అన్వేషించండి

Vizag to Tirupati Trains: విశాఖ నుండి తిరుపతి, చర్లపల్లి కి స్పెషల్ ట్రైన్స్.. డేట్స్ ఎప్పుడంటే

vizag to charlapalli special trains | విశాఖ నుండి తిరుపతి, చర్లపల్లి కి స్పెషల్ ట్రైన్స్ నడపాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. 2 నెలలపాటు ప్రత్యేక రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడపనుంది.

vizag to Tirupati special trains | విశాఖపట్నం: ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో  వస్తున్న వరుస పండుగలను దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం నుండి తిరుపతి, చర్లపల్లి  రూట్ లలో ప్రత్యేక రైళ్ళను నడుపుతోంది రైల్వే శాఖ. ఆ మేరకు  ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈ ప్రత్యేక రైళ్ల డీటెయిల్స్  ప్రకటించింది.

1) విశాఖపట్నం - తిరుపతి ట్రైన్

 ట్రైన్ నెంబర్ 08547 విశాఖపట్నం తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ 06.08.2025 నుండి 24.09.2025 వరకూ నడవబోతోంది. ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు విశాఖపట్నంలో  బయలుదేరే ఈ ట్రైన్  గురువారం ఉదయం 9:15 కి తిరుపతి చేరుకుంటుంది.  అలాగే తిరుగు ప్రయాణంలో  ప్రతి గురువారం రాత్రి 09:50 కి తిరుపతిలో బయలుదేరే ప్రత్యేక రైల్ (08548) శుక్రవారం ఉదయం 11:30 కు వైజాగ్ రీచ్ అవుతుంది.

స్థాప్స్ : 

వైజాగ్ -తిరుపతి మధ్య ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్ లలో ఆగుతుంది.


కోచ్ పొజిషన్స్ : 

 రెండు సెకండ్ ఏసి, మూడు 3AC, మూడు  3AC ఎకానమీ, ఎనిమిది స్లీపర్ క్లాస్, 4 జనరల్ కోచ్ లు, ఒక లగేజి కమ్ దివ్యాంగుల కోచ్ ఉంటాయి


2) వైజాగ్-చర్లపల్లి ట్రైన్
 ట్రైన్ నెంబర్ 08579 విశాఖపట్నం చర్లపల్లి వీక్లీ ఎక్స్ప్రెస్ 08.08.2025 నుండి 26.09.2025 వరకూ నడవబోతోంది. ప్రతి శుక్రవారం  సాయంత్రం  5:30 గంటలకు  విశాఖపట్నంలో  బయలుదేరే ఈ ట్రైన్  శనివారం ఉదయం 8గంటలకు కి చర్లపల్లి చేరుకుంటుంది.  అలాగే తిరుగు ప్రయాణంలో  ప్రతి శనివారం మధ్యాహ్నం 03:30 కి చర్లపల్లి లో లో బయలుదేరే ప్రత్యేక రైల్ (08580) ఆదివారం ఉదయం 7:00 గంటలకు వైజాగ్ రీచ్ అవుతుంది.

స్థాప్స్ : 

వైజాగ్ -చర్లపల్లి మధ్య ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్,ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, కృష్ణా కెనాల్, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి స్టేషన్ లలో ఆగుతుంది.


కోచ్ పొజిషన్స్ :  రెండు సెకండ్ ఏసి, మూడు 3AC, రెండు 3AC ఎకానమీ, ఎనిమిది స్లీపర్ క్లాస్, 4 జనరల్ కోచ్ లు, ఒక లగేజి కమ్ దివ్యాంగుల కోచ్ ఉంటాయి

నిజానికి ఈ రైళ్లు  ప్రస్తుతం నడుస్తూనే ఉన్నా పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో రెండు నెలలపాటు పొడిగించినట్లు  వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ K. సందీప్ తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Chintada RaviKumar: మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget