DC vs SRH, Match Highlights: హైదరాబాద్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఇక ‘రైజ్’అవ్వడం కష్టమే!

IPL 2021, DC vs SRH: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో జట్టు ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు గల్లంతయినట్లే.

FOLLOW US: 

దేశం మారినా సన్‌రైజర్స్ రాత మాత్రం మారలేదు. నేటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ఈ ఓటమితో సన్ రైజర్స్ ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు గల్లంతయినట్లే.. అద్భుతం జరిగితే తప్ప రైజర్స్ ప్లేఆఫ్‌కు వెళ్లే అవకాశం లేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయింది. చివర్లో సమద్(28: 21 బంతుల్లో, 2 ఫోర్లు, ఒక సిక్సర్), రషీద్(22: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) ఆదుకోవడంతో 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్ రబడ మూడు వికెట్లు తీశాడు.

అనంతరం ప్రారంభంలోనే పృథ్వీ షా అవుటయినా.. శిఖర్ ధావన్ (42: 37 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), శ్రేయర్ అయ్యర్(47 నాటౌట్: 41 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఢిల్లీని ముందుకు నడిపించారు. తర్వాత ధావన్ అవుటయినా పంత్‌(35 నాటౌట్: 21 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి అయ్యర్ గేమ్‌ను ఫినిష్ చేశాడు. ఈ విజయంతో ఢిల్లీ తిరిగి టేబుల్‌లో అగ్రస్థానానికి చేరింది.

ప్రారంభం నుంచి పడుతూ.. లేస్తూ..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలిందే. మొదటి ఓవర్ మూడో బంతికే డేవిడ్ వార్నర్(0, 3 బంతుల్లో)ను ఔట్ చేసి నోర్జే ఢిల్లీకి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. అనంతరం క్రమం తప్పకుండా బౌండరీలు కొడుతూ టచ్‌లో ఉన్నట్లు కనిపించిన సాహా (18: 17 బంతుల్లో, 2 ఫోర్లు, ఒక సిక్సర్) కూడా భారీ షాట్‌కు వెళ్లి అవుట్ కావడంతో సన్‌రైజర్స్ పూర్తిగా కష్టాల్లో పడింది.

ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా వికెట్లు పడుతూనే ఉన్నాయి. కేన్ విలియమ్సన్ (18: 26 బంతుల్లో, 1 ఫోర్), మనీష్ పాండే (17: 16 బంతుల్లో, ఒక ఫోర్), కేదార్ జాదవ్(3, 8 బంతుల్లో), జేసన్ హోల్డర్ (10: 9 బంతుల్లో, ఒక సిక్సర్) ఇలా వచ్చిన వాళ్లు వచ్చినట్లు అవుటయ్యారు. చివర్లో సమద్(28: 21 బంతుల్లో, 2 ఫోర్లు, ఒక సిక్సర్), రషీద్(22: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) కాస్త మెరుపులు మెరిపించడంతో సన్‌రైజర్స్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఢిల్లీ బౌలర్లలో రబడ మూడు వికెట్లు తీయగా, నోర్జే, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.

Also Read: Cricket Update: కివీస్‌కు భారత్‌ నుంచే బెదిరింపులు.. పాక్‌ మంత్రి ఆరోపణలు!

మెల్లగా మొదలై చివర్లో వేగం..
ఢిల్లీకి కూడా ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. రెండు బౌండరీలు కొట్టి టచ్ మీద కనిపించిన పృథ్వీ షా (11: 8 బంతుల్లో, 2 ఫోర్లు) ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి అవుటయ్యాడు. అనంతరం శిఖర్ ధావన్ (42: 37 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), శ్రేయర్ అయ్యర్ కలిసి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే ప్రయత్నం చేశారు. రెండో వికెట్‌కు 52 పరుగులు జోడించిన అనందరం ధావన్‌ను రషీద్ ఖాన్ అవుట్ చేసి హైదరాబాద్‌కు మంచి బ్రేక్ ఇచ్చాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్‌తో కలిసి శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుకు నడిపించాడు. కొట్టాల్సిన స్కోరు కాస్త తక్కువగానే ఉండటంతో మొదట నిదానంగా ఆడిన వీరు మెల్లగా గేర్ మార్చారు. చివరి 24 బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన దశలో 11 బంతుల్లోనే 29 పరుగులు చేసి వీరు జట్టును గెలిపించారు. వీరి జోడి మూడో వికెట్‌కు అజేయంగా 67 పరుగులు జోడించింది. దీంతో ఢిల్లీ పాయింట్ల టేబుల్‌లో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. మరో ఒకట్రెండు విజయాలు సాధిస్తే అధికారికంగా ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకుంటుంది.

Also Read: Afghanistan T20 WC Ban: అఫ్గాన్‌ క్రికెట్‌పై పిడుగు! ఐసీసీ జట్టును బహిష్కరించే ప్రమాదం!

Also Read: Mithali Raj Record: వారెవ్వా మిథాలీ.. అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగులతో రికార్డు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 22 Sep 2021 11:16 PM (IST) Tags: IPL IPL 2021 Delhi Capitals DC Rishabh Pant SRH Dubai International Stadium Sunrisers Hyderabad Kane Williamson srh vs dc IPL 2021 Match 33

సంబంధిత కథనాలు

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK: మెరుపు ఆరంభం లభించినా తడబడ్డ చెన్నై - రాజస్తాన్ లక్ష్యం ఎంతంటే?

RR Vs CSK: మెరుపు ఆరంభం లభించినా తడబడ్డ చెన్నై - రాజస్తాన్ లక్ష్యం ఎంతంటే?

RR Vs CSK Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై - ఈ మ్యాచ్ రాజస్తాన్‌కే కీలకం

RR Vs CSK Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై - ఈ మ్యాచ్ రాజస్తాన్‌కే కీలకం

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు

MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా

Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా

Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్

Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్