అన్వేషించండి

Vizag News: వైజాగ్ నుంచి తిరుపతి, శబరిమల, చెన్నై, సికింద్రాబాద్‌కు స్పెషల్ ట్రైన్స్- టైమింగ్స్ ఇవే

East Coast Railway: సెలవుల్లో ఊళ్లకు వెళ్లే వాళ్లకు ఈస్ట్‌ కోస్ట్ రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా హైదరాబాద్, తిరుపతి, శబరిమల, చెన్నై వెళ్లే వాళ్లకు స్పెషల్ ట్రైన్ అందుబాటులో తీసుకొచ్చింది.

Andhra Pradesh: వరుస పండుగులు వస్తున్న వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు నగరాలకు ప్రత్యేక రైళ్ళు ప్రకటించింది. ముఖ్యంగా తిరుపతి, శబరిమల, చెన్నై ఎగ్మోర్, సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికుల కోసం ఈ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేసింది.

విశాఖ పట్నం - తిరుపతి - విశాఖపట్నం స్పెషల్ ట్రైన్ 

1) విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళే ఈ వీక్లీ స్పెషల్ ట్రైన్ (నెంబర్ 08583) 02.09.24 నుంచి 25.11.24 వరకూ ప్రతీ సోమవారం రాత్రి 7 గంటలకు వైజాగ్‌లో బయల్దేరనుంది. మరుసటి రోజు ఉదయం 9:15కు తిరుపతి చేరుకుంటుంది. ఈ ట్రైన్‌లో ఒక 2nd AC, ఏడు 3rd AC, 3rd AC (ఎకానమీ)-1, స్లీపర్ క్లాస్‌లు 6, జనరల్ క్లాస్‌లు 4 ఉంటాయి.

2) తిరుపతి - వైజాగ్ వీక్లీ (08584)
తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ 03.09 2024 నుంచి 26.11.2024 వరకూ ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 9:55కు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.15కు వైజాగ్ చేరుకుంటుంది.

ఈ వీక్లీ ట్రైన్స్ ఆగే స్టేషన్లు 
దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి,చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహ్తస్తి, రేణిగుంట

విశాఖ పట్నం - సికింద్రాబాద్ - విశాఖపట్నం వీక్లీ ఎక్స్ ప్రెస్
1) విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ఈ వీక్లీ స్పెషల్ ట్రైన్ (నెంబర్ 08579) 04.09.24 నుంచి 27.11.24 వరకూ ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 7 గంటలకు వైజాగ్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:05కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ట్రైన్‌లో ఒక 2nd AC, ఐదు 3rd AC, 10 స్లీపర్ క్లాస్‌లు, 5 జనరల్ క్లాస్‌ బోగీలు ఉంటాయి. 

2) తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే ఈ వీక్లీ స్పెషల్ ట్రైన్ (నెంబర్ 08580) 05.09.24 నుంచి 28.11.24 వరకూ ప్రతీ గురువారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 7:40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:15కు వైజాగ్ చేరుకుంటుంది.

ఈ వీక్లీ ట్రైన్స్ ఆగే స్టేషన్లు 
దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌను, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ.

వైజాగ్ - శబరిమల (కొల్లం)  - వైజాగ్ వీక్లీ ట్రైన్

1) వైజాగ్ నుంచి కొల్లం వెళ్లే ఈ ట్రైన్ (నెం 08539) 04.09.11 నుంచి 27.11.2024 వరకూ ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 08.20కు వైజాగ్‌లో బయలుదేరి గురువారం మధ్యాహ్నం 12:55కు కొల్లం చేరుకుంటుంది.

2) తిరుగు ప్రయాణంలో కొల్లం- వైజాగ్ వీక్లీ ట్రైన్ (నెంబర్ .08540) 05.09.2024 నుంచి 28.11.2924 వరకూ అందుబాటులో ఉంటుంది. ప్రతీ గురువారం రాత్రి 19:35కు కొల్లంలో బయలుదేరి శుక్రవారం రాత్రి 11:20కు వైజాగ్ చేరుకుంటుంది. 

ఈ ట్రైన్ ఆగే స్టేషన్ ల లిస్ట్
దువ్వాడ,ఎలమంచిలి,సామర్లకోట,రాజమండ్రి,ఏలూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల, ఒంగోలు, సింగరాయకొండ, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పడి జోలార్ పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిస్సుర్, ఆలువ, ఎర్నాకులం, కొట్టాయం, చెంగన్నూరు కాయంకులం, కరునాగప్పల్లి, సస్థనకొట్ట.

Also Read: వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ - సెప్టెంబర్‌లో మీరు గుడ్‌న్యూస్‌ వినొచ్చు!

వైజాగ్ - చెన్నై ఎగ్మోర్ - వైజాగ్ వీక్లీ 

1) వైజాగ్ - చెన్నై వీక్లీ ఎక్స్ ప్రెస్ (నెంబర్ 08557) 07.09.2024 నుంచి 30.11.2024 వరకూ ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 7 గంటలకు వైజాగ్‌లో బయలుదేరి ఆదివారం ఉదయం 8:45కు చెన్నై ఎగ్మోర్ చేరుకుంటుంది.

2)  చెన్నై ఎగ్మోర్ - వైజాగ్ వీక్లీ ఎక్స్ ప్రెస్ ( నెంబర్  08558) 08.09.11 నుంచి 01.12.2024 వరకూ ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది.  ఉదయం 10:30కు బయలుదేరి అదేరోజు రాత్రి 10:35 కు వైజాగ్ చేరుకుంటుంది.

ఈ ట్రైన్లో ఒక 1st AC, రెండు 2nd AC, నాలుగు 3rd AC, రెండు 3rd AC (ఏకానమీ ), స్లీపర్ క్లాస్లు-06, జనరల్ క్లాస్ లు 3 ఉంటాయి.

ఈ ట్రైన్స్ ఆగే స్టేషన్ లు
దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు

తిరుమల ఎక్స్ ప్రెస్‌కు నందలూరు హాల్ట్ పొడిగింపు.
ఈ స్పెషల్ ట్రైన్స్‌తోపాటు విశాఖపట్నం నుంచి కడప వెళ్లే తిరుమల ఎక్స్ ప్రెస్ (17488/17487) కు నందలూరు హాల్ట్ పొడిగించారు. మరో ఆరునెలల పాటు స్పెషల్ హాల్ట్‌ను పొడిగించింది ఈస్ట్ కోస్ట్ రైల్వే. విశాఖ నుంచి కడప వెళ్లే ట్రైన్ 06:14కు నందలూరు చేరుకుంటుంది. కడప నుంచి వైజాగ్ వచ్చే ట్రైన్ 18:09కు నందలూరులో ఆగుతుందని అధికారులు తెలిపారు..

Also Read: సెప్టెంబర్ ఏడున ఏపీలో మద్యం షాపుల బంద్! ఎందుకంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget