Weather Updates: ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలోనూ ఓ మోస్తరు వానలు కురిసే ఛాన్స్
Cyclone Jawad: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. నవంబర్ 15 నాటికి ఇది తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Weather Updates In AP: ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది దక్షిణ అండమాన్ తీరంలో శనివారం మొదలైంది. నవంబర్ 15 నాటికి ఇది తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తాజా అల్పపీడనం తుపానుగా మారనుందని, దీని ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఏపీ రాష్ట్రాలపై అధికంగా ఉంటుంది. ఈ వాయుగుండం తుపానుగా మారనుందని, దీనికి జవాద్ అని నామకరణం చేయాలని నిర్ణయించారు.
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటికి తోడు తాజా వాయుగుండం జవాద్ తుపానుగా మారనుండటంతో ఏపీ, తమిళనాడులకు మరో ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు. తమిళనాడుతో పాటు కొస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం బలపడి నవంబర్ 18 నాటికి ఏపీ తీరానికి చేరే అవకాశం ఉంది. జవాద్ ప్రభావంతో ఏపీలో మరో మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణపై సైతం తాజా అల్పపీడన ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోరూ చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
Also Read: మళ్లీ ఎగబాకిన పసిడి ధర.. రూ.200 వరకూ.. వెండి కూడా.. తాజా రేట్లు ఇలా..
తెలంగాణలో వర్షాలు..
తెలంగాణలో మరో రెండు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కానుందని పేర్కొన్నారు. రైతులు తమ ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నదాతలకు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ మహబూబ్ నగర్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
ఏపీపై జవాద్ తుపాను ప్రభావం..
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కోస్తాంధ్రతో పాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదివరకే భారీగా పంట నష్టం వాటిల్లగా మరో నాలుగైదు రోజులు ఏపీకి జవాద్ తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. విశాఖతో పాటు తీర ప్రాంతంలోని మత్స్యకారులు మరికొన్ని రోజుల వరకు చేపల వేటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంది. ఇదివరకే ఏపీ ప్రభుత్వం పలు జిల్లాల్లో సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది.
Also Read: పెట్రోల్, డీజిల్ ధరల్లో ఊరట, ఇక్కడ మాత్రం స్థిరంగా.. తాజా రేట్లు ఇలా..