అన్వేషించండి
Advertisement
Srikakulam News: శ్రీకాకుళం జిల్లాలో వాహనాలు వెళ్తుండగానే కుప్పకూలిన పురాతన బ్రిడ్జి- తప్పిన ముప్పు
Srikakulam News: శ్రీకాకుళం జిల్లా బహుదా నదిపై ఉన్న బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 70 టన్నుల బరువున్న లారీ వెళ్తుండగా బ్రిడ్జి కూలి వాహనాలన్నీ కిందపడిపోయాయి.
Srikakulam News: శ్రీకాకుళం జిల్లాలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన పురాతన బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఇచ్ఛాపురం సమీపంలోని బాహుదా నదిపై ఉన్న బ్రిడ్జి ఉదయం 6 గంటల సమయంలో ఒక్కసారిగా విరిగి పడింది. ఉదయం 70 టన్నుల బరువున్న రాళ్ల లారీ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జిపైన వెళ్తున్న వాహనాలన్నీ కింద పడిపోయాయి. అయితే వంతెన కుప్పకూలిన ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 1929లో దీనిని నిర్మించారు. ఇచ్ఛాపురం పట్టణం నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవటంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుందని స్థానికులు అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోలేదు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
న్యూస్
విశాఖపట్నం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion