(Source: ECI/ABP News/ABP Majha)
Vizianagaram: రామతీర్థం రాములోరి లోగిట్లో రాజకీయ రచ్చ... ప్రోటోకాల్ పాటించలేదని అశోక్ గజపతిరాజు ఆగ్రహం.. సర్కస్ కంపెనీ అంటారా అని మంత్రులు మండిపాటు
రామతీర్థం రాములోరి గుడి నిర్మాణం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని అశోక్ గజపతిరాజు ఆరోపించారు. ఆలయ నిర్మాణం జరుగుతుంటే సర్కస్ కంపెనీ అంటారా అని మంత్రులు మండిపడ్డారు.
విజయనగరం జిల్లా బోడికొండపై రామతీర్థం రాములోరి గుడి శంకుస్థాపన బుధవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం శంకుస్థాపన చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ కమిటీ చర్చించకుండా ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. శిలాఫలకంపై పేర్ల విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని అధికారులపై మండిపడ్డారు. ఆ శిలాఫలకాన్ని తోసివేసేందుకు ప్రయత్నించిన అశోక్ గజపతిరాజును అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అధికారులు అశోక్‌కు మధ్య స్వల్పంగా వాగ్వాదం జరిగింది. అనంతరం కోదండ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కోసం మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ అక్కడకు వచ్చారు. దేవదాయశాఖ ఆనవాయితీని వైసీపీ ప్రభుత్వం పాటించట్లేదని అశోక్‌గజపతిరాజు అన్నారు. ట్రస్టు, బోర్డులను గౌరవించే పరిస్థితి వైసీపీ సర్కారుకు లేదని విమర్శించారు.
విజయనగరం, రామతీర్థం బోడికొండ ఆలయ పున:నిర్మాణ పనుల కార్యక్రమంలో ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించకుండా... ఆలయ అనువంశిక ధర్మకర్త అయిన కేంద్ర మాజీ మంత్రి @Ashok_Gajapathi ను విస్మరించడం, కనీసం కొబ్బరికాయ కూడా కొట్టనీయకుండా ఆయనపై వైసీపీ నేతలు దాడి చేయడం దారుణం.(1/2) pic.twitter.com/JSQ5ns93LA
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) December 22, 2021
Also Read: రేపట్నుంచి సీఎం జగన్ కడప జిల్లా టూర్... ఈ నెల 25న పులివెందుల చర్చిలో క్రిస్మస్ వేడుకలకు హాజరు
సర్కస్ కంపెనీ అంటారా?
రామతీర్థం కోదండ రాముడి గుడి శంకుస్థాపన చేస్తుంటే సర్కస్ కంపెనీ అని మాట్లాడతారా అని అశోక్ గజపతిరాజుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థం ఆలయ నిర్మాణం ఇష్టం లేకే అశోక్ గజపతిరాజు గొడవ చేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో రామతీర్థం ఆలయానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. ఆలయ ధర్మకర్త ఉన్న అశోక్ గజపతిరాజును గౌరవంగా ఆహ్వానించామన్నారు. రామతీర్థం ఆలయంలో విగ్రహాల ధ్వంసంపై విచారణ జరుగుతుంటే అశోక్ గజపతిరాజు కంగారు పడుతున్నారన్నారని వెల్లంపల్లి ఆరోపించారు. రాష్ట్రంలో 25 వేల దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి వెల్లంపల్లి అన్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని రూ.70 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. రామతీర్థంలోని ఆలయం అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఆలయ ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజును ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు ఆహ్వానించారని మంత్రి తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకాన్ని ఏర్పాటు చేశామని,కానీ అశోక్ గజపతిరాజు కావాలని గొడవ చేశారని మండిపడ్డారు. శిలాఫలకాన్ని నెట్టేసి ప్రభుత్వం ఒక సర్కస్ కంపెనీ అని విమర్శలు చేశారని వెల్లంపల్లి అన్నారు.
అశోక్ గజపతిరాజుకు రామతీర్థం గుడి నిర్మాణం కావడం ఇష్టం లేదు- మంత్రి వెల్లంపల్లి pic.twitter.com/Rk2FbY5dss
— YSR Congress Party (@YSRCParty) December 22, 2021
Also Read: అగ్గిపెట్టె నుంచి అంతరిక్షం వరకు అన్నీ సీసాలోకి ఎక్కిం చేస్తాడు
అశోక్ గజపతిరాజుకు వచ్చిన నష్టమేంటి?
రామతీర్థంలో అశోక్ గజపతిరాజు అహంభావంతో వ్యవహరించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రామతీర్థాన్ని రెండో భద్రాచలంగా తీర్చిదిద్దుతుంటే అశోక్ గజపతిరాజుకు వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. ఆలయం అభివృద్ధిని పట్టించుకోకపోబట్టే ప్రభుత్వం రామతీర్థం ఆలయానికి రూ. 3 కోట్లు వెచ్చిస్తుందన్నారు. రామతీర్థం ఆలయ అభివృద్ధికి మాన్సాస్ నుంచి ఎందుకు నిధులు ఖర్చు పెట్టడంలేదన్నారు. ఇలాంటివి పునరావృతం కాకూడదని కోరుకుంటున్నామని బొత్స పేర్కొన్నారు.
Also Read: నెల్లూరులో భారీ స్కామ్, అసలు వాహనాలే లేవు.. అయినా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు, ఎలా జరిగిందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి