Visakha News: సీఎం జగన్ ను కలిసిన ఈఎన్‌సీ ఫ్లాగ్ ఆఫీసర్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, సన్మానం
Vice Admiral Rajesh Pendharkar Meets YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ ని తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు.
Vice Admiral Rajesh Pendharkar Meets YS Jagan:
అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ (ఏవీఎస్‌ఎమ్, విఎస్‌ఎమ్) మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఈఎన్‌సీ ఛీఫ్‌గా రాజేష్ పెంధార్కర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో మంగళవారం క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ తో రాజేష్ పెంధార్కర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈఎన్‌సీ ఫ్లాగ్ ఆఫీసర్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్‌ను సన్మానించి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రతిమ అందజేశారు సీఎం వైఎస్ జగన్.
మిలన్ 2024కు ఆతిథ్యమివ్వనున్న విశాఖ..
తూర్పు సముద్ర తీరంలో సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్ళను అధిగమించేందుకు భారత నావికాదళం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివరించారు వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్. తూర్పు నౌకాదళ కమాండ్ (ఈఎన్‌సీ) ఆధ్వర్యంలో వచ్చే ఫిబ్రవరిలో బహుపాక్షిక నావికా విన్యాసమైన మిలన్ 2024 కు విశాఖపట్నం నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. 57 దేశాల నుంచి ప్రముఖులు, నౌకాదళాల భాగస్వామ్యం ఉంటుందని అంచనా, మిలన్ 2024 విశేషాలను సీఎం జగన్ తో పంచుకున్న వైస్ అడ్మిరల్, అడ్మినిస్ట్రేషన్ అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు.
సీఎం వైఎస్ జగన్‌కు ఐఎన్‌ఎస్ విశాఖపట్నం షిప్ మోడల్‌ను బహుకరించారు కమాండింగ్ ఇన్ ఛీఫ్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్. ఈ సందర్భంగా నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్ విఎస్‌సి రావు (సివిల్ మిలటరీ లైజన్ (అడ్వైజరీ), కెప్టెన్ రోహిత్ కట్టోజు, కమాండర్ వైకే కిషోర్, లెఫ్టినెంట్ సాయికృష్ణ సీఎం జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు.