అన్వేషించండి

గంగవరం పోర్టు యాజమాన్యం అబద్దాలకు హద్దులేదా?

విశాఖస్టీల్‌ప్లాంట్‌చెల్లింపులుఆలస్యమైనప్పటికీ స్టీల్‌ ప్లాంట్‌కుసక్రమంగాదిగుమతులను అందించామని ఆగస్ట్ 5వతేదీపోర్టుయాజమాన్యంచేసినప్రకటనఅవాస్తవమని విశాఖ ఉక్కు పరిరక్షణపోరాట కమిటీ ఛైర్మన్‌ నరసింగరావు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ చెల్లింపులు ఆలస్యమైనప్పటికీ స్టీల్‌ ప్లాంట్‌కు సక్రమంగా దిగుమతులను అందించామని ఆగస్ట్ 5 వ తేదీని పోర్టు యాజమాన్యం చేసిన ప్రకటన అవాస్తవమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌ నరసింగరావు ఆరోపించారు. అదానీ గ్రూప్ యాజమాన్యానికి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ఎటువంటి శ్రద్ద లేదని ప్రకటని చేయడం హాస్యస్పాదమని ఆయన అన్నారు. యూనియన్‌ లపై పోర్టు యాజమాన్యం చేసిన ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

గంగవరం పోర్టులో జులై చివరి వారంలో 3 రోజులు వెయ్యి కోట్ల విలువైన కోకింగ్ కోల్‌ ను అమెరికా, ఆస్ట్రేలియా నుంచి జులై 12 వ తేదీన వచ్చిన 3 షిప్‌ లను 24 గంటల్లో బెర్త్‌ ఇవ్వాల్సి ఉండగా 18 వ తేదీ వరకు గంగవరం పోర్టు బెర్త్ లకు రాకుండా పోర్టులోనే ఆపిన విషయం పై దేశమంతా భగ్గుమందని ఈ సందర్భంగా చైర్మన్‌ గుర్తు చేశారు. కానీ పోర్టు యాజమాన్యం మాత్రం స్టీల్‌ ప్లాంట్‌ దిగుమతులు సక్రమంగా చేసినట్లు నంగనాచి కబుర్లు చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వారు హెచ్చరించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ద్వారానే గంగపోర్టు అత్యధిక లాభాలతో నడుస్తున్నట్లు వారు తెలిపారు. గంగవరం పోర్టు గోడను దాటగానే స్టీల్ ప్లాంట్‌ ఉన్నా ప్రతి సంవత్సరం 5 శాతం చొప్పున పెంచుతూ విపరీతమైన ఛార్జీలు స్టీల్‌ ప్లాంట్‌ నుంచి వసూళ్లు చేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు.

గంగవరం పోర్టు పాత యాజమాన్యం డీవీఎస్ కస్సోర్సీయంతో చేసిన దిగుమతులు టారిఫ్ ను కేంద్ర ప్రభుత్వం నుంచి స్టీల్‌ ప్లాంట్‌ పై ఒత్తిడి తెచ్చి ఏకపక్షంగా పెంచిందని ఆరోపించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పై మోపిన అదనపు భారాన్ని తగ్గించాలి. పాత టారిఫ్‌ ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 

దక్షిణ కొరియా ఫోస్కో కంపెనీ, అదానీ గ్రూప్‌ కలిసి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలు 2017 నుంచి ప్రారంభించారనడానికి పూర్తి ఆధారాలున్నాయి. 2018 లో అప్పటి స్టీల్ శాఖ మంత్రి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భూములను గంగవరం పోర్టు వైపు ఉన్న 2 వేల ఎకరాలను కేటాయించే విషయాన్ని పరిశీలించారని నరసింగ రావు తెలిపారు. 


సీఐటీయూ ఈ ఆధారాలను బయటపెట్టి ప్రభుత్వాన్ని సవాల్‌ చేసిన తరువాత ప్రభుత్వం వెనక్కి తగ్గిందని తెలిపారు. ఇప్పటి వరకు నిశ్శబ్దాన్ని నటించారు. కానీ గంగవరం పోర్టును అదానీ గ్రూప్‌ స్వాధీనం చేసుకున్న తరువాత తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తున్నారని తెలుస్తుంది.   కేంద్ర ప్రభుత్వం ఒక వైపున విశాఖ స్టీల్‌ కార్మికులు, అధికారులకు వేతన ఒప్పందం 1-1-2017 నుంచి అమలు చేయలేదని పేర్కొన్నారు.

 ప్రమోషన్‌లు లేవు. కానీ దేశంలో అన్ని స్టీల్‌ప్లాంట్లకు వేతన ఒప్పందం చేసి వారికి బకాయిలు కూడా సంవత్సరం క్రితమే చెల్లించారు. గత 4సంవత్సరాల్లో సుమారు 4వేల మంది ఉద్యోగులు, ఆఫీసర్లు రిటైర్డ్ అయినప్పటికీ కూడా కొత్తగా ఒక్కరిని కూడా ఉద్యోగాల్లోకి తీసుకోలేదని వారు ఆరోపించారు. ప్రాణాలు తెగించి పనిచేసే వారిపై కేంద్రప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.  మరోవైపున రూ. 1800 కోట్లతో రైళ్ళువీల్‌ ప్లాంట్‌, ఒరిస్సా మైనింగ్‌ కార్పొరేషన్‌ కొనుగోలు పేరుతో సుమారు రూ. 1000కోట్లు ఒక్క టన్నుకూడా నేటికి రాకుండా నిధులు కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని నరసింగరావు పేర్కొన్నారు. 

గత సంవత్సరం దేశంలో అన్ని స్టీల్‌ప్లాంట్‌లకు లాభాలు వస్తే విశాఖ స్టీల్‌లో 40% ఉత్పత్తి తగ్గించి రూ.  3,900కోట్లు నష్టాలు తెప్పించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ను ప్రైవేట్‌ చేయడానికి మోడీ, అదానీ చేస్తున్న కుట్ర ఇది అని వారు విమర్శిచారు.   అదానీ గ్రూప్‌కు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ఆసక్తి లేదని తేలిగ్గా అబద్దాలు ఆడడం సరికాదని పేర్కొన్నారు. 

మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్‌కు రాష్ట్రంలో విజయనగరం జిల్లాలోని గర్భంలో ఉన్న మాంగనీస్ గనులు, సరిపల్లి వద్ద ఉన్న ఇసుక గనులు, అనకాపల్లిలో కింతాడ వద్ద ఉన్న క్వార్ట్జ్‌ గనుల లీజులు ప్రతి సంవత్సరం ఆటోమేటిక్‌ గా రెన్యువల్‌ జరగాల్సి ఉన్నప్పటికీ రెన్యూవల్‌ పొడిగించకపోవడం దుర్మార్గం అని పేర్కొన్నారు. దీని వలన కంపెనీ పై అదనపు భారం పడుతున్నది. తక్షణమే లీజలును రెన్యువల్‌ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Visakhapatnam Airport Service Ends: కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget