Vizianagaram News : పరీక్ష కోసం పీకల్లోతు వరదలో, యువతి సాహసంపై నెటిజన్ల ప్రశంసలు!
Vizianagaram News : పరీక్ష కోసం ఓ విద్యార్థిని ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటే సాహసం చేసింది. యువతి సాహసంపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు.
Vizianagaram News : పరీక్ష కోసం ఓ విద్యార్థిని చేసిన సాహనంపై నెటిజన్లు శభాష్ అంటున్నారు. పరీక్షకు హాజరయ్యేందుకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటింది ఆ యువతి. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మర్రివలస సమీపంలో చంపావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో మర్రివలస, సిడగంవలస, రాయివలస, పనుకువలస, సారాడవలసతో పాటు పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మర్రివలస గ్రామానికి చెందిన విద్యార్థిని విశాఖలో పరీక్షకు హాజరయ్యేందుకు నదిని దాటించారు కుటుంబ సభ్యులు.
పరీక్ష కోసం ప్రాణాలు పణం
గజపతినగరం మండలం మర్రివలస గ్రామానికి చెందిన తాడి కళావతి అనే యువతి పరీక్ష కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి ఉద్ధృతంగా ప్రవహిస్తు్న్న నదిని దాటారు. తన ఇద్దరు సోదరుల సహాయంతో శనివారం జరగాల్సిన పరీక్షకు హాజరయ్యేందుకు యువతి చంపావతి నదిని దాటింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. ఉత్తరాంధ్రలో పరిస్థితులను ఈ వీడియో కళ్లకు కడుతోందని చాలామంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో కళావతి సోదరులు ఆమెను తమ భుజాలపై ఎత్తుకుని నదికి మరొక వైపునకు చేర్చారు. వరద ఉద్ధృతికి వారు ఒడ్డుకు చేరుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.
విద్యార్థిని సాహసం
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో ఉత్తర కోస్తాలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. కళావతి అనే విద్యార్థిని పరీక్షకు వెళ్లడానికి రవాణా మార్గాలు వరద ముంపులో ఉండడంతో నది దాటాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె పరీక్ష రాయాలంటే నదిని దాటించడమే ఏకైక మార్గమని ఆమె సోదరులు ఈ సాహసం చేశారని అంటున్నారు. ఈ సాహసంపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు.
Also Read : Suicidal Tendency : దా'రుణ' యాప్ ఆత్మహత్యలపై సైకియాట్రిస్ట్ లు ఏమంటున్నారంటే?
Also Read : Nandyal News : డబుల్ బెడ్ రూమ్ ఇల్లుగా మారిపోయిన ప్రభుత్వ పాఠశాల, స్థానిక నేత తలచుకుంటే అంతే మరి!