అన్వేషించండి

Simhachalam Incident: సింహాచలం దుర్ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు- న్యాయవిచారణకు వైసీపీ డిమాండ్ -కేంద్రానికి ఫిర్యాదు

Simhachalam Incident:సింహాచలంలో చందనోత్సవం రోజున గోడ కూలింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు చనిపోయారు. దీనిపై త్రిసభ్య విచారణ సాగుతోంది. మరోవైపు కేంద్ర సంస్థల దర్యాప్తు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.

Simhachalam Incident: విశాఖ జిల్లా సింహాచలం దుర్ఘటనలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు ఈ ఇన్సిడెంట్‌ను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం త్రిసభ్య కమిటీతో విచారణ చేయిస్తోంది. మరోవైపు ఇలాంటి దుర్ఘటనలు రాష్ట్రంలో కంటిన్యూగా జరుగుతున్నాయని జోక్యం చేసుకోవాలని కేంద్రానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. 

చందనోత్సవం రోజున సింహాచలం దేవస్థానంలో గోడ కూలి ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేపట్టింది. ఇందులో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు ఉన్నారు. ఈ కమిటీ సింహాచలంలో పర్యటించి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించింది. కాంట్రాక్టర్, ఇంజినీర్‌ను విచారించింది. 

ఈ కమిటీ విచారణలో కాంట్రాక్టర్, ఇంజినీర్‌ అయిన లక్ష్మణ్‌రావు కీలక విషయాలు వెల్లడించారని తెలుస్తోంది. తాత్కాలిక గోడను అధికారులే నిర్మించాలని చెప్పినట్టు విచారణ కమిటీకి చెప్పారట. దేవదాయ, పర్యాటక శాఖ ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇప్పుడు లక్ష్మణ్‌రావు ఇచ్చిన సమాచారం మేరకు దేవాదాయశాఖ, పర్యాటక శాఖ అధికారులను కూడా కమిటీ విచారించే అవకాశం ఉంది. 

ప్రస్తుతానికి లక్ష్మణ్‌రావుతోపాటు ఈవో ఈవో సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజును కూడా త్రిసభ్య ధర్మాసనం విచారించింది. నోట్ ఫైల్, M బుక్, వర్క్ ఆర్డర్, మీటింగ్ మినిట్స్ అన్నింటి గురించి ఆరా తీశారని సమాచారం. ఘటన ఎలా జరిగిందనే విషయంపై ఒక్కరు చెప్పిన విషయాలతో ఓ నిర్ణయానికి రాలేమని త్రిసభ్యకమిటీ అభిప్రాయపడింది. ఇప్పుడు లభించిన సమాచారం మేరకు మిగతా వాళ్లను కూడా విచారిస్తామన్నారు. వివరాలు సేకరించి, అందర్నీ విచారించి మూడు రోజుల్లోనే ప్రాథమిక నివేదిక ఇస్తామని వివరించారు. పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు నెల రోజుల సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు.   

కేంద్రం జోక్యం చేసుకోవాలి: వైసీపీ ఎంపీ

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై జోక్యం చేసుకోవాలని వైసీపీకి చెందిన ఎంపీ గురుమూర్తి కేంద్రానికి లేఖ రాశారు. దేవాలయాల్లో వరుస దుర్ఘటనలు జరుగుతున్నాయని కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని అందులో విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తిరుపతి లేఖ రాశారు.  పరిపాలన వైఫల్యం, భద్రతా లోపాల కారణంగా భక్తుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, చందనోత్సవం సందర్భంగా జరిగిన దుర్ఘటన గురించి కేంద్రానికి హోంమంత్రి వివరించారు.  టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో కూడా వందకుపైగా ఆవులు చనిపోయినట్టు తెలిపారు. ఇవన్నీ పాలనా వైఫల్యాలేనని ధ్వజమెత్తారు. జోక్యం చేసుకొని ఆయా సంస్థల పవిత్రత కాపాడాని వేడుకున్నారు. 

జ్యుడీషియల్ విచారణ చేపట్టాలి: వైసీపీ

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సింహాచలం దుర్ఘటన జరిగిందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇలాంటి టైంలో ప్రభుత్వాధికారులతో విచారణ చేపిస్తే నిజాలు ఎలా వెలుగులోకి వస్తాయని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయన్నారు. ప్రచారంపై ఉన్న పిచ్చి కారణంగానే ఇది జరిగిందని ధ్వజమెత్తారు. వీఐపీలపై పెట్టిన శ్రద్ధ సామాన్య భక్తులపై చూపించలేదన్నారు.  అందుకే ఈ ప్రమాదంపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంతజరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని కనీసం సంప్రోక్షణ కూడా చేయలేదని ఆరోపించారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget