X

Today Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు వానలే వానలు..పలుజిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు కొనసాగుతోంది. రానున్న మూడు రోజులు ఇదే వాతావరణం ఉంటుందని.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.

FOLLOW US: 

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. అల్పపీడన ప్రాంతం నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకూ 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో 24 శుక్రవారం నాటికి  తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, ఉత్తర ఒడిశా తీరం దిశగా రానుందని వాతావరణ శాఖ తెలిపింది. 

అల్పపీడనం ప్రభావంతో  తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం రాత్రి 08.30 గంటలకు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గురువారం ఉదయం 08.30 వరకు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడవచ్చు. ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి,మెదక్, కామారెడ్డి జిలాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.  తెలంగాణలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని,  కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. మరో మూడురోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. 

Also Read: ఈ రాశుల వారు పెద్ద బాధ్యతలు తలకెత్తుకుంటారు, ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉండడండో ఆంధ్రప్రదేశ్ లోనూ మరో రెండు రోజులపాటు వర్షాలు పడతాయని చెప్పారు వాతావరణ శాఖాధికారులు. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో అన్ని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు కళకళలాడుతోంది. అలాగే నాగార్జున సాగర్ కు భారీగా వరద పోటెత్తుతతోంది. వర్షాకాలం ముగింపు దశలోనూ వర్షాలు పడుతుండడంతో ప్రాజెక్టులు నిండుగా కనిపిస్తున్నాయి.

Also Read: హైదరాబాద్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఇక ‘రైజ్’అవ్వడం కష్టమే!

ALso Read: పెరిగిన ఇంధన ధరలు.. ఇక్కడ భారీ తగ్గుదల, కొన్ని చోట్ల స్థిరం

Als Read: మరింత పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్‌లో ఇంకా.. వెండి కూడా అదే దారిలో..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: telangana rains andhrapradesh rains rains in ap weather alert rain alert weather alert today floods in hyderabad weather updates today

సంబంధిత కథనాలు

Breaking News Live: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌‌లో 2.7 కేజీల బంగారం సీజ్, విలువ రూ.1.36 కోట్లు

Breaking News Live: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌‌లో 2.7 కేజీల బంగారం సీజ్, విలువ రూ.1.36 కోట్లు

Nellore Crime: నెల్లూరు జిల్లాలో ఘాతుకం... సహజీవనంలో గొడవలు ఇద్దరి దారుణ హత్య

Nellore Crime: నెల్లూరు జిల్లాలో ఘాతుకం... సహజీవనంలో గొడవలు ఇద్దరి దారుణ హత్య

Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి యువతి షికారు.. ఆకతాయిల ఎంట్రీతో కథలో ట్విస్ట్...

Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి యువతి షికారు.. ఆకతాయిల ఎంట్రీతో కథలో ట్విస్ట్...

Gudivada Casino : ఇవిగో గుడివాడ కేసీనో ఆధారాలు... రిలీజ్ చేసిన టీడీపీ !

Gudivada Casino :  ఇవిగో గుడివాడ కేసీనో ఆధారాలు... రిలీజ్ చేసిన టీడీపీ !

Bridge Collapse In Nellore: ప్రమాదం దాటితేనే కడుపు నిండేది.. చదువు వచ్చేది

Bridge Collapse In Nellore: ప్రమాదం దాటితేనే కడుపు నిండేది.. చదువు  వచ్చేది
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Shyam SinghaRoy: నానిని పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్య.. వీడియో చూశారా..? 

Shyam SinghaRoy: నానిని పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్య.. వీడియో చూశారా..? 

Moto Tab G70 LTE Sale: మోటొరోలా బడ్జెట్ ట్యాబ్లెట్ సేల్ నేడే.. ధర తక్కువే!

Moto Tab G70 LTE Sale: మోటొరోలా బడ్జెట్ ట్యాబ్లెట్ సేల్ నేడే.. ధర తక్కువే!

HBD Namrata Mahesh Ghattamaneni: నమ్రతా శిరోద్కర్ గురించి ఈ విషయాలు తెలుసా..

HBD Namrata Mahesh Ghattamaneni: నమ్రతా శిరోద్కర్ గురించి ఈ విషయాలు తెలుసా..

Groom Slaps Bride: వధువును కొట్టిన వరుడు.. అదే ముహూర్తానికి కజిన్‌ను పెళ్లాడిన యువతి

Groom Slaps Bride: వధువును కొట్టిన వరుడు.. అదే ముహూర్తానికి కజిన్‌ను పెళ్లాడిన యువతి