Weather Updates: ఏపీలో అక్కడ ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల వడగండ్ల వానలు కురిసే ఛాన్స్
Rains In Telangana: ఏపీ, తెలంగాణలో నేడు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు గత రెండు రోజులుగా కొన్ని చోట్ల చలి తీవ్రత పెరుగుతోంది.
AP Weather Updates: ఏపీ, తెలంగాణలో గత రెండు రోజులుగా కొన్ని చోట్ల చలి తీవ్రత పెరుగుతోంది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు ఏపీలో తక్కువ ఎత్తులో వీస్తున్నాయిని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాంలో నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీ, తెలంగాణలో నేడు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో జనవరి 12 నుంచి రెండు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకట్రెండు చోట్ల కురుస్తాయి.
మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఇబ్బంది లేదని వాతావరణ కేంద్రం సూచించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో కొన్నిచోట్ల చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిన ప్రాంతాల్లో చలి ప్రభావం అంతగా కనిపించడం లేదని వాతావరణ కేంద్రం తెలిపింది.
విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్పంగా కళింగపట్నంలో 15.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నందిగామలో 18 డిగ్రీలు, బాపట్లలో 18.7 డిగ్రీలు, విశాఖపట్నంలో 18.4 డిగ్రీలు మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
7day mid day forecast in telugu language dated 09.01.2022. pic.twitter.com/z0clyr0g8I
— MC Amaravati (@AmaravatiMc) January 9, 2022
దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనుడగా, మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీలోని రాయలసీమలో మరో రెండు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ సైతం ఎలాంటి వర్ష సూచన లేదు. ఆరోగ్యవరంలో కనిష్టంగా 18.5 డిగ్రీలు, కర్నూలులో 19.7 డిగ్రీలు, నంద్యాలలో 20.8 డిగ్రీలు, అనంతపురంలో 20.7 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. జయశంకర్ భూపాళపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇతర ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల వరకు ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read: Gold-Silver Price: నేడు అతి స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి మాత్రం నిలకడగా.. ఇవాల్టి ధరలు ఇలా..