Weather Latest Update: తీరం దాటిన వాయుగుండం, ఈ జిల్లాలకు వర్ష సూచన! తెలంగాణలో మళ్లీ చలి
నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం ఓడరేవుల్లో ఒకటో నెంబరు హెచ్చరికను జారీ చేశారు.
శ్రీలంకకు సమీపంలో హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించిన వాయుగుండం శ్రీలంకలో తీరం దాటింది. జనవరి 30 మధ్యాహ్నానికి శ్రీలంక ట్రింకోమలైకు 610 కిలోమీటర్లు, తమిళనాడులోని కరైకల్ కు 820 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం పశ్చిమ దిశగా పయనించి.. ఆ తర్వాత దక్షిణ నైరుతి వైపు దిశ మార్చుకుని ఫిబ్రవరి ఒకటో తేదీన శ్రీలంకలో తీరం దాటిందని వాతావరణ నిపుణులు తెలిపారు.
రానున్న 24 గంటల్లో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం ఓడరేవుల్లో ఒకటో నెంబరు హెచ్చరికను జారీ చేశారు. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
‘‘సరిగ్గా ఇప్పుడు బంగాళాఖాతంలో మాడన్ జూలియన్ ఆసిలేషన్ (దీని వలన వర్షాలు పెరుగుతాయి లేదా తగ్గుతాయి) ప్రభావం ఉంది. ఆ మాడన్ జూలియన్ ఆసిలేషన్ వలన దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ గాలులు కూడ బలంగా ఉంది. అంటే కింద ఎక్కడో ఉన్న అల్పపీడనం శ్రీలంక వైపుగా రానుంది. దీని వలన మనకు ప్రభావం అంతగా ఉండదు. దక్షిణాది జిల్లాలైన నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలో తేలికపాటి వర్షాలుంటాయి. ఒకటి, రెండు చోట్ల మాత్రమే కొంచం సేపు గట్టిగా వర్షాలుంటాయి.
ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఒకటి, రెండు చోట్లల్లో మాత్రమే తేలికపాటి వర్షాలు ఉంటాయి. మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు ఉండవు. దీంతో ఎండాకాలానికి వాతావరణం సిద్దమవ్వనుంది. వెదర్ మాడల్స్ అంచనాల ప్రకారం ఈ సారి ఎండలు కాస్త ఎక్కువగా ఉండనున్నాయి.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా కొద్ది నెలలుగా పొడి వాతావరణమే ఉంటుంది. రాష్ట్రమంతా చలి సాధారణంగానే ఉంటుందని, కానీ, ఉత్తరాది జిల్లాలకు అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు. చాలా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ లు జారీ చేశారు. వచ్చే ఐదు రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఎల్లో అలర్ట్ అంటే.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంటే ఈ అలర్ట్ జారీ చేస్తారు.
హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 30.6 డిగ్రీలు, 15.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైపోథర్మియాతో జాగ్రత్త
విపరీతమైన చలిలో బయటకు వెళ్లే వారు ఎవరైనా అల్ప ఉష్ణస్థితికి (హైపోథర్మియా) గురయ్యే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత హానికర స్థాయికి పడిపోయే పరిస్థితినే హైపోథర్మియా అంటారు.