Cricketer Eshwar: క్రికెట్ వీరాభిమాని గుండె పోటుతో మృతి, అంతర్జాతీయ స్టార్ క్రికెటర్స్‌కి బౌలింగ్ కూడా
Cricketer Eshwar: అంతర్జాతీయ స్టార్ క్రికెటర్ల అభిమాని, విశాఖ పట్నానికి చెందిన ఈశ్వర్ గుండెపోటుతో మృతి చెందారు.
Cricketer Eshwar: అంతర్జాతీయ స్టార్ క్రికెటర్ల అభిమాని, విశాఖ పట్నానికి చెందిన ఈశ్వర్ గుండెపోటుతో మృతి చెందారు. గాజువాక ప్రాంతానికి చెందిన ఈశ్వర్ కొద్ది కాలంగా ఐపీఎల్‌లో పనిచేస్తున్నారు. ఐపీఎల్ జట్ల క్రికెటర్లకు బౌలింగ్ ప్రాక్టీస్ సమయంలో ఈశ్వర్ బౌలింగ్ చేసేవాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు "సైడ్ ఆర్మ్ త్రో" బౌలర్‌గా సేవలు అందిస్తున్నారు. గురువారం గుండె పోటుతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న భారత వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ విశాఖలోని ఈశ్వర్ ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు. ఈశ్వర్ మృతిపై పలువురు స్టార్ స్టార్ క్రికెటర్లు సంతాపం తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ పాంటింగ్, ఢిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, పలువురు క్రికెటర్లు ఈశ్వర్ మృతికి సంతాపం తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్ యాజమాన్యం తన సానుభూతి ప్రకటించింది.
క్రికెట్ అంటే ప్రాణంగా భావించే ఈశ్వర్ క్రికెటర్‌గా రాణించాలని అనుకున్నారు. అయితే పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీ క్యాపిటల్స్ టీం "సైడ్ ఆర్మ్ త్రో" బౌలర్‌గా సేవలు అందిస్తున్నారు. భారత మాజీ ఆటగాడు వేణుగోపాలరావు ప్రోత్సాహంతో ఈశ్వర్‌కు స్టార్ క్రికెటర్లతో మంచి అనుబంధం ఏర్పడింది. గురువారం ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. ఈశ్వర్ గాజువాకకు చెందిన పేదకుటుంబంలో నుంచి వచ్చాడు. ఇప్పటికీ కూడా ఈశ్వర్ కుటుంబం ఆర్థికంగా వెనుకబడినట్లుగా తెలుస్తోంది. ఈశ్వర్ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.