టీడీపీ జనసేన కలయికతో జగన్ మైండ్ బ్లాంక్ అయింది- సైకిల్ ఎక్కుతున్నట్టు నిర్మాత నట్టి కుమార్ ప్రకటన
ప్రముఖ తెలుగు నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. తమ లాంటి వారిని వైసీపీ స్వార్థానికి ఉపయోగించుకుందని విమర్శించారు.
Producer Natti Kumar Hot Comments : ప్రముఖ తెలుగు నిర్మాత నట్టి కుమార్ (Natti kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh )లో రెడ్డి కుల పాలన చేశారని తీవ్ర విమర్శలు చేశారు. చోడవరం (Chodavaram)లోని పూర్ణా థియేటర్ లో మాట్లాడిన నట్టికుమార్... తమ లాంటి వారిని వైసీపీ (YSRCP)స్వార్థానికి ఉపయోగించుకుందని విమర్శించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని రూ. 2 వేల కోట్ల విలువైన చర్చి ఆస్తులను విశాఖ ఎంపీ సత్యనారాయణ సొంతం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
జగన్ కు మైండ్ బ్లాంక్
ఉత్తరాంధ్రను మోసం చేసేందుకు రాజధాని పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నాటకాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తించారని, త్వరలోనే ఆయనకు బుద్ది చెబుతారని అన్నారు. గతంలో తాను జగన్ కు సానుభూతిపరుడిగా పని చేశానన్న ఆయన, సీఎం తీసుకుంటున్న నిర్ణయాలతో విసిగిపోయానని వెల్లడించారు. చంద్రబాబు ఆలోచన విధానానికి... ప్రజా బలం ఉన్న పవన్‌కల్యాణ్ తోడవడంతో జగన్‌కు మైండ్ బ్లాంక్ అయిందన్నారు. వారిద్దరూ బలంగా ఉండటంతోనే జగన్ దండయాత్రలు చేయిస్తున్నాడని మండిపడ్డారు
2వేల కోట్లు చర్చి దోచేస్తున్నారు
కెనడా వాసులు చర్చి కోసం ఇచ్చిన భూములను లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖలో చర్చి ఆస్తులు అమ్మడానికి, కొనడానికి వీలు లేకపోయినా...అధికారంతో వేల కోట్ల ఆస్తులను సొంతం చేసుకుంటున్నారని ఆరోపించారరు. ఎంపీ సత్యనారాయణ రూ. 2 వేల కోట్ల విలువైన చర్చి ఆస్తులను సొంతం చేసుకుంటున్నారని తెలిపారు. కోట్ల రూపాయల పరిశ్రమలు వస్తున్నాయని చెబుతున్న పరిశ్రమల మంత్రి అమర్ నాథ్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ? ఎక్కడ వచ్చాయో చెప్పాలన్నారు.