Horoscope Today:ఈ రాశుల వారు పెద్ద బాధ్యతలు తలకెత్తుకుంటారు, ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
2021 సెప్టెంబరు 23 గురువారం రాశిఫలాలు
మేషం
మేషరాశివారు ఈరోజుశుభవార్త వింటారు. బంధువులను కలుస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. టెన్షన్ తగ్గుతుంది. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. దీర్ఘకాలిక వ్యాధి మళ్లీ పుట్టుకొస్తుంది. విద్యుత్, వాహనాలు మొదలైనవి ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తెలియని వ్యక్తులతో చర్చలు వద్దు. మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
వృషభం
నిన్నటితో పోలిస్తే పని ఒత్తిడి తక్కువ ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునేవారికి మంచి సమయం. వివాదాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ఆందోళన చెందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఖర్చులను నియంత్రించండి. విద్యార్థులు కష్టపడి పనిచేయాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మతపరమైన పనుల్లో పాల్గొంటారు. విద్యార్థులు మరింత కష్టపడాలి.
మిథునం
తొందరపాటు వద్దు. ఓ పనికి సంబంధించి కొత్త ప్రణాళిక రూపొందిస్తారు. సామాజిక స్థితి బలంగా ఉంటుంది. యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. కుటుంబానికి సంబంధించిన ఆందోళన ఉంటుంది. కెరీర్లో విజయం సాధిస్తారు. వ్యాపార సంబంధిత ప్రయాణాలు విజయవంతమవుతాయి. ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. అసమతుల్యతకు దూరంగా ఉండండి. వ్యాపారం బాగానే ఉంటుంది.
కర్కాటక రాశి
ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొంతపని చేయగానే అలసిపోతారు. ఆర్థిక ప్రయోజనాలుంటాయి. విద్యార్థులు కష్టపడి పనిచేయాలి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. విద్యార్థులకు మంచి రోజు. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తారు. పెట్టిన పెట్టుబడి నుంచిల లాభం ఉంటుంది. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు.
Also Read: అనంతపురం పెన్షన్‌దారుల్లో టెన్షన్.. ఒక్క నెలలో 20 వేల పింఛన్లు ఔట్.. వచ్చే నెలలోనూ ఇంతేనా?
సింహం
ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపడకండి. దీర్ఘకాలిక వ్యాధి బారిన పడే సూచనలున్నాయి జాగ్రత్త. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో మీకు అసౌకర్యం కలుగుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. కుటుంబ పెద్దల, జీవిత భాగస్వామితో చర్చించాక ఏదైనా పనిని ప్రారంభిస్తే సక్సెస్ అవుతారు. వ్యాపార ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందగలరు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది.
కన్య
ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. సులభంగా పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభసమయం. స్నేహితుల నుంచి సహాయం అందుకుంటారు. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. విద్యార్థులు, యువత విజయం సాధిస్తారు. చదువుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఏదైనా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. ఈ రోజు ప్రయాణాలు చేస్తారు.
తులారాశి
ఆదాయం పెరుగుతుంది, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. ఏదో తెలియని సంఘటన కారణంగా భయం అలాగే ఉంటుంది. పెద్ద నిర్ణయం తీసుకోవడానికి తొందరపడకండి. శారీరక నొప్పి బాధించే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలుకు శుభసమయం. కెరీర్ సంబంధిత ఆందోళనలు తొలగిపోతాయి. ఎటువంటి కారణం లేకుండా వివాదాలు తలెత్తవచ్చు. దీర్ఘకాలిక వ్యాధి ఉద్భవించే అవకాశం ఉంది. బంధువుల నుంచి దుర్వార్తలు వినొచ్చు. ఎక్కువ రిస్క్ తీసుకోకండి.
వృశ్చికరాశి
మీ పని పెండింగ్‌లో ఉంటుంది. జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు ఉండొచ్చు. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పెద్దల అనుభవాలను గుర్తుంచుకుని చేసే పనిలో ప్రయోజనాన్ని పొందుతారు. గాయపడే ప్రమాదం ఉంది. కోపాన్ని నియంత్రించుకోండి. ఇబ్బందుల్లో పడొచ్చు.
Also Read: ప్రెగ్నెంట్స్ ఈ ఆసనాలు చేస్తే చాలా మంచిదట... 90 నిమిషాల యోగా ఆరోగ్యవంతం
ధనుస్సు
అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందే అవకాశం ఉంది. తెలియని వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. మీరు బంధువుని కలవవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ ప్రియమైనవారి మద్దతు మీకు లభిస్తుంది. ఈ రోజు మీరు చాలా సానుకూలంగా ఉంటారు. భగవంతుడిని పూజించడంపై ఆసక్తి ఉంటుంది. శుభవార్త వింటారు. వివాదాలు తొలగిపోతాయి.తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు కలిసొచ్చే సమయం. ఒత్తిడి దూరమవుతుంది.
మకరం
విద్యార్థుల సమస్య పరిష్కారమవుతుంది. జీవిత భాగస్వామి నుంచి సహకారం లభిస్తుంది. ఎక్కువ ఖర్చు చేస్తారు. కొత్త ఉద్యోగంలో చేరొచ్చు. అర్థరాత్రి విధులు నిర్వర్తించే ఉద్యోగాలకు స్వస్తి చెప్పడం మంచిది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం క్షీణించవచ్చు. ఈరోజు బంధువులతో సమావేశం ఉండొచ్చు. అవసరమైన వారికి సహాయం చేయండి. మీ పని సమయానికి పూర్తవుతుంది.
కుంభం
కార్యాలయంలో సహోద్యోగుల సహాయం పొందుతారు. యువతకు కెరీర్ సంబంధిత సమాచారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. సోమరితనం వద్దు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అప్పుల నుంచి బయటపడతారు. సామాజిక స్థితి బలంగా ఉంటుంది. బంధువులను కలుస్తారు. చాలా కాలం తర్వాత స్నేహితుడితో చర్చ జరుగుతుంది.
మీనం
ఈ రోజు మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. యువత కెరీర్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందుతారు. ఈరోజు ఖర్చులు అధికంగా ఉండొచ్చు. ఈరోజు మీ పని స్నేహితుల సహాయంతో ముందుకు సాగుతుంది. సంతోషకరమైన రోజు అవుతుంది. మీరు పూర్తి బాధ్యతలు నిర్వర్తించగలుగుతారు.
Also Read: 'నన్ను తీసి పడేస్తారు.. జోకర్ అంటారు, లఫంగ్ అంటారు' మండిపడ్డ లోబో..