News
News
X

పాదయాత్రగా వస్తున్న వారికి నిరసన తెలపండి- ఉత్తరాంధ్ర ప్రజలకు వైసీపీ నేతల పిలుపు

విశాఖను పాలనా రాజధానిగా చేసి తీరుతామంటున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి. విద్వైషాలు సృష్టించేందుకే దండయాత్ర చేస్తున్నారని ఆరోపించారు.

FOLLOW US: 

న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే విశాఖను పరిపాలన రాజధానిగా చేసి తీరుతామని ఉమ్మడి విశాఖ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. అనకాపల్లి జిల్లా వైసీపీ కార్యకర్తల సమావేశం మంగళవారం అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వైవి సుబ్బా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా సచివాలయాలు ఏర్పాటు, జిల్లాల విభజన వంటి అనేక చారిత్రక నిర్ణయాలు జగన్మోహనరెడ్డి తీసుకున్నారని ఆయన చెప్పారు.

సీఎం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం కారణంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని  వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మూడు రాజధానులపై వాస్తవాలను అవాస్తవాలుగా చూపించేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబునాయుడు చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. ఈ ప్రాంతo అభివృద్ధికి చెందకుండా చంద్రబాబునాయుడు చేస్తున్న కుట్రలను ప్రజల అందరికీ తెలియజేసే బాధ్యత కార్యకర్తలపై ఉందని సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంపైకి దండయాత్రగా వస్తున్న  వారికి శాంతియుతంగా నిరసన తెలియ చేయాలని ఆయన కోరారు. అభివృద్ధి కాంక్షించే ఈ ప్రాంత ప్రజలు చంద్రబాబునాయుడు చేస్తున్న కుట్రలను సహించబోమని ఆయన అన్నారు. 

దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు కాని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి ప్రజలకు అందజేస్తూ ఉంటే, వాటిని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని సుబ్బారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 98.5 శాతం అమలు చేశామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు అధికారం ఇస్తే సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తారని ఆయన అన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇచ్చిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీని గెలిపించాలని ఆయన కోరారు. త్వరలోనే తాను కూడా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటానని సుబ్బారెడ్డి తెలియజేశారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్‌ను ఎంపిక చేశామని ఆయన్ని గెలిపించే బాధ్యతను కార్యకర్తలు, నాయకులు తీసుకోవాలని సుబ్బారెడ్డి కోరారు.

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ విశాఖ పరిపాలన రాజధానిగా అయితేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ ప్రాంతానికి మేలు జరగకూడదన్న దురుద్దేశంతో చంద్రబాబు దండయాత్ర సాగిస్తున్నారని, ఈ ప్రాంతంపై మమకారం ఉన్నవారు, విజ్ఞులు దీన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పాదయాత్ర పేరుతో ఈ ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొడతారన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వలేదని ఆయన చెప్పారు. యాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా దానికి చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. అమరావతితోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్‌ కట్టుబడి ఉన్నారని అమర్నాథ్ తెలియజేశారు. పాదయాత్ర పేరుతో చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుధాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. 

Published at : 13 Sep 2022 06:01 PM (IST) Tags: ANDHRA PRADESH 3 capitals Visakhapatnam News Amaravati Farmers Vizag News

సంబంధిత కథనాలు

Satya Kumar: వైసీపీ ఓ పేర్ల పిచ్చి పార్టీ, దోచుకున్నది చాలు దోపిడీ ఆపండి: సత్యకుమార్

Satya Kumar: వైసీపీ ఓ పేర్ల పిచ్చి పార్టీ, దోచుకున్నది చాలు దోపిడీ ఆపండి: సత్యకుమార్

Botsa Satyanarayana: 3 రాజధానులు చేస్తే తప్పేంటి? అదే జరిగితే నేను మంత్రిగా అనర్హుడ్ని - బొత్స

Botsa Satyanarayana: 3 రాజధానులు చేస్తే తప్పేంటి? అదే జరిగితే నేను మంత్రిగా అనర్హుడ్ని - బొత్స

Artist Laxmi: భర్తకు చెప్పకుండా వెళ్లిపోయిన ఆర్టిస్ట్, పోలీసులు టెన్షన్ టెన్షన్ - చివరికి ఏమైందంటే

Artist Laxmi: భర్తకు చెప్పకుండా వెళ్లిపోయిన ఆర్టిస్ట్, పోలీసులు టెన్షన్ టెన్షన్ -  చివరికి ఏమైందంటే

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Visakha News : విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద ఉద్రిక్తత, సముద్రంలో షిప్ లను అడ్డుకుంటున్న మత్స్యకారులు

Visakha News : విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద ఉద్రిక్తత, సముద్రంలో షిప్ లను అడ్డుకుంటున్న మత్స్యకారులు

టాప్ స్టోరీస్

MS Dhoni: ధోనీ ఫేస్ బుక్ పోస్టుపై స్పష్టత, ఈసారి ప్రపంచకప్ మనదే అంటున్న మహీ

MS Dhoni:  ధోనీ ఫేస్ బుక్ పోస్టుపై స్పష్టత, ఈసారి ప్రపంచకప్ మనదే అంటున్న మహీ

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం

DJ Tillu 2: మొన్న డైరెక్టర్, ఇప్పుడు హీరోయిన్లు - 'డీజే టిల్లు'సీక్వెల్‌ను లైట్ తీసుకుంటున్నారా?

DJ Tillu 2: మొన్న డైరెక్టర్, ఇప్పుడు హీరోయిన్లు - 'డీజే టిల్లు'సీక్వెల్‌ను లైట్ తీసుకుంటున్నారా?