Nara Lokesh: జడ్పీ స్కూళ్లో పెచ్చులూడి విద్యార్థి మృతి, మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి
Andhra Pradesh News | శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గంలో జెడ్పీ హైస్కూల్లో పెచ్చులూడి మీద పడటంతో ఓ విద్యార్థి మృతిచెందడంతో విషాదం చోటుచేసుకుంది.
Student Dies at ZP School | రణస్థలం: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలోని పాతర్లపల్లి జడ్పీ పాఠశాల (ZP School)లో పైకప్పు పెచ్చులూడింది. ఈ ఘటనలో 8వ తరగతి విద్యార్థి కృష్ణంరాజు మృతిచెందాడు. మరో విద్యార్థి గాయపడినట్లు సమాచారం.
రణస్థలం జెడ్పీ స్కూళ్లో సజ్జ కూలడంతో విద్యార్థి మృతిచెందడంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. విద్యార్థి కృష్ణంరాజు మృతిపట్ల లోకేష్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. వైసిపి హయాంలో నిర్మించి అసంపూర్తిగా వదిలేసిన పాఠశాల భవనం సన్ షెడ్ కూలి విద్యార్థి చనిపోయాడని తెలిపారు. పాఠశాలలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మృతిచెందిన బాలుడి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన మరో బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, పాతర్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో వైసిపి హయాంలో నిర్మించి అసంపూర్తిగా వదిలేసిన పాఠశాల భవనం సన్ షేడ్ కూలి కృష్ణంరాజు అనే పదో తరగతి విద్యార్థి చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరో విద్యార్థి ఈ ఘటనలో గాయపడటం బాధాకరం. పాఠశాలల్లో…
— Lokesh Nara (@naralokesh) September 25, 2024