News
News
X

టైం, డేట్, ప్లేస్ నువ్వు చెప్పు.. ఎవరేంటో తేల్చుకుందాం: మంత్రి జోగి రమేష్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

FOLLOW US: 
 
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ అంటే వేరే అర్థాలు చెప్పారు. ఆయన వాగుడుతో అది మరోసారి తేటతెల్లమైందని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ను ప్యాకేజీ కల్యాణ్ అని తాను ఇంతకు ముందు చెప్పానని, ఇప్పుడూ అదే చెబుతున్నానని అన్నారు. ప్యాకేజీ స్టార్ అనడం కొంత ఇబ్బందేనని సెటైర్లు వేశారు. నువ్వు చూపించిన చెప్పు ఇంతకు నీదేనా.. లేక నీ యజమాని కొనిచ్చారా అంటూ పవన్ కల్యాణ్ ను జోగి రమేష్ ప్రశ్నించారు. 

'దమ్ముంటే.. ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పు'

"ముసుగు దొంగల నిజస్వరూపం బయటపడింది. పవన్ కల్యాణ్.. ప్యాకేజీ కల్యాణ్. ప్యాకేజీకి అమ్ముడుపోయే వారే పవన్ కల్యాణ్. చరిత్రలో నువ్వు ఎప్పుడైనా నేను ముఖ్యమంత్రిని అవుతా అని అన్నావా..? చంద్రబాబు సంకలో పవన్ కల్యాణ్ లేరా..? ఆ చెప్పు అయినా నీదేనా.. లేక నీ యజమాని కొనిచ్చారా..? 2019 లో చెప్పులు అరిగేటట్టు మిమ్మల్ని కొట్టినా బుద్ధి రాలేదు. ఎన్నికల్లో యుద్ధం చేసి ఓడిపోలేదా..? పవన్ చేతికి నిన్న ఎక్కువ ప్యాకేజీ అందినట్లుగా ఉంది.. అందుకే ఎక్కువ మాట్లాడేశారు. 

విశాఖ గర్జన విజయవంతం కావడంతోనే పవన్ దాడి చేయించారు. కర్రలు, రాళ్లతో దాడి చేయించారు. సైకోలను మా మీదకు పంపారు. పవన్ కల్యాణ్ పిచ్చిXXX అని ఏడాదిన్నర క్రితమే చెప్పాను. ఆయన వాగుడుతో అది మరోసారి తేటతెల్లమైంది. అభివృద్ధి ప్రతీ గడపకు చేరాలని ముఖ్యమంత్రి తపన పడుతున్నారు. మా సిద్ధాంతం, అజెండా పరిపాలన వికేంద్రీకరణ అయితే.. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు, ముగ్గురు పెళ్లాల గురించి మాట్లాడుతున్నారు. పొద్దున బీజేపీకి విడాకులిచ్చి.. ఇప్పుడు చంద్రబాబును పెళ్లి చేసుకున్నాడు. అధికారం కోసం ఏ పార్టీనైనా పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత విడాకులు ఇవ్వడమే వీళ్ల సిద్ధాంతం. సినిమా డైలాగులు ఎక్కడ చెప్పాలో తెలియక.. ఇక్కడ మాట్లాడుతున్నారు. అని ఘాటు విమర్శలు చేశారు.

News Reels

అధికారం కోసం అర్రులు చాస్తారా..? సిద్ధాంతం లేదు, విలువలు లేవు, మానవత్వం లేదు. బాబు, పవన్ కలిసి వచ్చినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇంచు కూడా కదిలించలేరు. మేం తలుచుకుంటే పవన్ కల్యాణ్ లెక్క కాదు. టైం, డేట్, ప్లేస్ నువ్వు చెప్పు.. ఎవరేంటో తేల్చుకుందాం. కొట్లాడుకోడవం కాదు.. చర్చించుకుందాం. 14 ఏళ్ల నీ యజమాని చంద్రబాబు ఏం చేశారు.. మూడేళ్లలో వైఎస్ జగన్ సర్కారు ఏం చేసిందో చర్చించుకుందాం. నిజంగా నవ్వు రాజకీయ నాయకుడివి అయితే.. చంద్రబాబుకు అమ్ముడు పోకపోతే, నీకు దమ్ము ఉంటే.. ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పు. ప్యాకేజీ స్టార్ అని వంద సార్లు అంటాం. నీలాంటి నీచుడికి 2024 లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం" అని మంత్రి జోగి రమేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Published at : 18 Oct 2022 07:47 PM (IST) Tags: AP News AP Politics Visakha News Minister Jogi Ramesh Minister Fires on YCP

సంబంధిత కథనాలు

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

MP GVL On Visakha Port : విశాఖ పోర్టు కాలుష్య కట్టడికి చర్యలు చేపట్టండి, కేంద్రాన్ని కోరిన ఎంపీ జీవీఎల్

MP GVL On Visakha Port : విశాఖ పోర్టు కాలుష్య కట్టడికి చర్యలు చేపట్టండి, కేంద్రాన్ని కోరిన ఎంపీ జీవీఎల్

Mandous Cyclone : తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడిన మాండూస్, మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం!

Mandous Cyclone : తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడిన మాండూస్, మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం!

Visakha News: విశాఖ వేదికగా జీ-20 సదస్సు, ఫిబ్రవరి 3, 4 తేదీల్లో సమావేశాలు

Visakha News: విశాఖ వేదికగా జీ-20 సదస్సు, ఫిబ్రవరి 3, 4 తేదీల్లో సమావేశాలు

Rythu Bazar Employees: రైతు బజార్ల సిబ్బందికి సీఎం జగన్ గుడ్ న్యూస్!

Rythu Bazar Employees: రైతు బజార్ల సిబ్బందికి సీఎం జగన్ గుడ్ న్యూస్!

టాప్ స్టోరీస్

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?