అన్వేషించండి

వందే భారత్‌ రైలు ఎందుకు రద్దు చేశారు- రేపటి నుంచి సర్వీస్‌లు నడుస్తాయా- క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు వస్తాయా?

వందేభారత్‌ ప్రయాణీకులు టికెట్‌ క్యాన్సిల్ చేసుకుంటే, పూర్తి రీఫండ్ చేస్తామంటున్నారు రైల్వే అధికారులు. ప్రత్యేక రైలులో ప్రయాణిస్తే ఛార్జీల వ్యత్యాసం కూడా ఇస్తున్నట్టు తెలిపారు.

వందే భారత్ రేక్ స్థానంలో నేటికి సంప్రదాయ కోచ్‌లు అందుబాటులోకి తెస్తున్నట్లు రైల్వే అదికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. సాంకేతిక లోపం కారణంగా రైలు నెంబర్ 20833/34 (విశాఖపట్టణం -సికింద్రాబాద్ - విశాఖపట్టణం) స్థానంలో వందే భారత్ రైలు స్థానంలో సంప్రదాయ బోగీలు అమర్చారు. సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే, వందే భారత్ రైలులో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులందరికీ వసతి కల్పించడానికి కొత్త రైలు ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. 

విశాఖపట్టణం నుంచి 05:45 గంటలకు బయల్దేరాల్సిన రైలు 07:05 గంటలకు బయలుదేరిందని అన్నారు. వందే భారత్ రైలు సర్వీసులతో సమానంగా ప్రయాణికులందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. రైలు రద్దవడంతో ప్రయాణికులందరికీ ఆటోమేటిక్ రీఫండ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రత్యేక రైలులో టికెట్లు జారీ చేశామని పేర్కొన్నారు. ఫెసిలిటేషన్ కౌంటర్ ఏర్పాటు చేశామని, అన్ని స్టేషన్లలో క్రమం తప్పకుండా ప్రకటనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎక్స్ విఎస్ కెపి రైలు వెంట ఒక అధికారితో పాటు 9 మంది టిటిఇలు ఉన్నారని, ఐఆర్సీటీసీకి చెందిన 34 మంది కేటరింగ్ స్టాఫ్, ఇద్దరు సూపర్వైజర్లు రైలులో ఉన్నారని పేర్కొన్నారు. 

రిటర్న్ జర్నీలో కూడా...
ట్రైన్ నెంబర్ 20834 (సికింద్రాబాద్ - విశాఖపటట్ణం) సాంకేతిక లోపం కారణంగా రైలు నెంబర్ 20834, (ఎస్సీ - వీఎస్కేపీ) వందే భారత్ స్థానంలో సంప్రదాయ కోచ్ రైలును పెట్టారు. రైలులో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు తమ ప్రయాణ అవసరాలను తీర్చుకునేలా రైల్వే శాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. రైలులో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఈ మేరకు వారి సెల్ ఫోన్‌ నెంబర్లకు మెసేజ్‌లు పంపుతున్నామని ప్రతి స్టేషన్‌కు ముందే ప్రయాణీకులను అలర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణీకులు తమ టికెట్లను రద్దు చేసుకోవచ్చని, లేదంటే ప్రత్యేక కన్వెన్షన్ రేక్ ద్వారా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు.  

ప్రయాణీకులు తమ టికెట్‌ను రద్దు చేసుకుంటే, వారికి పూర్తి రీఫండ్ చేస్తామంటున్నారు రైల్వే అధికారులు. ప్రత్యేక రైలులో ప్రయాణిస్తే, ప్రయాణీకులకు ఛార్జీల వ్యత్యాసం కూడా ఇస్తున్నట్టు తెలిపారు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరుతుంది. వందే భారత్ రైలు సర్వీసులతో సమానంగా ప్రయాణికులందరికీ క్యాటరింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని స్టేషన్లలో క్రమం తప్పకుండా ప్రకటనలు చేస్తున్నామని,  ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి తగినంత టికెట్ చెకింగ్ స్టాఫ్, సెక్యూరిటీ, క్యాటరింగ్ సిబ్బందిని నియమించామని రైల్వే శాఖ వెల్లడించింది.

రేపటి నుంచి యథావిధిగా...
సాంకేతిక లోపం కారణంగా గురువారం మాత్రమే వందేబారత్ రైలులో మార్పులు చేశామని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో ప్రయాణీకులకు జరిగిన అసౌకర్యానికి చింతుస్తున్నామని, రాబోయే రోజుల్లో యథావిధిగా రైలు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మరమ్మత్తుల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పలువురు అధికారులు చెబుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
Embed widget