News
News
వీడియోలు ఆటలు
X

విజయనగరం జిల్లాకు ఒకేసారి రెండు పెద్ద ప్రాజెక్టులు- మే 3న సీఎం జగన్ శంకుస్థాపన

విజయనగరం జిల్లాకు ఒకేసారి రెండు పెద్ద ప్రాజెక్టులు రానున్నాయి. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రజల కల నెరవేరేలా తీర ప్రాంత మండలాల్లో ఒకేసారి వీటికి సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు.

FOLLOW US: 
Share:

విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి మే 3న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. మొత్తం 2,203 ఎకరాల్లో విమానాశ్ర నిర్మాణానికి భూములు సేకరించారు. అదే రోజు ముఖ్యమంత్రి మరో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పూసపాటిరేగ మండలం చింతపల్లిలో ఫ్లోటింగ్‌ జెట్టీ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. మే 3న జెట్టీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ప్రకటించారు.  జెట్టీ నిర్మాణంలో భాగంగా మిగిలిన సదుపాయాలు కల్పించేందుకు సుమారు 6 ఎకరాలు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో 19 మత్స్యకార గ్రామాలున్నాయి. ఈ గ్రామాలకు చెందిన సుమారు 10వేల కుటుంబాలు సముద్రంలోని వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. వేటాడిన చేపలను భద్రపర్చేందుకు కోల్డ్‌ స్టోరేజీలంటూ ప్రత్యేకంగా ఇక్కడ లేవు. ప్రభుత్వం తరపున మార్కెట్‌ సదుపాయం కూడా లేదు. దీంతో.. ఎంతో కష్టపడి వేటాడిన చేపలను దళారులకు కారుచౌకగా కట్టబెట్టాల్సి వస్తోంది. దీనికితోడు చేపల వేట అనంతరం ఒడ్డుకు చేర్చిన బోట్లు నిలుపుకోవడానికి సరైన సదుపాయం లేదు. జెట్టీ లేకపోవడంతో సముద్రంలోనే లంగరు వేయాల్సిన పరిస్ధితి నెలకొంటోంది. తుపాను సమయాల్లో అలల తాకిడికి బోట్లు గల్లంతవతున్నాయి. దీంతో, మత్స్యకారులు రూ.లక్షలు నష్టపోవాల్సి వస్తోంది. సుదీర్ఘకాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 

వలస పోతున్న మత్స్యకారులు

జిల్లాలోని తీర ప్రాంతంలో సరైన ఉపాధి మార్గాలు లేకపోవడం.. కష్టనష్టాలు భరించలేక స్థానిక మత్స్యకారులు గుజరాత్‌లోని హీరావి, ఒడిశాలోని పారాదీప్‌, కేరళ కొచ్చిన్‌ తదతర ప్రాంతాలకు వలసపోతూ కూలీలుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా జెట్టీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ చాలా ఏళ్లుగా ఉంది. గతంలో తెదేపా ప్రభుత్వమే దీన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ, అడుగు ముందుకు పడలేదు. ఎట్టకేలకు వైకాపా ప్రభుత్వం స్పందించింది. రూ.25కోట్లతో ఫ్లోటింగ్‌ జెట్టీ నిర్మాణానికి ముందుకొచ్చింది. ఇది నిరంతరం సముద్రపు ఆటుపోట్లు వచ్చే ప్రాతంలో కాకుండా నీరు స్థిరంగా ఉండే ప్రాంతంలోనే ఏర్పాటుకు అనువుగా ఉంటుంది. వేటాడిన మత్స్య సంపదను బోటుల నుంచి ఒడ్డుకు చేర్చడానికి, బోటులు లంగరు వేయడానికి మాత్రమే తోడ్పడుతుందని సమాచారం. ఇది పూర్తయితే మత్య్సకారుల సమస్య పరిష్కారం కావడంతోపాటు.. వారు ఆర్థికంగా అభివృద్ధి చెంది, జీవనం మెరుగుపడే అవకాశాలున్నాయి. 

ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

మే నెల 3 వ తేదీన భోగాపురం విమానాశ్రయం, చింతపల్లి వద్ద ఫ్లోటింగ్‌ జట్టీ శంకుస్థాపనలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రానున్నట్లు జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఆ మేరకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. శంకు స్థాపనకు అవసరమయ్యే శిలాఫలకం,  వాహనాల పార్కింగ్‌ కు అనువైన స్థలాన్ని గుర్తించి ఏర్పాట్లు చేయాలన్నారు. శంకుస్థాపన జరిగే నాటికి ఆర్‌అండ్‌ఆర్‌ లో ఎలాంటి పెండింగ్‌ లేకుండా చూడాలని సూచించారు.  అందరికీ గృహాలు, అన్ని సౌకర్యాలతో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. జూన్‌ నెలలో సాలూరులో  గిరిజన విశ్వ విద్యాలయానికి కూడా శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.

Published at : 20 Apr 2023 07:26 PM (IST) Tags: AP News CM Jagan Bhogapuram Airport jetty minister botsa satyanarayana

సంబంధిత కథనాలు

ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ఏపీ మంత్రుల సమావేశం, కీలక అంశాలపై చర్చ

ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ఏపీ మంత్రుల సమావేశం, కీలక అంశాలపై చర్చ

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ -  వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Odisha Train Accident: "క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తాం, అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేస్తాం"

Odisha Train Accident:

Coromandel Train Accident: రైలు ప్రమాద స్థలం నుంచి ఏపీకి ప్రత్యేక రైలు, రాత్రి విజయవాడకు 50-60 మంది!

Coromandel Train Accident: రైలు ప్రమాద స్థలం నుంచి ఏపీకి ప్రత్యేక రైలు, రాత్రి విజయవాడకు 50-60 మంది!

Chandrababu : పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే దూరమైనట్లే - సీనియర్ నేతలకు చంద్రబాబు హెచ్చరికలు !

Chandrababu :  పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే దూరమైనట్లే - సీనియర్ నేతలకు చంద్రబాబు హెచ్చరికలు !

టాప్ స్టోరీస్

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?