![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: Poll of Polls)
Vizag Fire Accident: విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, రోగులకు తప్పిన ముప్పు
Vizag news: విశాఖపట్నంలో ఇటీవలే మెడికవర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మర్చిపోక ముందే మరో ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది.
![Vizag Fire Accident: విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, రోగులకు తప్పిన ముప్పు Vizag news fire accident in seven hills hospital in visakhapatnam Vizag Fire Accident: విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, రోగులకు తప్పిన ముప్పు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/11/1209c6d8454e89056863fc4b07fec0811723368471085234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Visakhapatnam News: విశాఖపట్నంలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రి భవనంలోని ఐదో అంతస్తులో ఉన్న అడ్మిషన్ బ్లాక్ లో ఈ ప్రమాదం చెలరేగినట్లు తెలిసింది. హుటాహుటిన అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
మంటలు చెలరేగగానే అప్రమత్తం అయిన ఆస్పత్రి సిబ్బంది ఓపీలో ఉన్న పేషంట్స్ అందరినీ బయటకు పంపేసినట్లు తెలిసింది. ఇన్ పేషెంట్లుగా ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా చెబుతున్నారు. ఏసీ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ అడ్మిన్ బ్లాక్ పక్కనే పేషెంట్స్ ఉన్న బ్లాక్ ఉంది. అటువైపు మంటలు అంటకుండా అగ్నిమాపకశాఖ సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు.
విశాఖపట్నంలో ఇటీవలే మెడికవర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మర్చిపోక ముందే మరో ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)