Srikakulam News Today: అప్రమత్తంగా లేకుంటే ఉద్యోగానికి ముప్పే- శ్రీకాకుళం జిల్లా అధికారులకు ఝలక్ ఇచ్చిన కలెక్టర్, ఎస్పీ
Latest News In Sikakulam:శ్రీకాకుళంలో తనిఖీలతో ఇద్దరు జిల్లా అధికారులు సిబ్బిందిని ఉక్కిరిబిక్కిరి చేశారు. వారి పనితీరుపై ఆరా తీశారు. ఇకపై కూడా ఇలాంటి సర్‌ప్రైజ్ విజిట్స్ ఉంటాయని చెప్పకనే చెప్పారు.
Srikakulam Latest News : శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు జిల్లా ఉన్నతాధికారులు సిబ్బందిని పరుగులు పెట్టించారు. ఆకస్మితంగా తనిఖీలు చేపట్టి సిబ్బందికి ముచ్చెమటలు పట్టించారు. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. సడెన్‌గా ఉన్నతాధికారులు రావడంతోనే సగం నీరుగారిపోయిన ఉద్యోగులు ప్రశ్నలు అడగడంతో మరింత కంగారు పడిపోయారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 7న అన్నిపాఠశాలల్లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టైంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఏర్పాట్లు పరిశీలించారు. ముఖ్యంగా 14 రకాల కమిటీల పని తీరును, ఆహ్వాన పత్రికల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు సంబంధించిన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను, హెల్త్ కార్డులను పరిశీలించారు. విద్యార్థినుల హోలిస్టిక్ కార్డులను ఇచ్చేటప్పుడు, తల్లిదండ్రులతో ఏ విధంగా మాట్లాడతారు..? అనే విషయాలపై కూడా ప్రశ్నలు వేశారు. తరగతి గది బయట, వ్యక్తిగతంగా, ప్రతి తల్లి లేదా తండ్రి మాట్లాడేటప్పుడు ఆ విద్యార్థిని హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ గురించి ఏ విధంగా చెబుతారు..? అంటూ కలెక్టర్ ప్రశ్నించారు. వెంటనే స్పందించిన ఉపాధ్యాయిని వసంతకుమారి చాలా వివరంగా తల్లిదండ్రులతో మాట్లాడే పద్ధతిని వివరించారు. అందుకు ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం.. పాఠశాలలో సమావేశం జరిగే మైదానాన్ని కూడా పరిశీలించారు. చివరిలో ఉపాధ్యాయులందరికీ "ఆల్ ద బెస్ట్" చెప్పి వెనుదిరిగాు కలెక్టర్
శ్రీకాకుళంఎస్పీ ఆకస్మిక తనిఖీలు
శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ రద్దీ, సమస్యలపై జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి ఆరా తీశారు. పట్టణ పరిధిలో నలువైపులా విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టాలని, పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు. గురువారం సాయంత్రం జిల్లా ఎస్పి శ్రీకాకుళం పట్టణంలోని డే అండ్ నైట్, రామ లక్షణ, ఏడు రోడ్లు, అరసవల్లి మిల్లు జంక్షన్‌తో పాటు, శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. సాయంత్రం పూట పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు, ట్రాఫిక్ రద్దీపై ఆరా తీశారు. పట్టణంలోకి వచ్చే వెళ్లే వాహనాలు, పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలకు గల కారణాలు పరిశీలించారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్న వాహన తనిఖీల సరళిని పరిశీలించి, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. మద్యంతాగి వాహనాలను నడిపేవారిని, మైనర్ డ్రైవింగ్, లైసెన్స్ లేని వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని సూచించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై, జరిమానాలు విధించి, ప్రమాద నివారణ చర్యలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
టూ టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ:
జిల్లా ఎస్పీ శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది పనితీరు ఆరా తీసి, రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌నకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలను పరిష్కరిం చాలని సూచించారు.
జిల్లాలో ఇద్దరు ఆఫీసర్లు చెరోవైపు వెళ్ళడంతో కింద స్థాయి అధికారులు పరుగులు తీశారు. ఒక్కసారిగా స్కూల్‌కు జిల్లా కలెక్టర్ రావడంతో ఉపాధ్యాయులకు ఊపిరి ఆడలేదు. పీటీ కోసం జరుగుతున్న ఏర్పాట్లపైనే ప్రశ్నలు వేసి వదిలేయడంతో అంతా కూల్ అయ్యారు. తర్వాత కలెక్టర్‌ను పిల్లలు కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానం చెప్పారు కలెక్టర్. చివరిగా నవ్వుతూ బాగా చదవండి అని ధైర్యం చెబుతూ వెళ్లారు.
ఒక స్కూల్‌ను విజిట్ చేయడంతో ఆ సమాచారం మిగతా స్కూళ్లకు చేరిపోయింది. దీంతో అంతా అలర్ట్ అయ్యారు. ఏ క్షణమైనా జిల్లా కలెక్టర్ వచ్చే అవకాశం ఉంది అంటూ ఫోన్ కాల్స్‌తో హడావిడి చేశారు. అదే టైంలో శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయం నుంచి బయల్దేరి... స్టేషన్‌లో ఆపారు. అక్కడ ఉన్న అధికారులు లేకపోవడంతో ఎక్కడికి వెళ్లారు అని ఆరా తీశారు.
ఈ టూర్‌లో కింది స్థాయి సిబ్బందిని ఏమీ అనని కలెక్టర్, ఎస్పీ వారి పని తీరు మెరుగుపరుచుకోవాలని సూచనలు మాత్రం చేశారు. రూల్స్ పాటించాలని ప్రజలకు మెరుగైనా సేవలు చేయాలని చెప్పారు. ఇది ట్రయల్ రన్ మాత్రమే అని ఇకపై కచ్చితంగా ఏదో ప్రాంతంలో తనిఖీలు ఉంటాయని చెప్పకనే చెప్పారంటున్నారు.