News
News
వీడియోలు ఆటలు
X

Minister Botsa Fires :'మాకు బాధలు లేవా, యూజ్ లెస్ ఫెలో' అంటూ వైసీపీ నేతపై మంత్రి బొత్స ఫైర్

Minister Botsa Fires : వైసీపీ నేతలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో సమస్యలు చెబుతుండగా.. మాకు లేవా బాధలు అంటూ ఫైర్ అయ్యారు.

FOLLOW US: 
Share:

Minister Botsa Fires : మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అయితే ఈసారి ప్రతిపక్ష నేతలపై కాదండోయ్.. వైసీపీ నేతలపైనే. విజయనగరం జిల్లాలో ఆసరా కార్యక్రమం ముగించుకుని వెళ్తుండగా వైసీపీ నేతలు తమ సమస్యలు చెప్పుకునేందుకు మంత్రి బొత్స కారును ఆపారు. వాళ్లు ఏదో చెప్తుండగా మంత్రి బొత్స సత్యనారాయణకు చిర్రెత్తుకొచ్చింది. శృంగవరపుకోట నియోజకవర్గ ద్వితీయ శ్రేణి వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు.  ఆసరా కార్యక్రమం ముగించుకుని వెళ్తుండగా స్థానిక వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై ఫిర్యాదు చేయడానికి వైసీపీ నాయకులు మంత్రి బొత్స కాన్వాయ్ దగ్గరకు వెళ్లిన నాయకులపై ఆయన మండిపడ్డారు.  ఫిర్యాదు చేయడానికి ఇది సమయం కాదని కావాలంటే విజయనగరం వచ్చి ఫిర్యాదు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పక్కనే ఉంటుండగా ఎమ్మెల్సీపై ఫిర్యాదు చేయడంతో బొత్స నేతలకు క్లాస్ పీకారు. మాకు లేవా బాధలు, మీకేనా... యూజ్ లెస్ ఫెలో, నువ్వు పెద్ద పోటుగాడివా అంటూ బొత్స రెచ్చిపోయారు. ఈ  తతంగాన్ని వీడియో తీస్తున్న జర్నలిస్టును కెమెరా ఆఫ్ చేయాలని ఆదేశించారు.  

  "ఉంటే ఉండు లేకపోతే పక్కకు పో.. ఏం తమాషా చేస్తున్నావా యూజ్ లెస్ ఫెలో. నువ్వా మమ్మల్ని క్వశ్చన్ చేసేది. ఏం మాట్లాడుతున్నావో బుర్రపెట్టి మాట్లాడు. నీకేంటి బాధ. మాకు బాధలు లేవా? తమాషా చేస్తున్నావు. అడిగేవాడు లేక మీకు ఇన్ డిస్ప్లేన్ పెరిగిపోయింది. నువ్వేమైనా పోటుగాడివి అనుకున్నావా, వీళ్లందరు చేతగాని వాళ్లా?"  అంటూ వైసీపీ నేతపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Published at : 08 Apr 2023 10:22 PM (IST) Tags: AP News MLC YSRCP Leaders Vizianagaram Minister Botsa fires on leaders

సంబంధిత కథనాలు

Perni Nani: ఆ విషయంలో జగన్ సక్సెస్ అయ్యారు - పొగడ్తలతో ముంచెత్తిన పేర్ని నాని

Perni Nani: ఆ విషయంలో జగన్ సక్సెస్ అయ్యారు - పొగడ్తలతో ముంచెత్తిన పేర్ని నాని

Chandrababu comments : 9 నెలల తర్వాత మళ్లీ అమరావతి నిర్మాణం పరుగులు - మంత్రులకు తనను తిట్టడమే పనన్న చంద్రబాబు !

Chandrababu comments : 9 నెలల తర్వాత మళ్లీ అమరావతి నిర్మాణం పరుగులు - మంత్రులకు తనను తిట్టడమే పనన్న చంద్రబాబు !

Kodela Sivaram : ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం - పట్టు వీడని కోడెల శివరాం !

Kodela Sivaram :  ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం - పట్టు వీడని కోడెల శివరాం !

YS Viveka case : వైఎస్ భాస్కర్ రెడ్డికి నిరాశ - బెయిల్ పిటిషన్ కొట్టేసిన సీబీఐ కోర్టు !

YS Viveka case :  వైఎస్ భాస్కర్ రెడ్డికి నిరాశ - బెయిల్ పిటిషన్ కొట్టేసిన సీబీఐ కోర్టు !

గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

టాప్ స్టోరీస్

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

Varun Tej Engagement: వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి

Varun Tej Engagement: వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి