తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత ఖమ్మంలో 33.2 డిగ్రీలు నమోదు కాగా, మెదక్ లో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. మెదక్ లో అత్యల్పంగా రాత్రిపూట 13.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

హైదరాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘాలతో ఉంది. నగరంలో ఉదయం సమయంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది, గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. జిల్లాలతో పోల్చితే హైదరాబాద్‌లో చలి సాధారణంగా ఉంది. 

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నవంబర్ 13, 14 తేదీలల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వానలు కురవనున్నాయి. నవంబర్ 12 నుంచి 15 తేదీల్లో ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. వాయుగుండం తీరాన్ని తాకడంతో ఉత్తర కోస్తాంధ్రలో సాధారణ వర్షపాతం నమోదు కానుంది. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురవనుంది. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులతో పాటు గాలులు వీచడంతో చలి తీవ్రత పెరుగుతోంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలో పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నాయి. 

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర భాగాలైన ప్రకాశం పశ్చిమ భాగాల్లో, పల్నాడు, ఎన్.టీ.ఆర్, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలున్నాయి. ఈ రోజు కూడా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలుంటాయి. ఆ జిల్లాలతో పాటుగా కడప, అన్నమయ్య, సత్యసాయి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అనంతపురం, తిరుపతి, కడప జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లాలోని మిగిలిన భాగాల్లో చిరు జల్లులు పడతాయి. మన ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు బార్డర్ ప్రాంతాలైన నగరి, పుత్తూరు, సత్యవేడు వైపు వర్షాలున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABPAxar Patel All round Show vs GT | గుజరాత్ మీద మ్యాచ్ లో ఎటు చూసినా అక్షర్ పటేలే |DC vs GT | IPL 2024Rishabh Pant vs Mohit Sharma 31 Runs| ఆ ఒక్క ఓవరే విజయానికి ఓటమికి తేడా | DC vs GT | IPL 2024Rishabh Pant 88 Runs vs GT | పంత్ పోరాటంతోనే భారీ స్కోరు చేసిన ఢిల్లీ | DC vs GT | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Karimnagar News: గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
Embed widget