Weather Latest Update: నేడు తీరం దాటనున్న ‘మోచా’ తుపాను - ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
తెలంగాణలో రాబోయే రోజుల్లో పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.
ఇటు తెలంగాణలో రాబోయే రోజుల్లో పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు వాయువ్య దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి రాష్ట్రంలో కొన్ని చోట్ల సుమారుగా 41 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ మరియు చుట్టూ పక్కల జిల్లాలలో 37 డిగ్రీల నుండి 41 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణపై ఎఫెక్ట్ ఇలా
దీని ప్రభావం వలన తెలంగాణ రాష్ట్రంలో అంతా పొడి వాతావరణమే ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి రాష్ట్రంలో కొన్ని చోట్ల సుమారుగా 41 డిగ్రీల నుండి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో సుమారుగా 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 38.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 62 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కూడా వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుందని అధికారులు తెలిపారు. రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ ఎక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.
నేడు గుంటూరు జిల్లా మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మొత్తం 125 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 144 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 161 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు.
నేడు, రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (125)
అల్లూరి జిల్లా 5, అనకాపల్లి 2, బాపట్ల 21, తూర్పుగోదావరి 5, ఏలూరు 6, గుంటూరు 12, కాకినాడ 2, కోనసీమ 3, కృష్ణా 17, ఎన్టీఆర్ 17, నంద్యాల 3, పల్నాడు 24, ప్రకాశం 2, తిరుపతి 2, వైఎస్సార్ జిల్లాలో 7 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. శుక్రవారం కాకినాడ జిల్లా 3, అనకాపల్లి 2, నంద్యాలలో 1 మండలంలో వడగాల్పులు వీచాయని డా.బి.ఆర్ అంబేద్కర్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.