By: ABP Desam | Updated at : 18 Dec 2021 06:57 AM (IST)
ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్స్ (Representational Image)
AP Weather Updates: ఈశాన్య దిశ నుంచి తీరం వెంట తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతం తీరం నుంచి వీస్తున్న గాలుల ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లపై ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఏపీలో మూడు రోజులపాటు ఎలాంటి వర్ష సూచన లేదు. రాగల మూడు రోజులపాటు ఏపీలో అన్ని ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు జరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో నిన్నటి వరకు ఓ మోస్తరు వర్షాలు కురవగా.. నేడు, మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా మారనుందని అధికారులు తెలిపారు. సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలలో నిన్న వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ నేడు వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్ష సూచన లేదు కనుక మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ అడ్డంకులు ఉండవని సమాచారం.
దక్షిణ కోస్తాంధ్రంలో వాతావరణం పొడిగా మారిపోయింది. అయితే ఒకట్రెండు చెట్ల మాత్రమే తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. బలమైన గాలులు తక్కువ ఎత్తులో వీస్తాయి. ఆదివారం, సోమవారాల్లో సైతం వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో వాతావరణం పొడిగా మారింది. నేటి నుంచి నుంచి మూడు రోజులవరకు సీమలో వర్షాలు పడే అవకాశం లేదు. ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో చలిగాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉన్నా వర్షాలు కురిసే అవకాశం లేదు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదు కానున్నాయి. నేటి నుంచి మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపారు.
Also Read: NGT: రాయలసీమ ఎత్తిపోతలకు బ్రేక్... పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టొద్దు... సీఎస్ పై కోర్టు ధిక్కార చర్యలు అవసరం లేదు
Also Read: Somasila Project: సోమశిల ఆప్రాన్ మరమ్మతు పనుల్లో మరో ముందడుగు..
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Minister Botsa Satyanarayana : రాజకీయాలు దిగజారడానికి అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తులే కారణం - మంత్రి బొత్స
Srisailam Bus Accident : శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
గంజాయి స్మగ్లర్లు, మత్తు పదార్థాలు వినియోగిస్తున్న వారికి ఏపీ పోలీసుల స్పెషల్ కౌన్సిలింగ్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!
-Rahul Gandhi In Srinagar: ప్రతిపక్షాల మధ్య విభేదాలున్నా, ఆరెస్సెస్- బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతాం: రాహుల్ గాంధీ