అన్వేషించండి

Bus Fare Dispute: బస్ ఛార్జీ వివాదం, రన్నింగ్ బస్ నుంచి యువకుడ్ని నెట్టేసిన డ్రైవర్, కండక్టర్ !

బస్ ఛార్జీకి డబ్బుల కోసం గొడవపడి బస్ డ్రైవర్, క్లీనర్ ఓ యువకుడ్ని రన్నింగ్ బస్ నుంచి బయటకు నెట్టేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

Man pushed to death out of moving bus: బస్ ఛార్జీకి డబ్బులు ఉన్నాయో లేవో చెక్ చేసుకోలేకపోవడం తన ప్రాణాల మీదకి తెస్తుందని యువకుడు అనుకోలేదు. బస్ ఛార్జీకి డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో బస్ డ్రైవర్, క్లీనర్ ఆ యువకుడ్ని రన్నింగ్ బస్ నుంచి బయటకు నెట్టేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఏదో బిహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో కాదు.. ఏపీలో జరిగిందని తెలిసి తెలుగు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

అసలేం జరిగిందంటే.. 
జి భరత్ కుమార్ అనే 27 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి విశాఖపట్నం నుంచి కారులో శ్రీకాకుళం వెళ్లాడు. అయితే ఏదో పని ఉండి స్నేహితులతో కాకుండా ముందే విశాఖకు తిరిగి రావాలనుకున్నాడు. స్నేహితులు భరత్ కుమార్ ను భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్ ఎక్కించారు. మే 3న రాత్రి దాటిన తరువాత శ్రీకాకుళంలో బస్ ఎక్కిన భరత్ ను కండక్టర్ టికెట్ ఛార్జీలు ఇవ్వమని అడిగాడు. బస్ ఛార్జీ రూ.200 అవుతుందని కండక్టర్ (క్లీనర్) అప్పన్న చెప్పగా.. తన వద్ద డబ్బులు లేవని భరత్ చెప్పడంతో డ్రైవర్ రామక్రిష్ణ, కండక్టర్ సీరియస్ అయ్యారు. డబ్బులు లేకుండా బస్ ఎక్కడం ఏంటని ప్రశ్నించారు. అయితే తన స్నేహితులతో కలిసి కారులో శ్రీకాకుళం వచ్చానని, అర్జంటుగా పని ఉందని ఇంటికి తిరిగి వెళ్తున్నానని చెప్పాడు భరత్ కుమార్. ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి ఫోన్ పే చేయిస్తానని చెప్పడంతో డ్రైవర్, కండక్టర్ సరేనన్నారు. అయితే ఎంత సేపటికి భరత్ స్నేహితులు బస్ ఛార్జీ డబ్బులు ఫోన్ పో చేయలేదు. దీంతో మరోసారి ఫోన్ చేయాలని భరత్ కుమార్ చెప్పగా.. అతడు ఫ్రెండ్స్ కు కాల్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని ఏదో చెప్పే ప్రయత్నం చేయడంతో ప్యాసింజర్ భరత్ తో డ్రైవర్  రామకృష్ణ, కండక్టర్ అప్పన్న గొడవకు దిగారు. ఆ తరువాత కదులుతున్న బస్సు నుంచి భరత్ కుమార్ ను రోడ్డుమీదకి నెట్టేశారు. ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన యువకుడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. మూడు రోజుల తరువాత డ్రైవర్ రామకృష్ణ, కండక్టర్ అప్పన్న భయంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. తాము తప్పు చేశామని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. హత్య అభియోగంపై ఇద్దర్ని అరెస్ట్ చేశారు. అయితే బస్ ఛార్జీలకు డబ్బులు లేవని చెప్పిన యువకుడ్ని రన్నింగ్ బస్ నుంచి నెట్టివేయడం పై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాల్సింది పోయి, ఓ వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణం అయ్యారని తీవ్రంగా విమర్శించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి బంధువులు, కుటుంబసభ్యులు పోలీసులను కోరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget