KA Paul : ప్రేమించుకోండి- పెళ్లిళ్లు చేస్తాం, యువ ఓటర్లకు కేఏ పాల్ ఆఫర్
Paul Political Tricks: ప్రజాశాంతి అధ్యక్షుడు కె.ఏ.పాల్ యువ ఓట్లకు గాలం వేస్తున్నారు. వాలంటైన్స్ డే పురస్కరించుకుని ప్రేమించుకోండి- పెళ్లిళ్లు చేస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు
Valentines Day Offer: వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులకు ప్రజాశాంతి అధ్యక్షుడు కె.ఏ.పాల్( K.A.Paul) బంప్ ఆపర్ ప్రకటించాడు. ఒకరినొకరు ప్రేమించుకోండి..పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోండి.. వారి చేయకుంటే నా దగ్గరకు వస్తే తానే దగ్గరుండి పెళ్లి జరిపిస్తానంటూ హామీ ఇచ్చారు. తానే తమ పేరెంట్స్ తో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పారు.
పాల్ పెద్దమనస్సు
ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు ప్రేమను అందించేందుకు నడుం బిగించారు ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రవచనకర్త కె.ఏ.పాల్. ప్రపంచాన్ని యుద్ధంతో కాదు ప్రేమతోనే జయించాలని పదేపదే చెప్పే కె.ఏ.పాల్ ( K.A.Paul)...అసలు మనుషుల్లోనే ప్రేమను నింపితే అసలు యుద్ధాలే రావు కదా... ప్రపంచశాంతి వర్థిల్లుతుందని భావించారో ఏమో వాలంటైన్స్ డే సందర్భంగా యువతీ, యువకులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఒకరినొకరు కులమతాలకు అతీతంగా ప్రేమించుకోండి, తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోండి లేకపోతే తానే దగ్గర ఉండి పెళ్లి చేస్తానంటూ పిలుపునిచ్చారు. ప్రేమతో ఈ ప్రపంచాన్ని నింపేయండంటూ తనదైన శైలిలో చెప్పారు.
ప్రేమించుకోండి- పెళ్లిళ్లు చేస్తాం
తెలుగు రాష్ట్రాల్లో ఏ ఎన్నికలు వచ్చినా వలస పక్షి మాదిరిగా వాలిపోతుంటారు కె.ఎ.పాల్. అంతకు ముందు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ... ఎన్నికలకు ఆరునెలల ముందు వచ్చి హడావుడి చేయడం కె.ఎ.పాల్( K.A.Paul) కి రివాజుగా మారింది. ఎన్నికల్లో డిపాజిట్లు రాకపోయినా... ఆయన చేసే స్టంట్స్ అన్నీ ఇన్నీ కావు. తన మాటలు, చేష్టలతో నవ్వులుపాలు కావడమే కాదు...జనాన్ని మంచి ఎంటైర్టైన్ చేస్తుంటారు కె.ఎ.పాల్. ఇప్పుడు ప్రేమికులకు పెళ్లిళ్లు చేయడం కూడా అలాంటిదేనని జనం నవ్వుకుంటున్నారు.
పెద్దోళ్లు ఓట్లు వేయడం లేదని భావించిన పాల్..కనీసం యువత ఓట్లు అయినా సంపాదించి డిపాజిట్ దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఏపీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో తిరుగుతున్న పాల్... యువతను ఆకర్షించేలా ప్రేమించుకోండి- పెళ్లిళ్లు చేస్తామంటూ ఆఫర్లు ప్రకటించారు. ఎవరైనా ఎన్నికలకు వస్తువులు తాయిళాలుగా వేస్తారు కానీ..మన పాల్ రూటే సెపరేట్ కాబట్టి ఏకంగా ఓటర్లకు ప్రేమను ఎరగా వేశారు. పిల్లల ఓట్లకు గాలం వేశారు సరే... మరి వాళ్ల తల్లిదండ్రులు ఓట్లు వద్దా అంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపని ఈ యువతీ యువకులు పోలింగ్ రోజు వచ్చి ఓట్లు వేస్తారో లేదో తెలియదు కానీ వారి తల్లిదండ్రులు మాత్రం ఓటు వేస్తారు. కులమతాలకు అతీతంగా ప్రేమించుకోండి...పెళ్లిళ్లు చేస్తామంటూ ఆఫర్ ప్రకటించిన పాల్ కు... వారి తల్లిదండ్రుల ఓట్లు మాత్రం వద్దా అంటూ కామెంట్ చేస్తున్నారు.
పాల్ కూడా ప్రేమించి కులమతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్నారు. తన కుమార్తె ఇష్టపడిన వ్యక్తినే ఇచ్చి ఆమె పెళ్లి చేశారు. ఎప్పుడూ అసెంబ్లీకి పోటీ చేసే కె.ఎ.పాల్..ఈసారి లోక్ సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. విశాఖ నుంచి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా తానే బరిలో నిలవనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తప్పకుండా తాను పార్లమెంట్ లోఅడుగుపెడతానని దీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read:టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు సాగతీత ఎంత కాలం - బీజేపీ ఎటూ తేల్చనీయడంలేదా ?