అన్వేషించండి

Srikakulam News: వాట్సాప్‌లో ఫొటోలు పంపిస్తారు, నచ్చితే హోం డెలివరీ చేస్తారు- శ్రీకాకుళంలో యథేచ్చగా వ్యభిచార దంద

Srikakulam Crime News: శ్రీకాకుళం జిల్లాలో వ్యభిచార కార్యకలాపాలు హైటెక్ పద్దతుల్లో సాగిపోతున్నాయి. నివాస గృహాలే అడ్డాగా ప్రత్యేక వసతులతో కొందరు రెచ్చిపోతున్నారు.

Srikakulam Crime News: శ్రీకాకుళం జిల్లాలో వ్యభిచార కార్యకలాపాలు హైటెక్ పద్దతులలో కొనసాగుతున్నాయి. వ్యభిచార గృహాల నిర్వాహకులు ప్రత్యేక వసతులను ఏర్పాటు చేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు పని కానిచ్చేస్తున్నారు. సెల్‌ఫోన్‌లు, వాట్సాప్‌లు వినియోగించుకుంటూ విటులను ఆకర్షిస్తున్నారు. విచ్చలవడిగా బిజినెస్ రన్ చేస్తున్నారు.  

శ్రీకాకుళంతో  పరిసర ప్రాంతాల్లో కావాల్సిన వారికి అమ్మాయిలను సప్లై చేస్తున్నారు. అక్రమార్జనే లక్ష్యంగా వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఉపాధి కల్పిస్తామని చెప్పి ఇతర ప్రాంతాల నుంచి యువతులను రప్పిస్తున్నారు. వారికి అధికంగా డబ్బులు ఆశ చూపించి ఈ వృత్తిలో దించుతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లా దాటి ఇతర ప్రాంతాలకు వ్యాపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. 

విలాసాలకు అలవాటు పడిన కొందరు యువతులు ఈ రొంపిలోకి దిగుతున్నారు. అలా ఈ వృత్తిలోకి దిగుతున్న వారు ఇతరులను సైతం ఈ కూపంలోకి లాగుతున్నారు. శ్రీకాకుళం నగర శివారు కాలనీలలోనే కాకుండా నగరం మధ్యలో ఉండే పలు వీధుల్లో ఇళ్లు అద్దెకు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు సాగిస్తున్నారు. స్థానికులకు అనుమానం వచ్చి ప్రశ్నిస్తే వెంటనే మకాం మార్చేస్తున్నారు. 

Also Read: విద్యుత్‌ షాక్‌తో ప్రాణం పోయిందా? రియల్ ఎస్టేట్ మింగేసిందా? పలాస వ్యక్తి హత్యలో అనేక అనుమానాలు

నగరంలోని పలు లాడ్జీల్లో కూడా వ్యభిచార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మొన్నటికి మొన్న శ్రీకాకుళంలోని జి.టి.రోడ్డులో ఉన్న ఓ లాడ్జీలో పోలీసులు తనిఖీలు చేస్తే ఈ బాగోతం బయటపడింది. మేజర్లమని కొందరు సరదాగా గడపడానికి వచ్చామని మరికొందరు పోలీసులకు సమాధానాలు చెప్పేసరికి వారి విని షాక్ అయ్యారు. అరసవల్లి సమీపంలోని ఆదిత్యనగర్ కాలనీలో ఓ ఇంటిలో కొందర్ని పట్టుకున్నారు. స్థానికుల ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. 

Srikakulam News: వాట్సాప్‌లో ఫొటోలు పంపిస్తారు, నచ్చితే హోం డెలివరీ చేస్తారు- శ్రీకాకుళంలో యథేచ్చగా వ్యభిచార దంద

ఇవి రెండు సంఘటనలు కేవలం పోలీసుల తనిఖీలు, ఫిర్యాదుతో వెలుగు చూసిన బాగోతాలే. వెలుగులోకి రాకుండా గుట్టుచప్పుడు కాకుండా శ్రీకాకుళంలో వ్యభిచార గృహాలు ఎన్నో కొనసాగుతున్నాయన్న చర్చ బహిరంగంగానే సాగుతుంది. శ్రీకాకుళంలోని బలగ, అరసవల్లి, పాతశ్రీకాకుళం, పి.ఎన్ కాలనీ, కిల్లిపాలెం, చాపురం పంచాయతీ పరిధిలో ఉండే నగర శివారు కాలనీలతోపాటు పలు వీధుల్లో వివిధ ఇళ్లు, ఫ్లాట్లలో వ్యభిచారం గుట్టుగా సాగిపోతుందట. 

వాట్సాప్ ద్వారా విటులకి ఫోటోలు

వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. వాట్సాప్ ద్వారా నిత్యం అమ్మాయిల ఫోటోలు పంపిస్తూ బేరసారాలను సాగిస్తున్నారు. యువతులు నచ్చిన విటులు వారు చెప్పే సమయానికి ఆయా ఇళ్ల వద్దకు చేరుకుంటున్నారు. కొంతమందిని వ్యభిచార కార్యకలాపాలకి కూడా బ్రోకర్లుగా నిర్వాహకులు వినియోగించుకుంటున్నారు. గృహాలును, ప్లాట్లను, పలు లాడ్జీలను అడ్డాగా చేసుకుని హైటెక్ పద్దతుల్లో దందా సాగిస్తున్నారు. పోలీసుల నిఘా కొరవడటంతో భయం లేకుండా పోతోంది.  

Srikakulam News: వాట్సాప్‌లో ఫొటోలు పంపిస్తారు, నచ్చితే హోం డెలివరీ చేస్తారు- శ్రీకాకుళంలో యథేచ్చగా వ్యభిచార దంద

ఇతర ప్రాంతాల నుంచి యువతులు
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అమ్మాయిలను ఇక్కడకు రప్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు యువతులను నిర్వాహకులు మారుస్తూ ఉంటారట. ఆయా గృహాల్లో ప్రత్యేకంగా యువతులకి వసతులు కల్పిస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళకి కూడా అనుమానం రాకుండా కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఆయా గృహాల్లో మద్యం సేవించేందుకు, విందు భోజనాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారని టాక్. పోలీసులు నిఘా పెట్టి ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని శ్రీకాకుళం ప్రజలు వేడుకుంటున్నారు.

Also Read: శ్రీకాకుళంలో క్రైమ్‌థ్రిల్లర్‌- తాళం వేసిన ఇంట్లో మహిళను హత్య చేసిందెవరు? పోలీసుల సీక్రెట్‌ విచారణ 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:చిత్తూరులో గంజాయి మత్తులో తండ్రిని చంపిన కుమారుడు- అడ్డు వచ్చిన మేనత్తకు గాయాలు!
చిత్తూరులో గంజాయి మత్తులో తండ్రిని చంపిన కుమారుడు- అడ్డు వచ్చిన మేనత్తకు గాయాలు!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Embed widget