![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
YS Jagan: పద్మవ్యూహంలో అభిమన్యుడు కాదు అర్జునుడ్ని! దుష్ట చతుష్టయం ఓటమితథ్యం: భీమిలి సభలో జగన్
YS Jagan starts Election campaign: తన వెంట ఉన్నది పాండవ సైన్యం కాగా, అటువైపు కౌరవ సైన్యం ఉందని.. వచ్చే ఎన్నికల యుద్ధంలో పద్మ వ్యూహం పొంచి ఉందన్నారు సీఎం జగన్.
![YS Jagan: పద్మవ్యూహంలో అభిమన్యుడు కాదు అర్జునుడ్ని! దుష్ట చతుష్టయం ఓటమితథ్యం: భీమిలి సభలో జగన్ YS Jagan starts Election campaign from Bheemili Siddham Meeting YS Jagan: పద్మవ్యూహంలో అభిమన్యుడు కాదు అర్జునుడ్ని! దుష్ట చతుష్టయం ఓటమితథ్యం: భీమిలి సభలో జగన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/a366a3eba50f4157d539f3cec4d6eb6c1706353310861233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bheemili Meeting: విశాఖపట్నంలోని భీమిలి వేదికగా ఏపీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) 2024 ఎన్నికల శంఖారావం పూరించారు. వైనాట్ 175 నినాదంతో గత ఏడాది నుంచి పలు కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ ఈ సభతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. సిద్ధం పేరుతో భీమిలి నియోజకవర్గంలోని సంగివలస వద్ద నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. తన వెంట ఉన్నది పాండవ సైన్యం కాగా, అటువైపు కౌరవ సైన్యం ఉందని.. వచ్చే ఎన్నికల యుద్ధంలో పద్మ వ్యూహం పొంచి ఉందన్నారు సీఎం జగన్. ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు అన్నారు. ఈ అర్జునుడికి కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నందుకు ఎన్నికల యుద్ధంలో దుష్టచతుష్టయం చంద్రబాబు సహా అందరి ఓటమి తథ్యమన్నారు జగన్.
ఈసారి 23 సీట్లు కూడా రావంటూ సెటైర్లు..
వైసీపీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేర్చాం.. ఇప్పటివరకు 99 శాతం హామీలు నెరవేర్చామని అన్ని స్థానాల్లో తమదే విజయమన్నారు. మనం చేసే మంచి పనులే వైసీపీని గెలిపిస్తాయని చెప్పారు. ఎంతో రాజకీయ అనుభం ఉన్న చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు.. అందుకే వేరే పార్టీల వెంట పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడని సీఎం వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ఎంతో రాజకీయ అనుభం ఉన్న చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు.. అందుకే వేరే పార్టీల వెంట పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడని సీఎం వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడి వెంట తిరుగుతున్నా.. గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావన్నారు.
మరో 25 ఏళ్లపాటు జైత్రయాత్రకు శ్రీకారం చుడుతున్నాం. పేదరికాన్ని, అసమానతలను పోగొట్టిన బాధ్యతల ప్రభుత్వం వైసీపీదేనన్నారు. మరో 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది కనుక ప్రజలు ఆలోచించాలన్నారు సీఎం జగన్. ఈ యుద్ధం అబద్ధానికి, నిజానికి మధ్య.. మోసానికి, నిజాయితీకి మధ్య జరుగుతుందన్నారు. చంద్రబాబు ఇచ్చిన 650 హామీల్లో కనీసం 10 శాతం కూడా నెరవేర్చలేదని సీఎం జగన్ ఆరోపించారు. వైసీపీ సర్కార్ దాదాపు అన్ని హామీలను నెరవేర్చిందన్నారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ చంద్రబాబు చేసేందేమీ లేదని.. టీడీపీ ఏం చేసిందో చెప్పడానికి ఏమీ కనిపించదన్నారు. 56 నెలల కాలంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం.. అందరూ ఇది గమనించాలన్నారు.
‘ఎక్కడా వివక్ష లేకుండా ఒకటో తేదీన ఉదయాన్నే పెన్షన్ అయినా, పౌర సేవలైనా, ఏ పథకమైనా గడపకు అందించిన ప్రభుత్వం మాది. అందుకోసం గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి సక్సెస్ అయ్యామని చెప్పండి. రైతలన్నల కోసం ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు చేశాం. విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటినీ జల్లెడపట్టి ఆరోగ్య సురక్ష అందించాం. ప్రభుత్వ బడిని నాడు నేడుతో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంతో పాటు ట్యాబ్స్ ఇచ్చాం. మహిళా పోలీస్ ను, దిశా యాప్ ను ఒక్క బటన్ నొక్కితే అక్కాచెల్లెమ్మల రక్షణ కోసం పోలీసులు చేరుకుని, ఏం జరిగిందని వాకబు చేసే వ్యవస్థను తీసుకొచ్చాం. డిజిటల్ లైబ్రరీలు, ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ లు ఏర్పాటు చేసి మార్పులు తీసుకొచ్చాం. ఈ మార్పులు ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు కనిపిస్తాయని’ ఏపీ సీఎం జగన్ అన్నారు. అవినీతి లేకుండా, వివక్షకు తావు లేకుండా ప్రభుత్వ పథకాలను అమలు చేసిన ఘనత తమదేనన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)