Srikakulam News: అయ్యప్ప దీక్షా దుస్తులు ధరిస్తే ఆ స్కూలుకు నో ఎంట్రీ - ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు!
Srikakulam News: శ్రీకాకుళంలోని ఓ క్రిష్టియన్ విద్యా సంస్థ అయ్యప్ప దీక్షా దుస్తులు ధరిస్తే పిల్లలను బడికి రానివ్వడం లేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు హిందూ ధార్మిక సంఘాలు ధర్నాలు చేస్తున్నాయి.
Srikakulam News: శ్రీకాకుళం జిల్లాలోని ఓ క్రిస్టియన్ విద్యా సంస్థ.. ఆ బడిలో చదివే విద్యార్థులు అయ్యప్ప దీక్షా దుస్తులు ధరిస్తే పాఠశాలకు రానివ్వడం లేదు. కేవలం పాఠశాలకు చెందిన యూనిఫాం మాత్రమే వేస్కోవాలని అలా కుదరని పక్షంలో బడికి రావొద్దని తెలిపింది. అయితే ఆ విద్యా సంస్థ తీరుపై హిందూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హిందూ ధార్మిక సంస్థలు, సంస్థలు కూడా బడి తీరుకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తోంది. అన్ని మతాల సంప్రదాయాలను గౌరవించాల్సిందేనని.. హిందూ సంఘాల నాయకులు చెబుతున్నారు. మాల వేసుకున్నన్ని రోజులు.. పిల్లలు అవే బట్టల్లో వస్తారని, అందుకు విద్యా సంస్థలు కూడా ఎలాంటి అభ్యంతరం తెలపొద్దని వివరించింది.
అయ్యప్ప దీక్షా దుస్తులు వేస్కొని వస్తే నో ఎంట్రీ..
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తెలుగు బ్రాహ్మణ వీధిలో ఇన్-ఫాంట్ జీసస్ స్కూల్ ప్రీకేజీ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. కార్తీక మాసం కావడంతో ఆ విద్యా సంస్థల్లో చదివే కొందరు విద్యార్థులు తమ తలిదండ్రులతో పాటు అయ్యప్ప దీక్షలు చేపట్టారు. అప్పటి నుంచి ఆ బడిలో వారికి నో ఎంట్రీ విధానాన్ని పెట్టింది యాజమాన్యం. అయ్యప్ప మాల ధారణ చేస్తే చేసుకోండి కానీ.. అయ్యప్ప మాల దుస్తులు వేసుకొని బడికి మాత్రం రాకూడదని తెలిపింది. ఒక వేళ అలా కాదని వస్తే పాఠశాలలోకి రానివ్వడం లేదు. ఇదే విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు.. పాఠశాల యాజమాన్యాన్ని బతిమాలింది.
తరగతి గుదుల్లోకి వెళ్లి మరీ యూనిఫాం తొలగింపు..
అయితే అయ్యప్ప మాల వేసుకున్న పిల్లలు ఆ తర్వాత పైనుంచి స్కూల్ యూనిఫాం వేస్కుంటేనే లోపలికి అనుమతిస్తామని లేకపోతే బడికి సెలవులు పెట్టుకోండని చెప్పింది. ఏవైనా పరీక్షలు ఉంటే తర్వాత మేమే ప్రత్యేకంగా పెడతామని వివవరించింది. అయితే విద్యా సంస్థ తీరుపై తల్లిదండ్రులు..మండల విద్యా శాఖ అధికారులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. ఒంటిపై అయ్యప్ప దుస్తులపై ఉన్న యూనిఫార్మ్ ను తరగతి గదుల్లోకి వెళ్లి మరీ తొలగించారు మండల విద్యాశాఖ అధికారులు. అలాగే విషయం తెలుసుకున్న హిందూ ధార్మిక సంస్థలు, సంఘ నాయకులు క్రిస్టయిన్ స్కూల్ వ్యవహార శైలిపై మండి పడుతున్నారు.
హిందు సంస్కృతి సంప్రదాయలను అవహేళన చేస్తూ.. వాటిని అడ్డుకునే విధంగా ఇలాంటి క్రిస్టియన్ స్కూల్స్ చేస్తున్నాయంటూ హిందూ ధార్మిక సంస్థలు తెలిపాయి. ప్రభుత్వం, అధికారులు వారిపై చర్యలు తీసుకోకపోతే హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి హిందువు ఖదం తొక్కుతామని అంటున్నారు. ఇప్పటికీ అయ్యప్ప దీక్ష తీసుకున్న వారిని అవే బట్టలతో బడికి రానివ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడాతమని వివరించారు. అందుకే ఇప్పటికైనా నో ఎంట్రీని ఎత్తివేసి.. పిల్లలను ఎలాంటి షరతులు లేకుండా బడిలోకి అనుమతించాలని చెబుతున్నారు.