అన్వేషించండి

Viveka Murder Case: వివేకా హత్యకేసులో సీబీఐ దూకుడు - వివేకా పీఏ సహా మరొకరిని విచారిస్తున్న అధికారులు

Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే వివేహా పీఏ సహా పనిమనిషి కుమారుడిని ప్రశ్నిస్తున్నారు. 

Viveka Murder Case: ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే వివేక హత్య సమయంలో రాసిన లేఖపై విచారణ చేపట్టారు. అలాగే వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కుమారుడు ప్రకాష్ ను విచారించారు. ఇద్దరినీ కలిసి సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా ఇంట్లో వంట మనిషిగా పని చేస్తున్న లక్ష్మీదేవి కుమారుడే ప్రకాష్. తాజాగా ఇతడిని సీబీఐ విచారిస్తోంది. నిన్న పీఏ కృష్ణారెడ్డిని విచారించిన సీబీఐ అధికారులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. నేడు మరోసారి కృష్ణారెడ్డి, వంటమనిషి కుమారుడు ప్రకాష్ ను విచారిస్తున్నారు.

మంగళవారం కూడా వివేకా పర్సనల్ అసిస్టెంట్ కృష్ణా రెడ్డిని ప్రశ్నించారు. హత్యకు ముందు వివేకా రాసిన లేఖను కృష్ణా రెడ్డి దాచిపెట్టిన విషయం తెలిసిందే. అధికారులు ఆ విషయంపైనే ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. పగలు 3 గంటలకు కోఠిలోని సీబీఐ ఆఫీస్ కు వచ్చిన పీఏ కృష్ణారెడ్డిని 5 గంటలకు పైగా ప్రశ్నించారు. హత్య జరిగిన ప్రాంతంలో లభించిన కీలక ఆధారమైన ఆ లెటర్ ను ఎందుకు దాయాల్సి వచ్చిందో, అలా దాయమని ఎవరు చెప్పారో చెప్పాలంటూ కృష్ణారెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. ఆ లెటర్ ను మొదట ఎవరు గుర్తించారు, ఆ లెటర్ గురించి మీకెలా తెలిసింది, తర్వాత దాన్ని ఎక్కడ దాచి పెట్టారు, మీ వద్ద లెటర్ ఉన్నట్లు ఇంకా ఎవరితో అయినా చెప్పారా, లెటర్ ను పోలీసులకు ఎన్ని గంటల తర్వాత అప్పగించారు, అప్పటి వరకు లెటర్ ను దాయాల్సిన అవసరం ఏంటి అంటూ అనేక ప్రశ్నలను సీబీఐ అధికారులు సంధించినట్లు తెలుస్తోంది.

గతంలో సంచలన కామెంట్స్ చేసిన కృష్ణారెడ్డి

కృష్ణారెడ్డి గతంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. వివేకానందరెడ్డి చనిపోయారని సునీత, రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేస్తే... ఏం జరిగింది ఎలా జరిగిందో అని ఆరా తీయకుండా ఓకే అని ఫోన్ పెట్టేశారన్నారు.  ఆ రోజు ఉదయం ఐదున్నరకు వివేకా ఇంటికి వెళ్లానని అన్నారు. అక్కడే ఉన్న ముందు గేట్‌ ఓపెన్ అయి ఉందని... అది గమనించి లోపలికి వెళ్లానని అన్నారు. అప్పటికీ వివేకా లేవలేదని తెలిపారు. పడుకున్నారేమో అని మళ్లీ నేను బయటకు వచ్చేశానని... ఆయన భార్య సౌభాగ్యకు ఫోన్ చేశానని తెలిపారు. నైట్‌ లేట్‌గా వచ్చారని ఇంకా కాసేపు పడుకోనిలే అన్నారని వివరించారు. ఇంతలో వంట మనిషి వచ్చినట్టు చెప్పారు.

మరోవైపు వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిల స్టేట్ మెంట్ ను నోటీసులు అందజేసింది. వైఎస్ వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనయ్ తుల్లా, ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్ రెడ్డిలను సీబీఐ మరోసారి ప్రశ్నించింది. వివేకా హత్యకు ప్రత్యక్ష సాక్షిగా ఇనయ్ తుల్లా అనే వ్యక్తి ఉన్నాడు. అలాగే వివేకా మృతదేహాన్ని బాత్ రూమ్ నుంచి బయటకు కూడా తీసుకు వచ్చింది ఇనయ్ తుల్లానే. గతంలో కూడా ఇతడిని సీబీఐ విచారించింది. మరోసారి సీబీఐ కార్యాలయంలో ఇనయ్ తుల్లాను విచారించి.. స్టేట్ మెంట్ రికార్డు చేసింది. అలాగే ఇనయ్ తుల్లా ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్ రెడ్డిల స్టేట్ మెంట్ ను సైతం సీబీఐ రికార్డు చేసింది.

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
Breaking News:ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 
ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Adilabad Airport Update: ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Embed widget