News
News
X

Viveka Case : ఇతరుల పేర్లు చెప్పాలని సీబీఐ బెదిరిస్తోంది.. పులివెందుల కోర్టులో వివేకా పీఏ పిటిషన్ !

సీబీఐ అధికారులు బెదిరిస్తున్నారని పులివెందుల కోర్టులో వివేకా పీఏ పిటిషన్ దాఖలు చేశారు. కేసులో సంబంధం లేని వారి పేర్లను చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.

FOLLOW US: 
Share:

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. విచారణ జరుపుతున్న సీబీఐ అధికారుల మీద ఆరోపణలు చేస్తూ పలువురు తెర ముందుకు వస్తున్నారు. తాజాగా వివేకానందరెడ్డి వద్ద సుదీర్ఘ కాలంగా పీఏగా పని చేసిన కృష్ణారెడ్డి సీబీఐ అధికారులపై ఆరోపణలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. కొంత మంది పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు తనను ఒత్తిడి చేస్తున్నారని కృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. కృష్ణారెడ్డి తరపు న్యాయవాది ఈ మేరకు పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని అందుకే కోర్టును ఆశ్రయించానని కృష్ణా రెడ్డి చెబుతున్నారు. 

Also Read: వివేకా కుమార్తె, అల్లుడి నుంచి ప్రాణహానీ... కడప ఎస్పీకి ఫిర్యాదు చేసిన వివేకా పీఏ కృష్ణారెడ్డి !

కొద్ది రోజుల కిందట కృష్ణారెడ్డి కడప ఎస్పీ అన్బురాజన్‌ను కలిశారు. వివేకా  హత్య కేసులో  కొంత మంది తనను బెదిరిస్తున్నారని.. తన ప్రాణానికి  హాని ఉందని ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు కొంత మంది ఇతరుల పేర్లు చెప్పాలని బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదుపై ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. 

Also Read: వివేకా హత్య కేసులో కీలక మలుపు .. హైకోర్టులో ఎర్ర గంగిరెడ్డి క్వాష్ పిటిషన్ !

గతంలో అనంతపురం ఎస్పీని గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి కూడా కలిసి.., ఇదే తరహా ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు వేధిస్తున్నారని.. వైఎస్ అవినాష్ రెడ్డితోపాటు దేవిరెడ్డి శంకర్ రెడ్డి వంటి పేర్లు చెప్పాలని .. డబ్బులు కూడా ఆశ చూపారని ఆయన ఫిర్యాదు చేశారు. గంగాధర్ రెడ్డి కూడా ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పడంతో ఆయనకూ  పోలీసుల భద్రత కల్పించారు. ఇలా వరుసగా సీబీఐ అధికారుల మీద ఆరోపణలు చేస్తూ కొంత మందికి తెరపైకి రావడం కేసులో కీలక మలుపులకు కారణం అవుతోంది. 

Also Read: వివేకా కుమార్తె, అల్లుడితో పాటు సీబీఐపైనా ఆరోపణలు ! హత్య కేసులో సంచలన మలుపులు ఖాయమేనా ?

సీబీఐ ఇటీవలే దేవిరెడ్డి శంకర్ రెడ్డికి నార్కో  పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలనికోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై తీర్పు రావాల్సి ఉంది. మరో వైపు దస్తగిరి అప్రూవర్‌గా మారడం చట్ట విరుద్దమని కొంత మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇటీవల కాస్త జోరు తగ్గినట్లుగా ఉన్న సీబీఐ విచారణ ... మళ్లీ ఊపందుకుంటున్న సమయంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. 

Also Read: అవినాష్ రెడ్డిని ఇరికించడానికి సీబీఐ కుట్ర.. రూ. 10 కోట్లు ఆఫర్ చేశారని అనంతపురం ఎస్పీకి వ్యక్తి ఫిర్యాదు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 28 Dec 2021 01:54 PM (IST) Tags: viveka murder case Kadapa charges against CBI Viveka PA Krishnareddy Vivekananda Reddy murder Viveka CBI probe

సంబంధిత కథనాలు

APFSL Recruitment: ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌‌లో ఉద్యోగాలు, డిగ్రీ అర్హత చాలు - పూర్తి వివరాలు ఇలా!

APFSL Recruitment: ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌‌లో ఉద్యోగాలు, డిగ్రీ అర్హత చాలు - పూర్తి వివరాలు ఇలా!

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

Breaking News Live Telugu Updates: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు

Breaking News Live Telugu Updates: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు

APBJP On Special Status : ప్రత్యేకహోదాపై ప్రజల్ని మోసం చేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - వచ్చే ఎన్నికల కోసం మేనిఫెస్టోలో పెట్టగలరా అని బీజేపీ సవాల్ !

APBJP On Special Status :  ప్రత్యేకహోదాపై ప్రజల్ని మోసం చేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - వచ్చే ఎన్నికల కోసం మేనిఫెస్టోలో పెట్టగలరా అని బీజేపీ సవాల్ !

CM Jagan Work Shop: ఎమ్మెల్యేలతో త్వరలో సీఎం జగన్ వర్క్‌షాప్! అజెండా ఇదే!

CM Jagan Work Shop: ఎమ్మెల్యేలతో త్వరలో సీఎం జగన్ వర్క్‌షాప్! అజెండా ఇదే!

టాప్ స్టోరీస్

Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం

Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం

Balakrishna Phone : బాలకృష్ణ ఏ ఫోన్ వాడుతున్నారో చూశారా? పాకెట్‌లో ఎలా స్టైలుగా పెట్టారో?

Balakrishna Phone : బాలకృష్ణ ఏ ఫోన్ వాడుతున్నారో చూశారా? పాకెట్‌లో ఎలా స్టైలుగా పెట్టారో?

Kalyan Ram On Taraka Ratna Health : ఎందుకీ మౌనం - తారక రత్న హెల్త్ అప్డేట్ మీద కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?

Kalyan Ram On Taraka Ratna Health : ఎందుకీ మౌనం - తారక రత్న హెల్త్ అప్డేట్ మీద కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?

Tegimpu Movie OTT: ఓటీటీలోకి అజీత్ ‘తెగింపు‘ - స్ట్రీమింగ్ మొదలైంది, ఎక్కడో తెలుసా?

Tegimpu Movie OTT: ఓటీటీలోకి అజీత్ ‘తెగింపు‘ - స్ట్రీమింగ్ మొదలైంది, ఎక్కడో తెలుసా?